పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకప్ప సోమయాజులు

59


చెప్పకోరు. జోగన్నగారు వ్యవసాయమో వేదాయమో చేసి యింతపదార్థం తెచ్చి సమృద్ధిగా యింట్లోపడేస్తేనే కదా సీతమ్మగారు వచ్చే అతిథి అభ్యాగతులను ఆదరించి వడ్డించి కీర్తిసంపాదించింది! అయితే అంతదాకా లోకాని కవసరంలేదు, శీఘ్రంగా ఉపస్థితమయే విషయాన్నిబట్టి చెప్పకుంటారు. కాబట్టి పాపయ్య శాస్రుల్లుగారి పేరు వేంకప్ప సోమయాజులుగారి పేరుకంటే శీఘ్రంగా ప్రతివాడికిన్నీ మనస్సులో స్ఫురిస్తూవుండడంచేత లోకులు సోమయాజులుగారిని పాపయ్య శాస్రుల్లుగారి అన్నగారనుకోవడం తటస్థించింది కాని లేకపోతే శాస్రుల్లుగారినే సోమయాజులుగారి తమ్ములని చెప్పకొనేవారు. మహానదీ ప్రవాహాన్నేనా ఆపడానికి పూనుకోవచ్చునుగాని లోకప్రవాహాన్ని ఆపడానికి పూనుకోవడం వెట్టిపని. హైదరాబాదు సికిందరాబాదులకు మధ్యవున్న పెద్దతటాకంపేరు హుసేనుసాగరం, యీహుసేను నైజాంరాజ్యాన్ని పాలించిన నవాబులలో వాండుకాండు సరిగదా మంత్రులలో వాడుకూడా కాడు. సామాన్యమైన నౌకరీ చేసినవాడైతే కావచ్చు. యేనవాబు రోజులలోవాడో కూడా మనకు బాగా తెలియదు. ధన ద్రవ్యాలిచ్చి తవ్వించిన ప్రభువుపేరు రాక యీ హుసేనుకు పేరువచ్చింది యేమనుకోవాలి? ఆపేరుతీసివేయడానికి ప్రయత్నిస్తే యేమేనా లాభం వుందా? పుణ్యెర్యశో లభ్యతే" అని యిదివరకే వ్రాశానుకదా! యింకొకటి అందఱూయెఱిఁగిందే వుదాహరిస్తాను. హరికథాచతురాననుం డనదగిన నారాయణదాసుగారిని యెఱగనివారు లేరుగదా. ఆయనతోకూడా తాటితో దబ్బనంగా వెనుక పాడుతూవుండే ఆయన అన్న గారినికూడా లోకం యెఱిగేవుంది. యీ అన్నగారే సర్వవిధాలా ఆదాసు గారిని యుక్తమార్గంలో పెట్టి కథాకాలాక్షేపం చేయించే హంగుదారుcడని దాసుగారే వప్పకుంటారు. సంగీతంలో దాసుగా రెంతవిజ్ఞలో అంతవిజ్ఞలు అన్నగారున్నూ అయివుంటారు. కాని లోకం యీమాటకు యెంతవఱకు అంగీకరిస్తూందో చెప్పజాలను. అన్నగారిగాత్రం సన్నవిడిగా మధురంగానే వుంటుంది. దాసుగారి గాత్రం ముదురుగా జంబోరాగా కొంత మోటుగా వుంటుంది. యిద్దఱున్నూ యేకగర్భజనితులే కనుక ఆసృష్టికర్తసృష్టి చేసేతరుణంలో గాత్రస్వరాన్ని నిర్మించేటప్పుడు సరిగా యేర్పాటు చేయాలనుకొని యీయన గాత్రంలో వేయవలసిన సామగ్రినికూడా పొరబాటున ఆయన గాత్రంలో పడవేసేదేమో అని నాకు తోస్తుంది. లేకపోతే తమ్మడి గాత్రం, శంభో అనేటప్పటకి మూCడుకోసులుదాకా ఉఱుముటిమినట్లు ప్రతిధ్వనివ్వడ మేమిటి? అన్నగాత్రం అంతంతలోనే అంతరించడమేమిటి? యిట్టి సందర్భంలో వక సభలో వక కొంటెకుబ్జవాండన్నాండటకదా : యేమండోయి దాసుగారూ! యేదో కొంత డబ్బు పెట్టి టికట్టు కొనుక్కొని రానేవచ్చాం. ఆయనచేత పాడించడం మానిపిస్తే యింకా కొంత డబ్బిచ్చుకుంటాం మీ కన్నాండని చెప్పంగా విన్నాను. "లోకులో కాకులో వాళ్లని