పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/633

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రచయితలు

737


రచనకు సర్వథా గుణం కలుగుతుందిగాని, దోషం కలుగదు. కనక, అధ్యాత్మరామాయణ కర్తకు రచయితల పంక్తిలో స్థానం వుండితీరుతుందని చెప్పడానికి యే విధమైన అభ్యంతరమున్నూ నాకు గోచరించడంలేదు. అయితే, వేలకొలదిగా కీర్తనలు రచించిన త్యాగరాయలవారికో అంటారా? అనండి. వినండికూడాను. వారు యెన్నివేలు కీర్తనలు రచించినా గాయకులుగా లోకానికి పరిచితులుగా వుండడమే వారి అభీష్టంగాని, కవులుగా వుండి పరిచితులు కావడం వారి అభీష్టంకాదు. కనక మనం వారిని బలవంతంగా రచయితల పంక్తిలో కూర్చోపెట్టక వేఱే స్వహస్తపాకులుగా వుంచడమే నాకు సమంజసంగా తోస్తుంది. అయితే, అన్యబుద్ధి అప్రత్యక్షం గదా? వారికి కవులపంక్తిలో చేరడానికి యిష్టంలేదని మీకేలా తెలిసిందంటారేమో? యిది "స్వానుభూత్యేకమానాయ" ఆ అనుభవం యెట్టిదంటే : నాకు 24 వత్సరాల ప్రాయంలో, అంటే శ్రీ విజయనగరం మహారాజులుంగారి సందర్శనంకూడా చేసినదరిమిలా నన్నమాట.

“అటు గద్వాలిటు చెన్నపట్టణము . . . . మా
 కిట రాజీయకయున్న దర్శనము నింకెవ్వాని కీ రా జొసం
 గుట చెప్పంగదవయ్య ... ... ... కోదండరామాభిధా”
                                                  ('సందర్శనం, చూ.)

గానమందు కృషి చేదామని కుతూహలం కలిగింది. దానికి అవకాశం యెట్టిదంటే, "భార్యా మూల మిదం గృహం” కనక యజ్ఞోపవీతాలు దండిగా ధరించడానికి అనుకూలించే గృహస్థాశ్రమప్రవేశమే గాని అప్పటికి అంతకు మించిన గృహస్థాశ్రమంలో నేను చేరలేదు. వ్యాకరణగ్రంథాలు తరువాయి లేవు. తర్కం మొదలెడితే, త్వరలో తేలదు. అదిన్నీ కాక, కవిత్వానికీ, తర్కానికీ చుక్కెదురు. అందుచేతనే అనుకుంటాను కాళిదాసు “నమః ప్రామాణ్యవాదాయ మత్కవిత్వాపహారిణే" అని వొక నమస్కారం చేసినట్లు పెద్దలవల్ల వినడం. అంతమాత్రమే కాదు, “నో వైయాకరణజ్ఞ మేవ పితరం, న భ్రాతరం తార్కికం" అనివుండడంచేత వావికూడా అనుకూలించదు. గానం యెక్కడి కక్కడికే వుపయోగం. “కూనిరాగం తీయలేని మొగాడూ, కుడుములొండలేని ఆడదీ వుండదు” అని లోకోక్తివుంది. అని చెప్పి గానం అప్పటికే వినికివల్ల కొంత అభ్యస్తమయి వుండడమే కాక, విజయనగరం రాజావారి దర్శనం సుమారు నెల పదేను రోజులవఱకున్నూ కాకపోవడంచేత (“శతఘంటకవనంబు సల్పుటా, ఆనందజనపాలుదర్శనం బనెడివారు. కాని సులభ మటంచు నొక్కరును జెప్ప-రట్టు భవదీయదర్శనం బాచరించి, ధన్యతను జెందె మత్కవిత్వంబు నేఁడు - శ్రీమదానందగజపతిక్షితితలేంద్ర") వృథాగా కూర్చోవడమెందుకని (క్షణశః కణశశ్చైవ విద్యా మర్ధం చ సాధయేత్) ఆ సంస్థానవైణికులలో వొకడున్నూ