పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/557

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

561

క్కక దేవత్వము నిప్పుడే యిడినటుల్ గాఁదోఁచుఁజిత్రంబు వా
ర్ధకదోషాలకుఁగూడ నబ్బెనిటు సార్థక్యంబు కామేశ్వరీ."

చాలును. పెరిగిపోతూవుంది వ్యాసం. వక్తవ్యాంశం యింకా మిగిలేవుంది. యీస్థితిలో వున్న నన్ను రప్పించదలఁచుకొన్న విమర్శకుఁడుగారు గాని (నేనువిన్నది నిజమే అయితే) ఆధూళిపూడిలో వుండే సంపన్న గృహస్థులుగాని యెంతత్వరలో కార్యధూర్వహులయితే అంతమాట దక్కుతుంది. జనవరినెలలోఁగాతప్ప నేను యిప్పటికంటె మంచిస్థితిలో వున్న పూర్వమప్పుడేనా ప్రయాణం చేయలేను. కారణం ఫిబ్రవరి మొదలుకొని మళ్లా అధమం జూనునెలాఖరులోగా నావ్యాధి నన్ను మఱీ బెదరిస్తూ వుండడమే. (యిప్పటిరీతి అన్నిటికీ బెదరఁదగ్గదే కదా!) యిల్లుకదలకుండా "కడుపులో చల్ల కదలకుండా" కాలక్షేపం చేస్తే చిక్కులేదు. అందుచేత జనవరి దాఁటకుండానే ఆ యీప్రయత్నం చేయాలిగాని తరువాత చేసి యేదో రావడానికి భయపడ్డాఁడనీ, యేమోఅనీ, యేమో అనిన్నీ నెపపెడతారేమో? అని యీలా వ్యవధివుండగాఁ మనవి చేసుకోవడం. భయపడడం యెందుకు? చప్పట్లపర్వం జరుగుతుందనేనా? అయితే అది గ్రామంకాదా? వొకవేళ అదిన్నీ జరుగుతుందే అనండీ! అందులో కల్గే విష్ణుచక్రంకంటె యిదివఱలో విమర్శకుఁడుగారు అనుగ్రహించిన తిట్లల్లో తక్కువ అవమానం వుందా? దాన్ని నేను గణించేవాణ్ణి యెప్పటికీ కాను. యీలాటి విష్ణుచక్రాలవల్లనే నాపేరు (అసలేమేనా వుండడమే నిజమైతే) బయటికి వచ్చిందని “పుణ్యైర్యశోలభ్యతే" అనేవ్యాసంలో వ్రాసి వున్నాను. అట్టివారు నాకు అభినందించ వలసినవారు “ఏమహాత్ములు గల్గ భూమీశ సభలలోఁ గవులకు బహుళవిఖ్యాతి గల్గె" గతంలో జరిగిన చప్పట్లపర్వాల వల్ల నాకెంత నష్టం కలిగిందిన్నీ ప్రాజ్ఞలోకం యెఱగనే యెఱుఁగును. అందుచేత

శ్లో "అవమానం పరస్కృత మానం కృత్వాతు పృష్ఠతః"

అని అనుకుంటూ రానక్కఱలేదు విధిగా సమ్మానమే జరుగుతుందని నమ్మియ్యేవే రానిశ్చయించుకొన్నాను. వస్తాను. నాకున్నదల్లా వొక్క అనారోగ్యప్రతిబంధకమే. నేను పెట్టిన గడువుమాత్రం మించనీయకండి. వారంరోజులు వ్యవధి వుంచి నాకు తెలపండి. యెందుకంటే? ఆ వ్యవధి దినములలో ఆహారాదులలో మఱీ జాగ్రత్తగావుండి మఱికొంత ఆరోగ్యాన్ని అభివృద్ధి పఱచుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతే కాకుండా ప్రయాణానికి అనుకూలించే సుముహూర్తంకూడా వున్నంతలో వీలైనది చూచుకోవడం కూడా అవసరమేకదా! (యిది సున్నపుపిడత ప్రయాణం) తీసుకువెళ్లినందుకు మీకు మాటదక్కాలి. వచ్చినందుకు నాకున్నూ మాటదక్కాలి, యితరవిధయా రసాభాసైనా, అనారోగ్య విధయా