పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

65


ఆయనేచెప్పగా విన్నాను. అహింసాతత్త్వం తెలుసుకోవడం మిక్కిలి దుర్ఘటంకదా! పూర్తిగా కృతకృత్యులయితే కాలేదుగాని యిందుకోసం ప్రయత్నించేవారు భారతీయులే. అందులో బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులలో “శ్లో 1. ఆంధ్ర, 2. ద్రవిడ, 3. కర్ణాట, 4. మరాటా, 5, ఘూర్ణరా స్తథా, 1. సారస్వతాః, 2. కాన్యకుబ్దా, 3. గౌడా, 4. ఉత్కల, 5. మైథిలాః" అనే దశవిధ బ్రాహ్మణులలోనున్నూ మొదటి అయిదు తెగలవారినీ పంచ ద్రావిడులనిన్నీ రెండో ఐదుతెగలవారినీ పంచగౌడు లనిన్నీ అంటారు. యిందు మొదటి ద్రావిడతెగవారు బొత్తిగా మాంససంబంధంగాని మత్స్య సంబంధంగాని ఎఱంగనివారు. గౌడులందఱున్నూ మత్స్యభుక్కులు. వారికి కులాచారమేమో, మత్స్యభక్షణంవరకే అభ్యనుజ్ఞనిస్తుంది కాని అందులో యెవరో శిషులమాటచెప్పలేంగాని తక్కినవారు మాంసాశనానికూడా అలవాటుపడ్డవారే అనివినడం. ఆయా ద్రావిడపంచకంలో యేమి, గౌడపంచకంలో యేమి అంతర్భావం చెప్పకోCదగ్గబ్రాహ్మణులు చాలామంది వున్నారు. ఉత్కళ బ్రాహ్మణులలో బంగాళీలకు అంతర్భావం చెప్పవలసివుంటుంది- మందసాలో వుత్కళ బ్రాహ్మణులవాడలో మహాపండితులనంబడే శ్రీ విద్యా భూషణంగారి గృహబహిర్వేది మీంద ఆయనతో యేదో ముచ్చటిస్తూ కూర్చున్నప్పడు ఆ వీథిని మనవైపున శూద్రవాడలో మోస్తరుగానే చేయలమ్మకొనేవాళ్లు రావడం చూచేటప్పటికి నాకేమో విడూరంగా కనపడి మనస్సులో దాcచుకోలేక నేను- “అయ్యా! మీరు మహా విద్వాంసులుగదా! యిది మీకు హేయంగా తోంచదా? దీన్ని మీ రెందుకు వర్ణించలేదు?” అని ప్రశ్నించాను. దానిమీంద ఆయన- "నేనెన్నండూ దీన్ని ముట్టను కాని యింట్లో ఆండవాళ్లు వగయిరా భక్షిస్తారు.” అనిచెప్పి మళ్లా అన్నారుకదా "అయ్యా! మీరు దీన్ని వర్ణించి యెన్నాళ్లయిం?” దన్నారు. అంటే ఆయన వుద్దేశంలో “మీరు" అనేది నన్ను మాత్రమే వుద్దేశించినమాటకాదు, మీ పంచద్రావిడమున్నూ, అనే తాత్పర్యంలో వుపయోగించినమాట. దానికి నేను తగిన జవాబు చెప్పలేకపోయాను. మనకు దొడ్లల్లో గుమ్మడి, ఆనప, పొట్ల, బీర పాదులు మాదిరిగానే వంగదేశంలో వారివారి పెరళ్లల్లో మత్స్యాలు ఫలించే బావులుంటాయని చెప్పఁగా విన్నాను. నవద్వీపం చదువుకొనడానికి వెళ్లిన మన పంచద్రావిడ విద్యార్థులు బంగాళీ గురువులకు బజారునుంచి మత్స్యాదులు కొని తెచ్చిపెట్టడంమట్టుకు అప్పుడప్పుడు తటస్థిస్తూ వుంటుందని కీ|| శే శ్రీమాన్ సముద్రాల వెంకటప్పలాచార్యులవారు చెప్పంగా విన్నాను. అయితే ఆయీ మత్స్యమాంసభక్షకులైన వారిలో కూడా భక్షించే జంతువుల విషయంలో తప్ప యితర జంతువిషయంలో చాలాదయాంతఃకరణులు కనపడతారు. శ్రీ నూజివీటి నారయ్యప్పారావుగారు (శ్రీరామచంద్రాప్పారావు గారి ప్రథమ పుత్రులు)