పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“పుత్రాదిచ్ఛేత్తు" లోవుండేపుత్రత్వం సాక్షాత్పుత్రత్వమేకాని మలొకమూదిరిది కాదని అనుకోవడానికి అనేకాధారాలున్నాయి. కాని గ్రంథవిస్తర భీతిచే వుదాహరించ లేదు. సాక్షాత్పుత్రుల విషయంలో కలిగేపరాభవాన్ని ప్రతితండ్రి సంతోషపూర్వకంగా స్వీకరిస్తాండనే అంశం సర్వకవిసమ్మతమే. అందుచేతే శ్రీరామునకేమి, అర్జునునకేమి, అట్టి పరాభవాన్ని సంఘటించారు మన పూర్వకవీశ్వర్లు. ప్రస్తుతంమనకు కావలసింది, వేంకప్ప సోమయాజులుగారు యెంతో ప్రాజ్ఞలైనప్పటికి, తమ్ముండు పాపయ్యశాస్తుల్లుగారి శ్రేయస్సును కోరేవారైనప్పటికీ, ఆయన పేరు ద్వారా తమపేరు పయికి రావడానికి సుతరామున్నూ వప్పుకోలేదన్నది. దీన్ని గుఱించి విచారిద్దాంకొంత వకవేళయి పాపయ్యశాస్రుల్లుగారు తమ్ములు మాత్రమేకాక శిష్యులుకూడా అవుతారనుకుందాం. అప్పడేనా అంగీకరిస్తారేమో! లోకంలో యిప్పుడు మణికొందటి ధోరణ్ణింబట్టిచూస్తే శిష్యుండిద్వారా తమ పేరుకు వచ్చే ప్రసిద్ధినికూడా అంగీకరించరనే చెప్పవలసివుంది. అయితే మురారి మహాకవి - “సాంసా స్వశిష్యనివహైర్వినియుజ్యమానా )ே ـه విద్యాగురుం హి గుణవత్తర మాతనోతి అన్నాడుకదా:- దాని గతేమిటి?- అంటారేమో! దానిగతికేమి? అసలు వారొప్పుకోక పోయినా లోకంచెప్పుకోవడం మానుతుందా యేమి? ఫలానావారి మూలాన్ని యీయనకు గౌరవం వచ్చిందని? దాన్నెవరాంపగలరు? లోకాన్ని మూయడానికి మూకుడెక్కడ తేగలం? లోకజ్ఞానంబాగా వున్నవారు విద్వాంసులలోనే తక్కువగా వున్నారుకాని ప్రాకృతజనంలో చాలామంది వున్నారు. వక చతురుణ్ణి కోర్టులోఏదో సందర్భంలో నీపేరు చెప్పవలసిందంటే, నేను ఫలానా పుల్లమ్మ మొగుణ్ణని జవాబు చెప్పినట్టు వింటాము. అతడాలా చెప్పడానిక్కారణం యింటిపెత్తనమంతా చక్కంగా నిర్వహిస్తూ ధర్మకార్యాలుచేస్తూ పరువు మర్యాదలకు లోటులేకుండావర్తిస్తూవుండడంవల్ల తనపెండ్లాముకు యొక్కువ పేరుందని యెటింగి ఆశ్రేయస్సు తనదిగానే భావించుకోవడం తప్ప వేటొకటి కనపడదు! యేదో భట్రాజులు పద్యం చదువుతూ వుంటారు. కోటసింగరాజు మాటవాసేకాని గంగమాంబచేత ఘనతకెక్కె -- గంగమాంబ పెద్ద గయ్యాళిదైతేను, సింగరాజు యేమి సేయఁగలండు? అని. దీన్నిబట్టి ఆ సీంగరాజు కోపగించుకొన్నట్టు మాత్రం వినడంలేదు. తనకు పేరుప్రతిష్టలు తేఁదగ్గ మహాపతివ్రత భార్య దొరకడం కూడా పెద్ద అదృష్టాలలోదేకదా! అలాగేదొక్కా సీతమ్మగారి పేరేచెప్పకుంటారుగాని, భర్త జోగన్నగారిపేరు ముందుగా