పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత భారతి

585


అన్న విధంగా నన్నయ్య భారత గ్రంథాన్ని సముద్రంగా రూపించాడు. అంతే. మీ పాండిత్యాన్ని ప్రకటించుకొనడానికి ప్రయత్నించారు. తప్పులేదు. కాని, లోకం యింకా పండిత శూన్యం కాలేదు. శబ్దజ్ఞానం లేని దిద్దుబాట్లు "రాజేత్వన్ము ఖాంభోజే" మాదిరిగా అంతస్సార శూన్యత్వాన్ని ప్రకటించవా? మురారి కవి “నశబ్దబ్రహ్మోత్థం పరిమళ మనాఘ్రాయచ" అన్నాడు.

శా. అంతస్సారము లేకయున్న నెటులో ఆ పేరు లీపేరు లార్జింతుర్కొందరు (జయంతి చూ) యెఱుగుదురా! సరే మీదగ్గిర యీసంప్రదాయాలన్నీ యేకరువెట్టడం వృథా. నేను వొకమాట మిమ్మల్ని అడుగుతాను. జవాబిస్తారా? యీ “భారత వాహినీ సముద్రము" అనే పాఠం మీకేదేనా పుస్తకంలో వుపలబ్ధమయిందా? స్వకపోల కల్పితమా? అంఛాను. స్వకపోల కల్పితమే అయితే ఆశ్చర్యం లేదు. యే పుస్తకంలోనేనా వుపలబ్ధమైనదనేయెడల ఆశ్చర్యపడవలసి వస్తుంది. అష్టభాషా వాగను శాసనుడైన నన్నయ్య కాఁడుగదా? అతని పసులకాపరి గూడ యిట్టిప్రమాదానికి గుఱికాడు. తెలిసిందా?

“ఉ. మూగురయందు నన్నయ సమున్నతుఁడై కడు లక్షణంపు బ్రోవై"

“ఉ. అందాది దొడంగి మూడు కృతులాంధ్ర కవిత్వ విశారదుండు
     విద్యాదయితుం డొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్."

సీ. నన్నయకవి పెట్టినాడు కదా!
                తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష"

అట్టి నన్నయ్య యిట్టి తప్పుడు ప్రయోగం చేస్తాడంటే విజ్ఞలోకం సమ్మతించదు. ఇంతకూ సుప్రసిద్ధంగా వుపలబ్ధ మవుతూవున్న “భారత భారతీ సముద్రము." అనే పాఠం కంటె ఆ డొంక తిరుగుడు పాఠంలో యే విధమైన గుణము కనపడదు. పైగా దోషం కనపడుతూవుంది. నేనిప్పటికి చాలా ప్రతులు భారతం చూచాను. నాకీ భారతభారతీపాఠమే కాని భారత వాహినీ పాఠము కనపడలేదు అని మళ్లా వ్రాస్తున్నాను. దీని అయోగ్యతను గూర్చి కొంచెం వ్యాకరించాను. అసలు పాఠము యొక్క యోగ్యతను కూడా వివరిస్తాను.

భారత భారతీ సముద్రము; భారత = (వ్యాసకృతమైన) భారత గ్రంథంయొక్క భారతీ = వాణి, అనగా? భారత వాఙ్మయ మనెడి సముద్రము అని రూపించాడు కవి. అనేక వ్యాసఘట్టాలతో నిండి మహా గంభీరంగా వుండేది గనక-సముద్రత్వేనా రూపించడం యుక్తమే. యీ రూపణకు యితరాషేక్షతో పనిలేదు. కాళిదాసుగారి కవిత్వంలో మన పైత్యం చేర్చడంవల్ల డొంకతిరుగుడు త్రోవ పట్టడం. యిది "చక్కని రాజమార్గము లుండగా సందులు దూరినట్లు" గాక మఱేమి? నన్నయ్యకు అప్రయత్నసిద్ధంగా యమకం దొర్లుతుంది.