పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

586

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

1. ఉ. భారతభారతీ శుభగభస్తి చయంబులు... ...

2. చ. భారత భారతీ సముద్రము దరియంగ నీదను... ...

3. మ. కురువృద్దుల్ గురువృద్ధ బాంధవు లనేకుల్... ...

4. మ. మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య.

యింకా యెన్నోయీలాటివి చూపవచ్చును. దిద్దిన వాహినీపాఠంలో చెప్పే అపార్ధాన్ని బట్టి దురుద్ధరమైన వ్యాకరణదోషం తగలడమే కాకుండా (యీ దురుద్ధర దోషం హ్రస్వం రావాలనేది స్థూలదృష్ట్యా చెప్పేమాట. సూక్ష్మదృష్ట్యా అయితేనో? భారతవాహినీకః అని కప్పురావాలనేదే. ఇందులో యేదేనా మీకు చిక్కే అన్నది పరమార్థం) యమకం కూడా చెడుతూ వుంది. తాను యీవిధంగా తప్పుత్రోవలో కలంనడుపుతూ అసలు పాఠాన్ని గూర్చి కొన్ని అసంగత వాక్యాలు 'భారతభారతీ' అని దిద్దినారు. ఈ మార్పునం దేమి విశేషము గ్రహించిరో?... ... ... “ఇది అనౌచిత్యము సమంజసముగ లేదు." అంటూ వొక కాలం జ్ఞానలవదుర్విదగ్ధపు మాటలతో నలుపు చేయబడింది, వాహినీ అనేది పూర్వపాఠమట? యిది యథార్థమగు మాటేనా? కాదన నేల? అంగీకరింతము గాక. ఆ పక్షంలో యిట్టి అవ్యుత్పన్నులు యీ పిదపకాలంలోనేకాదు. పూర్వకాలంలోకూడా కొందఱు వుండేవారని తేల్తుంది. వ్యుత్పన్నులే అయితే వ్యాకరణ దుష్టమైన పాఠాన్ని కల్పించరు. యితరులు కల్పిస్తే సమ్మతించరు. "నోచే దుష్కృత మాత్మనా కృతమివ స్వాంతా ద్బహి ర్మాకృథాః" అన్నాడు పండితరాయలు. యేదో సందర్భంలో యెప్పుడో మేమున్నూ “-వాకురు కింతుమాకురు వృథా పద్యాని గద్యానివా" అని వొకరిని మందలించవలసి వచ్చింది. అర్హత వుండుగాక; లేకపోవుగాక, యేదో భారతాన్ని బాగుచేదామని పూనుకోవడం బాగానేవుంది. యీ తలకు తగని మాటలెందుకు? “మొండివాదం... తెలివితక్కువ. తాజెడ్డకోతివనమెల్ల జెరచె." ఆ ఈ ప్రసంగం నన్ను గూర్చి చేసింది. యెందుకంటే? నేను "భారత భారతీ సముద్రము" అనేపాఠం వ్యాకరించినందుకు. పైగా అరణ్యపర్వంలో సూచితమైన "పరపూరితమ్ములై" అనే భావ్యనర్థ సూచకమైన విశేషం. ఆదిపర్వంలోనే “చ. అమలిన తారకాసముదయమ్ములన్... ... " అనేపద్యంలోనే సూచితమయిందని ఋజువు చేసినందుకు. నేను ఆయి అపార్ధం భాసిస్తూందన్నానుకాని ఆయీ అపార్థం గ్రంథకర్తకు సమ్మతమని అనలేదు. యీయన నేను సమ్మతమని అన్నట్లు కల్పించడం వొకటి? (చూచారా? యీయనకు అసత్యమంటే యెంత భయం లేదో) అపార్థాలూ అమంగళార్థాలూ వొక్కొక్కప్పుడు అవశాత్తూ యెంతటి మహావిద్వత్కవికేనా సరే దొర్లుతూ వుంటాయి. ఆపని జరిగాక పరిశీలించుకుంటే (గ్రంథకర్త మరణానికి సంబంధించేవి