పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

67


పెరిగిఁపోయాయి. మావూరి కాపులేమి లంకకాపులేమి వాట్లను స్వయంగా కొట్టడంగాని యితరత్రనుంచి వచ్చేవేంటకాళ్లు కొట్టడానికి అంగీకరించడం గాని లేకపోవడంచేత మందలుమందలుగా పెరింగి పూర్తిగా చేలు నాశనం చేయడాని కారంభించేటప్పటికి తుదకు విధిలేక వ్యవసాయదారులు స్వయంగా వాట్లను కొట్టడమైతే జరగలేదుగాని కొట్టేవాళ్లను వారించకపోవడం మట్టుకు జరిగింది. యీ అహింసాతత్త్వం చాలా దుర్విజ్ఞేయం అని మొట్టమొదటే వ్రాసివున్నాను. వృత్రాసురవధ విషయంలో యింద్రుండికి అంతోయింతో సలహాయివ్వడంలో ఋషులున్నూ వున్నారు. అంత ప్రధానంగా కాకున్నా యే కొంచెమో యితరదిక్పాలకులున్నూ వున్నారు. తుట్టతుదకు యింద్రుండు బ్రహ్మహత్య చేశాండు గనక యీ యింద్రపదవికి అరుండు కాండని ఆక్షేపించి పదభ్రష్టుణ్ణి చేయడంలోకూడా ఆ యీ ఋష్యాదులే కారకులుగా వున్నట్టు కనపడుతుంది. ధర్మప్రతిష్టాదకంగా వుండే సత్కార్యాల్లోకూడా చిత్రవిచిత్రమైన చిక్కులు మన వేదశాస్తాలల్లో కనపడతాయి. యజ్ఞం చేయడమేమో మహా పుణ్యకార్యంగదా! అందులో సోమవిక్రయణం పాపం. ఆ సోమ మంటూ లేకుండా యజ్ఞం సాగదు. ఆ యజ్ఞభేదాలల్లో కొన్నిటిలోనో లేక మహావ్రత మనేదానిలోనో వక బ్రహ్మచారికిన్నీ వక దాసీకిన్నీ ఆ అగ్నిగుండం సమీపంలోనే కొంతయెత్తు ప్రదేశంలో యేర్పఱచిన మంచెమీందే అనుకుంటాను సమాగమం జరగాలంటూ చెపుతారు, యింకా కొంత వ్రాయవలసి వుందిగాని “అనుక్తమన్యతో గ్రాహ్యం" కనక సామాన్య ప్రజలు హేయంగా చూస్తారని వదిలిపెడుతూ వున్నాను. అలాటిహోమం యజ్ఞ పురుషప్రీతికరమై యజ్ఞకర్తకు వత్తమలోకావాప్తి సంపాదకం యేలా అయిందంటే? అది వేద విశ్వాసం వుండేవాళ్ల ప్రశ్నకాదు. వేదములు రాజ సమ్మితాలుకదా! నా చిన్నతనంలో యానాంలోనే పల్లీలతాలూకు వివాహం వకటి దేవాలయంలో జరిగింది. వాళ్లకేమో వివాహంలో హోమాలు చేయడం ఆచారమంటూ వకముసలమ్మ కొంత జరిగాక చెప్పింది. అప్పడు ఆ పురోహితుండు లేంత కొబ్బరిమొవ్వు కావాలని చెప్పేటప్పటికి ఆనిశిరాత్రివేళ క్షణంలో వాళ్లు తీసుకువచ్చారు. ఆ మొవ్వటాకులు స్రుక్కూ స్రువంగా యేర్పటిచి పురోహితుండుగారు ఆముదంతో హోమాలతంతు సాగించారు. కొబ్బరి మొవ్వెందుకంటే? - ప్రభుసమ్మితత్త్వ మనేదే జవాబు. ఆ పురోహితుండు వీళ్లకు నాన్బ్రామిన్సుకు హోమాలేమిటి అనే దురుద్దేశంతో చేశాడనుకుంటే తీరిపోతుంది. ప్రస్తుత దాసీ బ్రహ్మచారి సమాగమవిషయం అలాటిది క్షాదుకదా! దీనిమీంద వేదప్రామాణ్యం వున్నవాళ్లేవళ్లున్నూ ప్రశ్నించడానికి అవకాశం వుండదు. లేనివా? వాళ్లచిత్తం వచ్చినట్టు అడగవచ్చు. వాళ్లకు జవాబు చెప్పేదెవరు? వకాయన యజ్ఞంలో మేంక లోఁకువ జంతువు కనక బ్రాహ్మలు చంపుతూ వున్నారు. పెద్దపులిని చంపవలసివస్తే యీ బ్రాహ్మల పస తెలిసిపోయే' దంటూ అన్నట్టు ఒకరు చెప్పగావిన్నాను. అది పిచ్చిమాట. వేదపురుషుడు