పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

579


పడకుండా వుండాలంటే మీవ్యాస ధోరణి అంగీకరించిందికాదు. దీనికి మాముత్తాతగారు చెప్పిన సమాధానమే గతి. అది జయంతిలో-

మ. గరువంపున్నుడు లిందు నచ్చటచటం గన్పట్టు నప్పట్టునం
     బరిహార మ్మొకకొంత గన్పఱచెడిన్ మాపిన్న ముత్తాత యి
     దురితమ్మున్ గుఱితించి చింతిలుచు నుందున్ ముప్పదిన్ రెండుదు
     ర్దురితమ్ముల్ గురుఁడాడ సైఁచి కవితన్ దూఱంగ నోరెత్తితిన్.

అన్నపద్యంకింద టిప్పణిలో వుంది చిత్తగించండి. ప్రస్తుతం 32-31గా మార్చుకోండి. యెవరో "పండితాయతే"లు యేవో తొందర మాటలు వ్రాసినంతలో వాట్లకు జవాబు వ్రాయడానికి సిద్ధపడడం వుదారత్వానికి లక్షణం కాదనిన్నీ యెఱుఁగుదును, యేం లాభం. యీపిచ్చి సోమయాజులకి అట్టి వుదారత్వం యీవార్ధక్యంలో సర్వసంసిద్ధమైన స్థితిలోకూడా అమల్లోపెట్టడానికి భగవదాజ్ఞ లేకపోయింది. పిచ్చిసోమయాజులను గూర్చి లోఁగడయేదో వ్యాసంలో విస్తరించివ్రాసే వున్నాను. అక్కడ చూచుకోండి. వాఁడికి తన్నుయెవరేనా స్పృశిస్తే సరి వెంబడించి వారిని యెంత దూరమేనా తరుముకువెళ్లి స్పృశించడమే వ్రతం, నాగతి కూడా ఆలాగే వచ్చిందని చింతిస్తాను. సరే? యెంత వ్రాసినా మీ తొందరపాటు మాటలు వత్తరించతగ్గవి మిగిలినట్లే కనపడతాయి. "యెలుఁగుబంటి తంటస" మన్నట్టు యిది యెప్పటికి తేలేటట్టు లేదు, అత్యవసరాలు వుత్తరింపఁ బడ్డాయికదా? తృప్తిపడండి. ముఖ్యాంశాలు వ్రాసి విరమించడానికి సంకల్పించుకొని మళ్లా లేఖినిచేతఁబట్టేటప్పటికి అంతలో మీవ్యాస శేషం వచ్చింది. దానితో యిదికూడా అంటే సింహావలోకనంకూడా పెరిఁగింది. పెరిఁగినానాకు సంతుష్టి యింకాకలగలేదు. అయినప్పటికి పత్రికవారికి భయపడి ముగిస్తూన్నాను. యీ వ్రాత మళ్లా యెక్కడికక్కడే దోపుళ్లతో నిండి నడవడంచేత చాలా హంసపాదులతో నిండి వుంది. జాగ్రత్తగా ముద్రించి మళ్లా మీశంకలు రాకుండా చేస్తే సంతోషిస్తానని పత్రిక వారికి విజ్ఞప్తి. ఆయీవార్ధక్యంలో-

మ. శివనామమ్ముఁ దలంచి కొంచు నెటులో జీవన్ గృతార్డుం బొన
     ర్చువిధిన్ బద్దెము లల్లికొం చుపనిష చ్చుద్దా స్తకాన్తామణీ
     భవనప్రాంగణసీమ దాస్య మొనరింపం బోవు నన్నెందుకో?
     కవనమ్మున్ దెగ వెక్కిరించి గురుఁ డీగర్వోక్తు లాడించుటల్.

అన్న పద్యార్ధప్రకారం వర్తిద్దా మనుకుంటే పంచగురువులలో వొకరుగా లోఁగడ మనవి చేసుకున్న తమరు దానికి విఘ్నం కల్పించారు. గతానికి విచారించి ప్రయోజనంలేదు. "భాషామంజరీ సమాప్తా" పాండిత్యంతో యింకా పెనుగులాడక (యిది మీకోసమే