పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యీ పాపయ్యశ్రాస్రుల్లుగారి ప్రతిష్ఠనుగూర్చి యెంతని వ్రాయను? యీయన కుమారుండు ప్రకాశశాస్రుల్లుగారు తండ్రిని మించినవారు. యిటీవలకూడా వీరివంశం తామరతంపరగా విద్యా యశోధనాలతో భగవదనుగ్రహంవల్ల తులతూంగుతూనే వుందిగాని, ప్రస్తుత కాలానికి బొత్తిగా పనికిమాలినవనే హేతువు చేతకాCబోలును అనూచానంగా వస్తూవున్న వేదశాస్త్ర శ్రాతాలను వంశీకులు వదలుకొన్నటూహించుకోవాలి. ప్రసక్తానుప్రసక్తంగా పాపయ్య శాస్రుల్లుగారి ప్రసంగం వచ్చింది. ఈయన వేదశాస్త్రశైతాల్లో అన్నగారికిఁగాని తండ్రిగారికిం గాని లేశమున్నూ తీసిపోయేవారుకారు. కాని శ్రాతంలో అన్నగారిలాగు అనేక యజ్ఞాలకు పాత్రచేతCబట్టి ఆధ్వర్యవాన్ని చేయక యేవో కొన్నిటికిమాత్రమేచేసి విరమించినట్లు వింటాను. ఏమయినా, శ్రాతప్రయోగ విషయంలో ప్రాక్టీసు వేంకప్ప సోమయాజులుగారి కెక్కువ. పాపయ్య శాస్రులుగారో హైకోర్టులాయరీ ప్యాసై కోర్టు కెప్పడో కొలందిసార్లు మాత్రమే వెళ్లి విరమించిన శ్రీ రెంటాల వేంకట సుబ్బారావు పంతులుగారి వంటివారు. వేదార్థం చెప్పేశక్తి వేంకప్ప సోమయాజులుగారికి కూడా వున్నట్లే వింటానుగాని పాపయ్యశాస్రుల్లువారి వంటి ప్రజ్ఞవారికే కాదు యెవరికీ లేదని వింటాను. విద్యారణ్యం పాపయ్యశాస్రుల్లుగారికి కంఠపాఠమేనంట! ధర్మశాస్త్రాలన్నీ వాచోవిధేయంగా వుండేవంట! యెంతని వ్రాయను వారి ప్రజ్ఞగూర్చి యింక లౌకికత్థానంలో యేప్లీడరూ పనికి రారంట వారిముందు. వారు వేదార్థం చెపుతూవుంటే, అవతల యెంతో అందగత్తె, పాటకత్తె, అయిన వేశ్య అభినయిసూ వున్నప్పటికీ ఆసభలోకి వెళ్లక పండిత పామరులందఱూ వచ్చి వీరి సభలోనే కిక్కిరిసి వుండేవారంట! యివన్నీ పెద్దలు చెప్పకుంటూవుంటే విన్నమాటలు.

వారి కాలంలో యే బాల్యవయస్సులోనో నేనుకూడా యేకావ్యాలో చదువుకుంటూ వున్నప్పటికీ నా విద్యార్ధిత్వమంతా వక్కకడెద్దగ్రామంతప్ప తక్కింది గౌతమికి యీవలివడ్డున జరిగిందే అవడంచేత ఆ మహానుభావుణ్ణి దర్శించడానిక్కాని ఆయన వాక్కును వినడానిక్కాని నోంచుకున్నది కాకపోయింది. మా తిరుపతిశాస్త్రి అంతో ఇంతో కోనసీమ విద్యార్ధిత్వము చేసినవాG డవడంచేత పాపయ్యశాస్రుల్లవారి దర్శనభాగ్యమేనా అతనిక్కలిగింది. యేమైనా వారికాలంలో నేనుకూడా వున్నానని గర్వించడానికి మాత్రం నాకుకూడా అధికారంవుంది. యీ విన్నమాటలమీందనే వకరాజసభలో పిచ్చాయి అభినయాన్ని గూర్చి మాట్లాడవలసివచ్చి యీ క్రింది పద్యం నేను చెప్పఁగలిగాను.

తే.గీ. వేదమున కర్ధమును జెప్పఁ బృథివియందు
బులుసుపాపయ్యశాస్త్రి కే పోలుఁగాక
అభినయమొనర్చి పండితసభలనెల్ల
“హాయి" యనిపింప నొక్క పిచ్చాయి తగును.