పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకప్ప సోమయాజులు

53


తెలుస్తుందికాని, లోకంలో ప్రవాదమాత్రం, యీ కలియుగంలో ఆధానం వఱకు మాత్రం చేసి త్రేతాగిసిద్ధిని పొందితే చాలుననిన్నీ పశుహింసతో చేరిన తక్కిన యజ్ఞయాగాలకు పోంగూడదనిన్నీ వారి యభిప్రాయమైనట్లు పలువురు పెద్దలు చెప్పంగా విన్నాను. ఇది సత్యమైతే కావచ్చు. యింక తక్కిన శాస్త్రివగయిరా బిరుదాలు ధరించడానికి అన్నీ రావడం వల్ల వకదాన్నే బోధించే బిరుదాన్ని ధరించడం యిష్టంలేక అచ్చయ్యగారు అచ్చయ్యగారుగానే యావజ్జీవమున్నూ కాలక్షేపం చేసినట్లువిన్నాను. వినడంలో అసలు అచ్చయ్యగారే యీ విషయం యిట్టిదని యెప్పుడో స్వయముగా వక్కాణించారనికూడా విన్నాను. యిందులో సత్యమెంతో, కల్పితమెంతో! అది అల్లా వుంచుదాం. అచ్చయ్యగారు సాక్షాత్తూ రెండో చతుర్ముఖుండు అన్నంతవఱకు అందఱూ నిర్వివాదంగా వప్పకుంటారు. వకరిని గూర్చి వ్రాసేటప్పుడు వేరొకరి ప్రసంగం యెత్తితే తేలదు. యిప్పడు మనకథానాయకులు వెంకప్పసోమయాజులుగారు గాని వారి తండ్రి అచ్చయ్యగారు కారు.

వెంకప్ప సోమయాజులుగారివి కూడా వేదశ్రాతాలకు సంబంధించిన గాథలు చాలా వున్నాయి. యీ వేంకప్పసోమయాజులుగా రనేవారటకదా:- యీ శ్రాతప్పల్లకీ వకవైపు దండి మాత్రమే బుజాన్ని పెట్టుకొని నేను మోస్తువున్నాను. రెండోదండి బుజాన్ని పెట్టుకొనేవాళ్లు కనపడడంలేదనేవారంట. కాలకర్మదోషాన్ని బట్టి యిప్పడీ విషయాలు ముచ్చటించుకునేవారు కూడా లేరుగాని శ్రాతమంటే సామాన్యంగాదు. యిప్పటికీ యీ గోదావరీతీరంలోనూ, కృష్ణాతీరంలోనూ, కావేరీ తీరంలోనూ, యింకా శ్రాతవిద్య శేషించివుంది. పూర్తిగా నశించలేదు. వెంకప్ప సోమయాజులుగారే కాదు, బులుసు వారందఱున్నూ వేదశ్రాతాలు వచ్చికూడా ఛాందసులుగా మాట్లాడడం కాక యుక్తియుక్తంగా సభారంజకంగా మాట్లాడే నేర్పు కలవారని పలువురవల్ల వినివున్నాను. ప్రస్తుతానికి అంతగా అవసరం లేక వుదాహరించలేదు. గాని యెనభైయేండ్లవయస్సులో తిరిగీ వివాహం చేసుకొనేనిమిత్తం తూర్పు దేశంలోవున్న జమీందారులను చూడడానికి వేంకప్ప సోమయాజులుగారు ప్రయాణం చేస్తూ వున్నప్పటిగాథలు చాలా హృదయంగమంగా వుంటాయి. పెండ్లిచేసికొన్న పిమ్మట వక రాజుగారు యొకసక్కెంగా, సోమయాజులుగారూ! అవ్వగారు చెప్పినట్టు వింటూవున్నారా? అని ప్రశ్నించినట్టున్నూ దానిమీద మన సోమయాజులుగారు యొకసక్కెమాడిన ప్రభువుగారికి నసాళం అంటేటట్టుగా “రాeూ? వక్కపిల్లవినదూ? వక్కపిల్ల" అని యేడుసార్లు కాంబోలును రెట్టించి జవాబు చెప్పినట్టున్నూ చెప్పకుంటారు. యిట్లామాట్లాడడం ఛాందసులలో మిక్కిలి అరుదు.

ఈ వేంకప్పసోమయాజులుగారి తమ్ములే మిక్కిలి సుప్రసిద్దులైన పాపయ్యశాస్రుల్లు గారు. అచ్చయ్యగారి ప్రతిష్ట సరేకదా! వేంకప్ప సోమయాజులుగారి ప్రతిష్ట విన్నారుకదా! \