పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

562

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


రసాభాసకాకూడదుకదా? భగవదనుగ్రహం యెట్టిదో కాని యింట్లో వున్నప్పుడున్నంత అనారోగ్యం అశక్తత యిల్లువదలిన ఉత్తర క్షణానన్నుంచే నన్ను వదలి పెట్టడం వుంది. దీన్ని గుఱించి చిరకాలంక్రితమే ఆలోచించి తేల్చుకున్నాను. సుమారు యిరవై రెండేళ్ల వయస్సులో వున్నప్పుడు శ్రీవేంకటగిరిసంస్థానానికి వెళ్లడం తటస్థించింది. అప్పుడు సంస్థానం వారిమీఁద చెప్పిన పద్యాలలో వకపద్యంలో యీశాపం తగిలిందని నాఅనుమానం. యేలాగా "వెఱ్ఱివెంకటాయ" బిరుదం రానేవచ్చింది, కనక ఆ బిరుదాన్ని పోషించే పిచ్చినమ్మకాలు కూడా యిందులో వ్రాస్తాను.

"చెడ్డకాపరానికి ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి?"

సీ. “పరసజ్జనావళుల్ పరమబంధులు గాఁగఁ
               బరులయన్నము పుష్టికరముగాఁగ."

తక్కినది సందర్శనంలో చూచుకోండి కావలిస్తే, అందుచేత యిల్లు బయలుదేరడానికే బ్రహ్మష్టో బ్రహ్మం గాని బయలుదేరి యింకా పరాన్నం తినకుండానే ఆరోగ్యమే కాదు, శరీరబలమేకాదు, కొంతఅభివృద్ధిలో వుంటుంది. ఆబరవసాన్ని పురస్కరించుకొనియ్యేవే. “కూర్చుండి కూడొండలేను వంగుండి తీర్థం" అన్నస్థితిలో వుండికూడా బలవదాహ్వానాలకు సిద్ధపడుతూ వుంటాను. అందులో యీ ఆహ్వానం సామాన్యాహ్వానమా? "కత్తేస్తావా? బద్దేస్తావా?" అన్నతరగతిలోదికదా? అయితే యిదేమిట్రాబాబూ? "నమాజు చేయబోతే మసీదు మెడబడ్డ"దని మెల్లగా యేదో మఱో సాఁకు చూచుకొని యీ వుద్యమం విరమిస్తే చెప్పఁజాలనుగాని, నా అంతట నేనుమాత్రం వెనకంజ వేసేదిలేదు. అప్పుడే “ప్రభువిచ్చె వేనూటపదియాఱులనునట్టి స్వప్నములే ధనార్జనములాయె" యింకాకొన్నిహిరణ్యాక్షవరాలు భోజనానికి సంబంధించినవైతే వున్నాయికాని, అవి సమకూర్చడానికి యెవరు గాని చేసే ప్రయత్నం లవలేశమున్నూ వుండ నక్కఱలేదు. కనక యిందులో వుటంకించి గ్రంథం పెంచలేదు. "శ్లో. ప్రక్షాళనాధ్ధి పంకస్య దూరా దస్పర్శనం వరమ్” అనే న్యాయంచేత అసలే, యీప్రయాణం మానుకోరాదా? అని కొందఱు విజ్ఞులనవచ్చును. కాని వారిమాటలు యీగంగిరెద్దుకు రుచించవు. “మ. అఱకం గట్టిన గంగిరెద్దురుకదే! ఆత్మీయ వాద్యధ్వని స్ఫురణం బించుక విన్నన్,” అన్న గీరతపద్యం యెఱిఁగినవారునన్ను వారించరు. వారించలేరూనున్నూ కనక- “నందో రాజా భవిష్యతి" వెళ్లే తీరతాను. విమర్శకుడిగారి సమ్మానాన్ని పొందే తీరతాను. వారివూరు నేను వెళ్లిన తరవాత నాకు అంతాజయమే కాదే అనుకుందాం. యేభయమూ లేదాయె. ప్రాణభయం కూడా లేని వార్ధక్యవయస్సాయె. యెందుకు జంకాలీ అంఛాను, నాసౌహార్దం వారికి వచ్చినట్లే అయితే లోఁగడ