పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

501


పాడినపాటే

శ్లో. ఉచిత మనుచితం వా కుర్వతా కార్యజాలం
    పరిణతిల రవధార్యా యత్నతః పండితేన
    అతి రభసకృతానాం కర్మణా మావిపత్తే
    ర్భవతి హృదయదాహీ శల్యతుల్యో విపాకః.

శాస్త్రులవారిని నే నడిగిన యంశమేమని? ఏదో యొక దానిని గూర్చి అనఁగా? మీరెక్కుడు నమ్మికతో మరల నెత్తికొని వ్రాసిన శ్రీకారమును గూర్చియా? అందు ఒందుగా మార్చుటను గూర్చియా? ప్రప్రథమమును గూర్చియా? “ఇట్లనే, అట్లన" అనువానిం గూర్చియా? "కొంపతీఁతను” గూర్చియా? ఈ చూపినవానిలో దేనిం గూర్చియో? వ్రాయవలసినదని నిరూపింపుఁడు. దానింగూర్చి చేత నైనంతలో విస్తరించి వ్రాయుదు ననియేకదా? అట్లేదో యొకటి నిర్దేశింపఁబడవలసి యుండఁగా మరల సూత్రప్రాయముగా మున్ను దత్తోత్తరములగు శ్రీకారములోనగు పెక్కింటి నుదాహరించి వాదము పెంచుటేలొకో? వారి తాత్పర్య మెట్టిదియైనను నేను "పరప్రతారణమాత్ర ప్రయోజనముగా" భావించుచున్నాఁడను. ఈపరప్రతారణ ప్రధాన ప్రయోజనపు వ్రాఁతలో "చండాలోస్తు" “జ్ఞానహీనో గురుస్త్యాజ్యః" ఇత్యాదికము వ్యక్తిదూషణాశయమును ధ్వనింపఁజేయుచున్నవి. ధ్వన్యర్థ మిటులుండఁగా వాచ్యార్థము మిక్కిలిగాఁ దమకు మాయెడల గౌరవమున్నట్లు చాటుచున్నవి; పెక్కు వాక్యములు గలవు. వానిం గూర్చి యడిగి గ్రంథము పెంచుటకు నే నిష్టపడను. నేను వారి వ్రాఁతయొక్క సారాంశమును నిరూపించుచుఁ దత్సందర్భమున వ్రాయక తప్పని విధిచే “గురు శుశ్రూషణయా" అని యుదాహరించినదానికి మరల శాస్త్రులవారు కుపితులై తాము శిష్యత్వము నంగీకరించినను “నేను గురుత్వమునకుఁ దగను" అను నంశమును వాచ్య వృత్తిచేఁ బ్రకటించినారు. ఆ యక్షరము లియ్యవియే, తిలకింపుఁడు.

“కాని. వేంకటశాస్త్రులవారు గురువులగుటకుఁ దగుదురా?" లోనగునవి. వారు “తగ”రని వ్రాయుచుండఁగా నేను "తగుదు"నని వ్రాయుట యపహాస్యాస్పదముగా నుండునని యెఱిఁగియుఁ దప్పని విధియగుటచే నిట్లు వ్రాయుచున్నాఁడను. అయ్యా!