పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/548

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

552

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పైని కొసరువేస్తారు. ఆయీసందర్భాలు యెన్నని యెత్తిచూపేది? చూపడమే వస్తే వొక్క త్రిలింగ చాలుతుందా? నేఁటి తెలుఁగు పత్రికలన్నీ కలిస్తే కూడా చాలుతాయా? యింతటి అమాయికసార్వభౌములెక్కడేనా వుంటారా? యేప్రసక్తిన్నీ లేకుండానే భారతాన్ని గుఱించి అన్నిపద్యాలు పిచ్చిగానీ యెత్తి దానిపీఠికలో వ్రాస్తామా? పైఁగా నన్ను నేను, "నక్కపోతని" ఉపమించు (పోల్చు) కోవాలష! సరి! యెవఁడేనా తన్ను తాను "నక్కపోతునని, కుక్కపోతుననీ" ఉపమించుకుంటాcడా? విమర్శఁకుడుగారు యెన్నెన్నో బూతుఁగూఁతలు కావుకావు అమాంగళ్యపుకూఁత లుపయోగించినప్పుడు యీ "నక్కపోతు" కూఁత మాత్రం అంతకు తీసిపోయిందని కాఁబోలు నాకు వదలిపెట్టారు. వారే వుపయోగించవచ్చునే? యిది. “పదియవనాఁటి" వగైరా మృదు ప్రసంగముకంటె చెడిపోయిందా? లేదా? “దున్నపోతు" అని కూడా ఉపమించి కసితీర్చుకోవచ్చునే? యేమంటారా! దున్నపోతు పోలికలో ప్రస్తుతం చాలా బలహీనస్థితిలో వున్ననాకు అది పంచగురువులలో వొక గురువు మామగారు వాడేదికనక ఆశీర్వచనంగా పరిణమించి దున్నపోతుకు వుండే బలపరాక్రమాల్లో యేశతాంశమేనా నాకు అంటుకొని ఆయనగారి చొప్పదంటుశంకలన్నిటికీ యీలాగే సమాధానాలు వ్రాస్తూ ప్రజ్ఞలోకంచేత “యీయనకేం మతిపోయిందా?” అని పరిహసింపఁ బడడానికి కొంత వుపకరిస్తుంది కదా? ఆదున్నపోతుపమానం! అంతేకాక ముసలికి, రోగికి కృతికన్యాదానం చేసిన పూజ్యులు వానిక్షేమం కోసం పడరానిపాట్లు పడాలి. నేను శ్రీజయంతి పంతులుగారికిన్నీ శ్రీజయపురం మహారాజావారికిన్నీ మిక్కిలి వృద్దులకు పిల్ల (కృతి) నిచ్చిచూడండి? యేలావ్రాశానో? శ్లో భార్యాగతాది వమథాపి మమోద్భభూవ కన్యాద్వయం జగదతీత కలావిలాసం జామాతరావతి తరాం జరఠౌ చలబ్ధౌ సర్వాత్మనాయుషి భత్కరుణా శరణ్యా" ఆశ్చర్యం. ఆశ్చర్యం. పైఁగా నాకు-

ఎక్కడో బ్రహ్మదేవుఁడు వ్రాశాఁడఁట? అందుచేత కవితావిషయంలో నాకు పేరు దక్కిందష? ఏమిటా దక్కుతా? యీలాటివారిచేత బండబూతులు తినడమేనా? యెదురు తిరిగి నేను-

"అయ్యా! యెక్కడనో? అన్నారుగదా? అదియెక్కడ? యెవరు కనిపెట్టినారు? లేక." ...అంటూ ప్రశ్నిస్తూ గేలిచేస్తేగతేమిషో! అయొచ్చేదీ, పయొచ్చేదీ తెలుసుకోవద్దా? నాలాగ “కవితాలలనమొగంబు బూడిదంబులిమెడి" వారిలో చేరేవారు కారుకదా? వీరు కుంకుమతో పులిమేవారు. వేదజ్ఞానంలేని వైదీకం యెంతశోభిస్తుందో? లోకజ్ఞానంలేని లౌకికమూ అంతేశోభిస్తుందనుకుంటాను. రెండిటికీ మారెండు వ్యక్తులున్నూ లక్ష్యంగా నేఁటికాలానికి భగవంతునిచే సృష్టింపబడ్డాయి కాఁబోలును. ప్రశ్నల వైఖరేమో? అలావుంది. ఆప్రశ్నలకు సమాధానం రాలేదంటూ నెపం వకటా? చూడండీ యింకోప్రశ్న.