పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకప్ప సోమయాజులు

57


పాపయ్యశాస్రులవారి వాజ్మాధుర్యం మహాకవియు, మహావైణికుండును అగు శిష్టు కృష్ణమూర్తి గారితో కూడా పోటాపోటీ చేయందగ్గదిగాని సామాన్యమైనది కాదన్నది ముఖ్యాంశం. 2. QOSo పాపయ్యశాస్రుల్లుగారి వాజ్మాధుర్యానికి సాధకమైన గాథలెన్నో నేనెఱిఁగిన వున్నాయి. కాని విస్తరభీతిచే వుపేక్షిస్తున్నాను. వేంకప్ప సోమయాజులుగారు కడుంగడు గొప్పవారే అయినను, వాజ్మాధ్యర్యాన్ని బట్టియేమి, తఱుచు సభలలో అదేపనిగా వేదార్థం చెప్పక- వుండడంవల్లనేమి, దేశంలో పెద్ద పేరు పాపయ్యశాస్రుల్లవారికి వచ్చింది. యింతేనా కారణం యింకా యేమేనా వుంటుందా అంటే మనకు గోచరించేది యింతమట్టుకే. తక్కినది– “పబ్యైర్యశోలభ్యతే" అనేది. యేమైతేనేమి లోకంలో పాపయ్యశాస్రులవారి కున్నంతపేరు వేంకప్ప సోమయాజులు PেOS లేకపోయిందన్నది సర్వసమ్మతమైనమాట. పాపయ్యశాస్రులుగారు అన్నగారియందు ఎంత భక్తి ప్రపత్తులతో వినయవిధేయతలతో సంచరిస్తూవున్నప్పటికీ, తమ్మునిమీద నిష్కారణంగానే పై సంగతినిబట్టి వేంకప్ప సోమయాజులుగారికి అసూయపుట్టడం తప్పింది కాదు. అసూయ పుట్టినట్లు మనకు యేలాగ తెలియడమంటే, అది పుట్టకుండానే వుండాలిగాని పుట్టిన తర్వాత పైకి రాకుండా మానుతుందా? విన్నమాటలు సుమండీ! దీనిలో యెంత సత్యముందో, యెంత అసత్యముందో! లోకులు కాస్తవుంటే గంపంత కల్పనచేస్తారన్నది సత్యదూరంకాదు. వకప్పుడెవరో వేంకప్పసోమయాజులుగారిని గూర్చి ఎవరికో తెల్పుడుచేసే విషయంలో, వీరే వేంకప్ప సోమయాజులుగారు’ అనిచెప్పి వూరుకోక పాపయ్యశాస్రుల్లుగారి అన్నగారు' అనికూడా ఆమాటకు తోంకగా తగిలించారంట! దానిమీంద వేంకప్ప సోమయాజులు గారుతోఁకతొక్కిన తాచులాగులేచి "యేమీ?... పాపిగాండి అన్నగారనకపోతే అచ్చయ్యగారి కొడుకనిపించుకోడానికి తగనా?” అని పెద్దగా మండిపడ్డారంట. యిది యితరుల కల్పనే అయితే పరిశీలించ నక్కఱలేదుకాని నిజమే అయిన పక్షానికి కొంత చర్చించవలసి వుంటుంది. అంతగొప్ప పండితుండుగదా, ఆయన తన తమ్ముండి యందు అంత అసూయగా వుండడం తటస్థిస్తుందా అన్నది యిక్కడ విచారణీయం. అయితే యిది యశోవిషయం కాCబట్టి, తండ్రిని కొడుకు సహింపఁడు, కొడుకును తండ్రి సహింపడు అన్నదిన్నీ లోకప్రసిద్ధమే. “సర్వత్రజయ మన్విచ్బేత్" అన్నదానిలో "పత్రాదిచ్చే త్పరాజయం" అనివుండడంచేత వక పుత్రుణ్ణిమాత్రమే మినహాయించవలసి వుంటుందికాని తదితరులను మినహాయించవలసి వుండదు. తమ్ముఁడు కూడా కుమారుcడివంటి వాండే అనుకోవడానికి “పితృసమోజ్యేష్ఠః" అనేది సాయపడుతుంది. కాని అంతమాత్రంచేత లాభంలేదు. దానివల్ల తమ్మండియందు వచ్చే పుత్రత్వం ఆరోపిత పుత్రత్వం అవుతుందిగాని సాక్షాత్పత్రత్వంకాదు.