పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/527

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

531


యిక్కడ విమర్శించే వారికి కొంత అవకాశం వుంది. అదేమిటంటే? మొదట నల్వదియైదేళ్లంటూ వ్రాశావేమి? పద్యంలో “నల్వది పైనాలుగు అనిమాత్రమే వుందికదా? పరస్పరవిభేదంగాలేదా! అని శంకించేవారికి సమాధానం వినండి. యిప్పటికి సుమారు సంవత్సరం తొమ్మిదిమాసాల క్రితం యీవ్యాధినితట్టుకొనేశక్తి బొత్తిగాలేని దౌర్బల్యం యేర్పడింది. అప్పుడు చెప్పినది యీపద్యం. అందుచేత యిప్పటికీ, అప్పటికీ మధ్యవున్నకాలం కొంత అందులో చేరవలసిరాక ఆ వ్యత్యాసం కలిగిందని మనవిచేస్తాను. అయితే యిదిన్నీ వకశంకేనా? దీనికి సమాధానం యెందుకని తాము కాకపోయినా మఱెవరేనా శంకిస్తారేమో, యెవరో అక్కఱలేదు. దేవరవారే యిట్టిశంకలు చేసేవారిలో అగ్రగణ్యులనే సంగతి యీవ్యాసంలోనే అవకాశంవుంటే కొంత లోకానికి ఋజువుచేస్తాను. అందుకే అనుకుంటాను నేను గతంలో కొన్నాళ్లక్రితమే గతించవలసివుండిన్నీ ఆగవలసి వచ్చిందని తోస్తూవుంది. తక్కినశంక లేలావున్నా “దాఁటెను” అన్నచోట మీశంక తప్పదుగదా? "దాఁటెను నన్నయ" అన్నది, "తప్పెను నన్నయ" అని దిద్దుకున్నట్లు వ్రాసివున్నారు. అది పుస్తకంచూడకుండా వ్రాయడంచేత కలిగిన మార్పుగాని నాదిద్దుబాటుకాదని విజ్ఞప్తి మీరు భ్రమపడినారు. మీరనుకొన్నదోషం దాఁటులోలేదు. ప్రసక్తికలిగింది కనక యింకొక పద్యంకూడా ఆఘట్టంలోదే వుదాహరించి మఱీ ప్రస్తుతం అందుకుంటాను. -

"మ. ఇదియే బందరునందు నిల్పె నను నెన్నేనేళ్లు సంపన్నుఁగా
       నిదియే సల్పె ననేకశిష్యులకుఁ దా నీరోగమే యొజ్జగాఁ
       బొదలించెన్ ధ్రువ మేను దీనిభయముం బోనెట్టఁగానెంచి నె
       మ్మదిగా నొక్కట నిల్చితిన్ నిజము సుమ్మా! తల్లి! కామేశ్వరీ.”

సరే! ప్రసక్తివచ్చి మఱోపద్యం చదువర్లవినోదార్థం వుదాహరిస్తే యిది విమర్శకాగ్రేసరులైన తమవంటివారికి పెక్కుశంకలు కలిగించేదిగా పరిణమించిందే. కాగతిః అవును తప్పేమీ? రోగమేమిటి? అన్ని వుపకారాలు చేయడమేమిటి? యిది ప్రష్టవ్యాంశం కాకపోతుందా? అయ్యా తెలియక అడుగుతాను. యివిన్నీ శంకలేనా అని మిమ్మెవ్వరూ మందలించనే లేదేమండి - ఆశ్చర్యం. అందుచేత యేదోజవాబుచెప్పే తీరవలసిందేనా? అంతే వినండి. అడిగేవాడికట! చెప్పేవాడట! లోకువట! అంతేనేకాని యివన్నీ పూర్వపక్షాలే అవుతాయా? శాంతం పాపం. యీపద్యచరిత్ర చెప్పవలసివస్తే అధమం రెండువందల ఫారాలేనా గ్రంథం పెరుగుతుంది. పత్రికాప్రవర్తకులు శ్రీయుతులు వెంకటేశ్వరశాస్త్రుల్లుగారు విసుక్కోకుండా ప్రకటిస్తారా? అని కూడా సందేహం. వారు నాకు యెన్నో వత్సరాలనుంచి