పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/559

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

563


నేనాహ్వానించిన ఆహ్వానమేకాక మళ్లా వారిని ముఖాముఖీనికూడా వారి గ్రామం వెళ్లినప్పుడు ఆహ్వానిస్తాను. గనక వారుకూడా మాగ్రామం వచ్చి, మాగృహం పావనం చేసి, నా అభినందన పద్యాలున్నూ సేలుజోడున్నూ దయతో స్వీకరించేటట్టున్నూ, నన్ను ఆశీర్వదించేటట్టున్ను అమాంగళ్యపువాక్యాలు మఱిచి పోయేటట్టున్నూవారి వూరి వారిచేతనే గట్టిగా నచ్చఁజెప్పించి తిట్టినప్పటికీ ఆ తిట్లు గణింపక కృతి ప్రదాతను సమ్మానించాడు చెళ్లపిళ్ల అనే యశస్సును పొందే తీరతాను అనే దృఢవిశ్వాసంతో యీవ్యాసాన్ని వ్రాశాను. బొబ్బిలి సంస్థానంవారికిన్నీ , విజయనగరసంస్థానంవారికిన్నీ వున్న వివాదంకంటె మావిమర్శకుఁడుగారికిన్నీ మాకు (తి. వెం.) న్నూ యెక్కువ వివాదం వుందా? యిప్పటి బొబ్బిలి మహారాజావారి తాతగారున్నూ, శ్రీమదానందగజపతి మహారాజులుంగారున్నూ చాలా మైత్రిగా వుండేవారు. ఆలాగే లోఁగడ విమర్శకుఁడుగారు నన్ను తిట్టిపోసినప్పటికీ “కొట్టితే కొట్టాఁడు కొత్త కోకెట్టాఁడు” అన్నమాదిరిగా నేను సంతృప్తిపడి వారిస్నేహాన్నే అభ్యర్థిస్తూ వుంటే దీన్ని యేలా తోసివేస్తారో చూస్తాను.”

“బాజాలసందట్లో మంగళసూత్రాన్ని మఱచివున్నాను"

లోఁగడ వొకదాన్ని యెత్తుకొని దాన్ని సమాప్తి పొందించకుండానే యేదో ధోరణిలో పడి యేమేమో వ్రాశాను. అదేమిటంటే? "యేమిచ్చినా సంతోషించడమేకాని పేచీపెట్టడం నాస్వభావం కా"దన్నది. వనపర్తిసంస్థానం వగయిరాలు పరీక్షించి సమ్మానించే వవడంచేత ఆలా పేచీపెట్టవలసి వచ్చిందనేమాట లోఁగడనే వ్రాయవలసింది. మఱిచాను యిక్కడ వ్రాశాను. ఆఘట్టంలోకి జమకట్టుకోండి. ఆయీపద్యంవల్ల ఆపేచీ తాలూకు పూర్వోత్తర సందర్భం తేలుతుంది. వుదాహరిస్తాను

“క్ర, గానమ్ముకన్నఁ గవనం
    బేనాఁడేనియును దక్కువే? నరవర; నీ
    వీ నియతి విడిచి యిచ్చిన
    నే నేమని సమ్మతింతు నెఱిఁగి యెఱిఁగియున్."

యెత్తుకొని యీలా మడిచిన వింకా వుంటే వుంటాయేమో? వయోదోషంవల్లనూ, అనారోగ్యంవల్లనూ వచ్చే యీహంసపాదులకు చదువరులు నన్ను క్షమించాలి. నావంటివాఁడే వొకcడు. గోచీ మఱిచి పోయితలపాగా మాత్రం పెట్టుకొని యెవరో ప్రశ్నించేటప్పటికి తొడమీద హంసపాదు వ్రాశాడcట!

యిప్పటి నాస్థితి అట్టిదే! విమర్శకుఁడుగారి శంక లెట్టివో? వాట్లవాలకాన్ని చాలావఱకు బయటికితీసి చూపడమున్నూ జరిగింది. యీ చూపడం కొంత