పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/498

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

502

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శాస్త్రులవారూ? మీ విమర్శనపుcబద్ధతిని బరికించినను మీ రచ్చటచ్చటఁ గుండలీకరణపు గుర్తులతో లిఖించెడి యాంగ్లభాషా వర్ణములనుబట్టి చూచినను మీకా భాషలో గూడఁ బాండితి యున్నట్లు తోcచెడిని. దానిలో మీకు గురుత్వము జేయుటకు నాకు లేశమును బ్రవేశములేదు గాని మనకుఁ బ్రస్తుతము నడచుచున్న "వాదోపవాదములు" దానికి సంబంధించినవికావు గనుక, దీనికి సంబంధించిన సంస్కృతాంధ్ర భాషలలో గురుత్వము చేయఁగలనని నొక్కి వక్కాణించుచున్నాఁడను. ఇట్లు నా వ్రాసినవ్రాఁత లోకులకు సర్వదా "భోజనమునకు రావలదనిన, పట్టుచీర గట్టుకొనివత్తును అను సామెతను స్ఫురింపఁ జేసెడినని యెఱిఁగియు వ్రాయ సాహసించిన నన్ను గౌరవించి యొకపరి సెలవుదినములలో దర్శన మిప్పింపఁగోరెదను. “అధవా విద్యయా విద్యా" కనుక నాకు మీ రాంగ్లభాషలో గురుత్వము చేసి నాఋణమును దీర్చికోవచ్చును. లాక్షణికులు "కావ్యజ్ఞశిక్షయాభ్యాసః" అని వ్రాసిన వ్రాఁతకుఁ బైరీతినిన మీరు సార్థక్యము గలిగించుట సర్వథాయుక్తము. నేను "కావ్యజ్ఞుఁడను" అని మీ రిందును వెనుకటి పత్రికలయందును వ్రాసిన వాక్యములలో ననేకములు తోడ్పడుచున్నవి. కావున వాని నందందు మీరే చూచికోఁగలరని యిందెత్తలేదు. "అన్యోన్యం గురవో విప్రాః" కనుక నిట్లొనర్చుటలో మీకుఁగాని, నాకుఁగాని యవమానము కూడ నుండఁగూడదు. మీకు నేను "చండాలుఁడనుగా" దోఁచినను నా బుద్ధికి మీరుత్తమ బ్రాహ్మణ వంశజులుగనే ముమ్మాటికిని దోఁచుచున్నారు. కావుననే యిట్లు వ్రాయఁగలిగితిని. "నీచాదపి మహావిద్యా"యను దానిని స్మరింపుఁడు. ఇంతవఱకు మీరు వ్యక్తికిఁదగుల వలయునను నాశయముతో వ్రాసిన యక్షరములను బురస్కరించుకొని వ్రాసినవ్రాఁత. ఇఁకఁ బ్రస్తుతాంశము నుపక్రమింతము. ఏదో యొకదానినిగూర్చి నిర్దేశింపుఁడని కోరితిని. అట్లేమీరు నిర్దేశింపక మరలఁ బెక్కువిషయములనెత్తికొనిరి; పోనిండు. ఈయెత్తికొన్న వానిలోనేని యొకదాని నీసారి నిరూపింపుఁడు. అనారోగ్య ప్రయుక్తమగు నసమర్థతచే మిమ్మిట్లభ్యర్థించుచున్నాఁడను, సత్యమును గ్రహించి యట్టు లనుగ్రహింపుఁడు. ఇఁక నా కోరికమీంద మీరు నాకుc బరీక్షార్థమై యొసఁగిన “తత్ర శ్లోక చతుష్టయమ్" అను నభియుక్తోక్తి కుదాహరణ మనఁదగు చతుష్టయములోని "అస్మాన్ సాధువిచింత్య" అనుదానిని నే నెట్లు పాడుచేయుదునో కొంతమాత్రమే యిపుడు తిలకించి దానిని మీశక్తికొలఁదిని సమర్ధింపుఁడు. ఈ నా యవ్యక్తపు వ్రాఁత స్వయంకృతాపరాధ ప్రయుక్తము కాకవేవల పరేచ్ఛా ప్రారబ్ద ప్రయుక్తమని పత్రికా పాఠకులెల్ల నెఱిఁగియే యుందురు. కావున వారు నన్ను రోయకుందురని తలఁచి యిందుల కుపక్రమించుచున్నాఁడను.

"అస్మాన్, సాధు, విచింత్య, సంయమధనాన్" ఇచట, అస్మాన్ అనుపదమునకుఁ గణ్వమహాముని యర్థము, బహువచనము. “అస్మదోద్వయోశ్చ" అను సూత్రముచే