పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/528

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

532

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పత్రిక గౌరవార్థం పంపిస్తూన్నారుగాని, యెప్పుడు గాని వొకమంచివ్యాసం విపులమయినది వారిపత్రికకు నేను పంపించిన పాపాన్ని పోలేదని లజ్జిస్తూ వుంటాను. అయితే సుమారు సంవత్సరానికి పూర్వం కొన్నివేలకాలాలుదాకా వ్యాసాలు వ్రాసివున్నాను. అప్పుడేనో కొన్ని వ్యాసాలు వారిపత్రికకి పంపిస్తే యీలజ్జించడానికి అవకాశమే లేకపోయేది కాని ఆ పత్రికలకున్నంత వ్యాప్తి దీనికి లేదనుకొని నే నాకాస్త పనీ చేయలేకపోయాను, ప్రస్తుతం గుం|| డి|| విమర్శకుఁడుగారు నా “నన్నయ్యభట్టు" వ్యాసానికి జవాబుగా యిచ్చే “సంశయవిచ్ఛేదావచ్ఛేద ప్రచ్ఛేదోపచ్చూద" వ్యాసం నా “నన్నయ్యభట్టు" వ్యాసంలో వీరివిమర్శక గ్రంథాన్నుంచి యెత్తిచూపిన ముప్పయివక్క దూషణవాక్యాలన్నీ బాగా చూచివుండడంచేతకాఁబోలు వీరివ్యాసాన్ని “తోసిరా" జన్నారు. దానిచేత ఆసందర్భం యేమీ యెఱగని త్రిలింగకదివచ్చింది. వస్తేమాత్రం ప్రాజ్ఞులు వేంకటేశ్వరశాస్త్రుల్లుగారు వ్యాసకర్తగారి తిట్లు “పదియవనాఁటిముతైదువు" లోనైనవిన్నీ హాస్తోక్తులు ద్రావిడ స్త్రీలకుచాలు లోనైనవిన్నీ (నేనుయెత్తిచూపినవి) చూచేవంటే కృష్ణవారుచేసినట్టే చేశేవారుకాని అవి వారెఱుగనేయెఱుగరని పూర్తిగా విశ్వసిస్తూ వారికి నేనొక చిన్నవిజ్ఞప్తికూడా పనిలోపనిగా అందించుకుంటూవున్నాను. అయ్యా! నన్ను సంవత్సరంనాడు త్రిలింగపీఠంవారి సమ్మానసభలో మీరు చూచివున్నారు. నాకోరికమీద– “చరకసంహితను" కూడా నాకు మీరు యిచ్చివున్నారు. జ్ఞాపకం వుందా? అప్పటి నాశరీరస్థితి యెంత శోచ్యస్థితిలోవుందో మీకు నేను వ్యాఖ్యానం చేయనక్కఱలేదు. యిది నానాటికి పోయేకాలంగాని, వచ్చేకాలం గాదుకదా? అందుచేత అప్పటికంటే యిప్పుడు యెంత కృశించివుంటానో వేఱే వ్రాయనక్కఱవుంటుందా? వుండదు. ఇట్టిస్థితిలో- “తిరుపతి వేంకటకవుల గ్రంథవిమర్శనం" అనే పేరుతో యెన్నో బండబూతులు (మనుష్యులలో యెవరో తప్ప నోట వచింపరానివిన్నీ వినరానివిన్నీ) తిట్టిన యీ గుం|| డి|| విమర్శకుఁడుగారు యింకా యేమో తారతమ్యశూన్యంగా వ్రాసే చేతగానివ్రాతకు అవకాశం యిచ్చి నాకుపనికల్పించడంలో (ఆయీతత్త్వం యెరక్కే అనుకుందాం) మీరు భాగస్వాములయినందుకు నేను మిక్కిలీ విచారిస్తూన్నాను. యీయన తిట్టినతిట్లు మళ్లా యిక్కడ నేను అనువదిస్తే గ్రంథం చాలా పెరుగుతుంది. ఆతిట్లను చూచేవుంటే యీమధ్య వీరిసన్మానానికి ప్రసిడెంటుగా వీరివూళ్లోనే జరిగినసభకు వచ్చిన పండితులు మెల్లగా తప్పుకునేవారే అని ఖండితంగా నొక్కిచెపుతున్నాను. శ్రీశిష్ట్లావారు (పేరు జ్ఞాపకంలేదు) ఈయన మాగ్రంథాలమీద చేసినవిమర్శనకు నేను మెచ్చుకున్నానంటూకూడా వుటంకించి యీయన్ని ప్రశంసించారు. యుక్తంగావుంటే నేను ప్రశంసించేస్వభావం కలవాణ్ణో కానో? "గిడుగా? పిడుగా" వగయిరా నావ్యాసాలెఱిగివున్న మీబోట్లకు వేఱేవ్రాయనక్కఱవుండదు. రామ! రామ! ఈయన వ్రాసిన