పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/547

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

551


యెందుకు యెత్తుకున్నానంటే ఆరోజుల్లో “పండితబ్రువ లక్షణం" అనేపేరుతో మామీఁద కొన్ని దూషణోక్తులు వ్రాసినవారు పైవారిలో మొదటివారు. రెండవవారు బహుశః అప్పటికి పుట్టివుంటారేమోకాని (కౌపీనవంతః ఖలు భాగ్యవంతః") కనక ఆ యుద్ధంలో పాత్రత్వం వున్నవారు కాకపోయినా వారితండ్రిగారు శ్రీవేంకటరమణయ్య పంతులవారికి ద్వేషుఁడంటూ వుండవలసివస్తే చెళ్లపిళ్లమాత్రమే. కార్డులోకూడా (లౌకికాగ్రేసరులై వుండికూడా) వాఁడు మహా దుర్మార్గుఁడు అని నిరాఘాటంగా వ్రాసేవారు. శ్రీయుతులు కృత్తివెంటి గంగరాజుగారు ఆవ్రాయడాన్ని చూచి చాల మెచ్చుకొనేవారు. నేను వారి (వెం. ర. య్యగారి) వ్రాఁతనే సమర్థించేవాణ్ణి. దానిమీద గంగరాజుగారికి పంతులుగారి మీద మఱింత కోపంవచ్చేది. యింతే వ్రాయవలసింది. యిఁక వ్రాస్తే సారస్యం చెడుతుంది. శేషం ఊహించుకోండి- లేదా? గంగరాజుగారికి బందరు వ్రాసి తెలుసుకోండి. చాలును యీసందర్భంలో నన్ను కార్డులో కూడా వాఁడు దుర్మార్గుఁడు అని వ్రాసేవారి వ్రాఁతను ఆమోదించి నేను సమర్ధించడపు లౌక్యంయేమిటి? అని అడుగుతారేమో? అందులోనేవుంది. వెం. శా. ప్రజ్ఞావిశేషం యావత్తూ; ఈ బ్రాహ్మణుడువంటి యేకొలఁది మంది హృదయం లోనోతప్ప ఆనాఁటివిషయం లేశంకూడా యిప్పుడు వున్నట్లేలేదు. వారూవీరూ క్షీరనీరన్యాయంగా వుంటూవున్నరోజుల్లో యీయన మళ్లాదీన్ని లేవదీశారు. అయితే దీనిమూలాన్ని యీయనకేమాత్రమో లభించడం జరిగిందని వింటాను. అందుచేత కొంత అవసరమే అని తోస్తుంది. “సర్వ స్వార్ధం సమీహతే" కదా! యీయన ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. అత్యాశ్చర్యంగా కూడాను. దేవీభాగవతంలో నష? నా తెలివిని చూపించానుష?. (దేవీభాగవతమున నీతెలివి చూపి చూ.) దేవీభాగవతాన్ని ఆంద్రీకరిస్తూ వున్న నేను నా తెలివిని చూపక యితరుల తెల్వి నేలా చేసేదీ? యెరువు తెచ్చుకొనేదా? “ఆదికవిభేద మిందేమి యవసరంబు" అంటూ వకప్రశ్న యీప్రశ్నకు కొంచెం వ్రాసి యిఁక వ్యాసం విరమిస్తాను. ఆత్మకూరి విద్యావివాదం దేవీభాగవతం రచించడానికి మొదలిడిన కొద్దికాలంలో ప్రారంభ మయింది. ఆపండితులు లక్ష్యవిషయంలో భారతాన్నేకాని వొప్పేవారు కారు సరిగదా? అందులో నన్నయ్యనిమాత్రమే. యీచేదస్తం వారికి తెచ్చిపెట్టింది అహోబలుఁడున్నూ కవిరాక్షసుఁడున్నూ ఆసందర్భం యీకారణంచేత ఆకాలంలో ప్రస్తుతం అవడంచేత, ఆగ్రంథపీఠికలో భారతప్రామాణ్యాన్ని గూర్చి చర్చించడం అవసరం అయింది. యెత్తుకున్నాను. చర్చించాను. చర్చించాను. తుట్టతుదకి “ఏమైనను భారతమ్మునకు నంజలి సేయక తీరదేరికిన్." అని ముగ్గురు కవులూ ప్రామాణ్యకోటిప్రవిష్టులే అనితేల్చాను. యీయనకేం తెలిసి ప్రశ్నించారో! పాపం! “ఆదికవిభేద మిందేమి యవసరంబు" అంటూ ప్రశ్నిస్తూ, పైఁగా అంతటితో సరిపెట్టక, "దురభిమానంబు నీలోన దొరలికాక" అనికూడా