పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

553


“ఉపపతియా? (ఱంకుమగఁడా) అగ్రాసనాధిపతి?” అని కాశీ కృష్ణమాచార్లగారిని గుఱించి ప్రశ్నించారు. దీనిముద్దు లోకంగమనించి మెచ్చి మేఁకతోలు గప్పుతుందని మామామగారితాత్పర్యంగదా! దీన్ని విమర్శించవలసివస్తేనో, మొుగుఁడుగాని, ఱంకుమొగుఁడుగాని వుండవలసివస్తే ఆడాళ్లకేగాని మొగాళ్లకుఁ గాదుగదా? తి. వెం. కవులు మొగాళ్లా? ఆడాళ్లా? వొకవేళ విమర్శకులు "ఱంకుమొగుణ్ణి కట్టిపెట్టడానికి ఆఁడాళ్లే అంటారేమో? అనరు. కృతికన్యకను దయచేశారుగదా? అందుచేత సమన్వయించదు. లక్షణ చెప్పవలసివస్తుంది. ఆలక్షణ వాళ్లపెళ్లాలకో? తల్లులకో? నాయనమ్మలకో? అమ్మమ్మలకో? అనే అర్ధాన్ని తీసుకువస్తుంది. వాళ్లుదుష్ప్రవర్తనగలవాళ్లే అయితే యేమోగాని, సత్ర్పవర్తనగలవాళ్లే అయితే అలా అపవదించినవ్యక్తి యిహపరాలకు రెంటికీ దూరం అవడంలో సందేహ ముంటుందా? పద్యం సాపుగానే వుందని నేనూ వొప్పుకుంటాను. దానికి సేల్జోడుబహుమానం మినహాయించండి. తుట్టతుదకు యీలాక్షణికార్థంవచ్చి తీరుతుందనిన్నీ కంఠంపట్టుకుంటుందనిన్నీ లోకం యేవగించుకుంటుందనిన్నీ తెలిసేవంటే విమర్శకుఁడు గారు పాపం ఆలా చిత్రించి వుండరు. తెలియకపోవడానికి కారణం వొక్క లోకజ్ఞానవైధుర్యంమాత్రమే కాదు. శాస్త్రజ్ఞాన వైధుర్యంకూడా దానిలో చేర్చుకోవాలి. దీన్నిబట్టే నేను "శాస్త్రజ్ఞులుగాని" అని వీరిని గూర్చి నన్నయ్యవ్యాసంలో వ్రాస్తిని. దానికి నామీఁద వీరికి కోపంవచ్చింది. నన్నయ్యధారతో (తత్సమధారతో) నేను యేయితరకవుల ధారలు (ఆవిషయంలోనే) తులఁదూఁగవని వ్రాశాను. తూఁగేవి వున్నట్లు వీరు కొన్ని పద్యాలమొదళ్లు సూచించారు; అయ్యో! దేవుఁడా ఆపద్యాలు ఆమడదూరంలో కూడా నిలబడలేవు. పనిపడితే ఆయీవిషయం కవులలోకూడా యెవరికోగాని అవగతమయ్యేది కాదు. వీరు చూపినపద్యాలన్నీ వాడివడపోసి వ్రాసినమాటే అది. అందుచే యేమాత్రమో కూర్పునేర్పు మాత్రంతో సర్వజ్ఞత్వానికి దిగి "మనవెంకటశాస్త్రి నీతిమాలిన, తెల్విమాలిన, పనికిమాలిన, వ్రాఁతల్" అని వ్రాయడానికి సాహసించిన విమర్శకుఁడుగారికి ప్రస్తుత విషయం బొత్తిగా బోధించదు. నేను బోధించడానికి ప్రయత్నించినా లాభంలేదు. అని ప్రమాణంచేసి (చెప్పవలసిన విషయం కనక) చెప్పక తప్పిందికాదు. గర్వోక్తిగా భావించవొద్దని అభ్యర్థన. (వచ్చునె? . . యేమిచ్చినఁగాని, కానలకు నేగినఁగాని హరిప్రబోధముల్) అన్నాఁడు ప్రహ్లాదుఁడు. ఆయీ విషయము యీమధ్య యీవిమర్శకుఁడుగారి సన్మానసభకు అధ్యక్షులుగా వుండిన పిఠాపురపు కాలేజీపండితులు నిర్ణయింప వలంతులవుతారని వారి ముఖపరిచయం నాకులేకపోయినా వినికినిబట్టి విశ్వసిస్తూ బరాతం పెడుతూన్నాను. “కోవెత్తికవితాతత్త్వ మీశ్వరో వేత్తివా నవా? నేనల్లా విమర్శకుఁడుగారు నన్ను యెన్నితిట్టినా