పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వేంటలో మిక్కిలీ నేర్పరులు సమర్డులున్ను యీయన వకరోజున బోనులోపడ్డ యొలకలను జాగ్రత్తగా వూరివెలుపల వదిలిపెట్టి రావలసిందని నవుకర్లకు ఆజ్ఞాపిస్తూవుంటే నేను"అయ్యా! మీరు స్వయంగా యెన్నో జీవాలను పశుపక్ష్యాదులను వేంటలో సంహరిస్తూ వుంటారుగదా! యీ యొలకల విషయంలో యింత దయచూపడం అక్కజంగా వుందన్నాను. దానిమీంద ఆయన వేంటలో వున్నప్పడు మాకు గుఱికి సరిగా ఆనడం తప్ప యితర విషయం లేశమున్నూ తట్టనే తట్టదనిన్నీ యితరత్రా మీరెంతో మేమున్నూ అంతే అనిన్నీ Ꮛ8Ꮌ❍PᏋᏇᏇ చెప్పారు. కాCబట్టి యీ యొలకల విషయంలో యేమి, పందికొక్కుల విషయంలో యేమి అందఱున్నూ బాధకేనా సహిస్తారు కాని చంపడానికి వప్పుకోరు. ఎవశ్లో బొత్తిగా నిమ్నజాతులవాళ్లు మాత్రం పందికొక్కులను తినడం కూడా వుంది. కొందఱు వీట్ల బాధ తొలంగడాని కంటూ పిల్లులను పెంచడం ఆచారంగా వుంది. కాని అంతమాత్రంచేత ఆ బాధ నివారించదుసరికదా! పైCగా వీట్లబాధకూడా తటస్థిస్తుంది. అదిన్నీకాక పిల్లులకు పందికొక్కులు లేశమున్నూ జంకవుకూడాను. పిల్లులవల్ల యొలకలున్నూ ముంగులవల్ల పాములున్నూ లేకుండా పోతాయనుకోవడం పిచ్చిమాట. వాట్లకీ వీట్లకీ పరస్పర వైరమన్నమాట నిజమే కాని అవి వీట్లను పూర్తిగా వారించడం వట్టి కల్ల. అశ్వత్థామ యెప్పడో ఆగ్నేయాస్తాన్ని కాంబోలును ప్రయోగించి దానితో సర్వసైన్యమూ హతమయిం దనుకొని సంతోషించబోయేటప్పటికి మళ్లా కొంత సైన్యం సజీవంగావుండి కృష్ణార్డున సహితంగా యుద్ధానికిసిద్ధపడేటప్పటికి భీ! అని విరక్తితో యుద్ధపరాజ్ముఖుడు కావడమున్నూ పిమ్మట వ్యాసులవారు యేదో బోధించడమున్నూ భారతద్రోణ పర్వంలో అందఱూ చదివేవుంటారు. లోకంలో యెన్నెన్నికలరాలు, యెన్నెన్ని ప్లేగులు, యెన్నెన్ని యుద్ధాలు వసూవున్నాయికావు. అంత మాత్రంచేత జనం పూర్తిగా కాదుగదా, యెన్నోవంతు నశిస్తూవుంది? అసలు నశించడమే లేదని చెప్పగలమా? ఆలాగే ప్రస్తుతవిషయమూ అనుకోవాలి. కాని లోగడ వుదాహరించిన పాషాణప్రయోగం మాత్రం వరసగా కొన్నాళ్లు జరిగితే కొంత శాంతిస్తుందేమో కాని ఆపనికి యే మాత్రం మనస్సంటూవున్నా శుద్ధకటికవాడైనా కూడా అంగీకరించండని వేటే చెప్పవలసివుండదు, బాధకజంతువుల సంహారానికి కూడా కొందఱు స్వయంగా సిద్ధపడరు. యెవళ్లేనా చేసేవాళ్లుంటే వాళ్లకు డబ్బోదస్కమ్లో యివ్వడం మాత్రం వుంది. యీ మధ్య మా వూరిరైతులు లేళ్లవిషయంలో ధనమైతే యివ్వలేదు గాని అలాగే చేశారు. పూర్వమెప్పడో మా గ్రామ పొలాలలో లేళ్లు విశేషించి వుండేవంటూ మాతండ్రులకాలంలో వుండే పెద్దలవల్ల వినడం. లేళ్లు సంచరించే ప్రదేశం పరమపవిత్రమైనదని వేదవేత్తలు చెపుతారు. మోదుగచెట్లు వుండే ప్రదేశంకూడా అలాటిదే అంటారు. దర్భలు వగయిరా వుండే ప్రదేశం కూడా అలాటిదే. ప్రస్తుతం యెప్పడో సుమారు నూతేళ్లనాంటి మాదిరిగా లేళ్లమందలు మాతోంటల ప్రాంతంలో

  • \*

v.