పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆ పట్టాన్ని ఆమె గుమ్మం అలకడానికి నీళ్లు తెచ్చుకొన్న నిలువుచెంబుచూపించి దీనెండు వరహాలు తెస్తే చాలునన్నట్లున్నూ, అప్పడే ఆచెంబుచేతcబుచ్చుకొని అచ్చయ్యగారు దేశాంతర గమనాభిముఖులై కొన్ని ప్రయాణాల మీంద హైదరాబాదు చేరుకొన్నట్టున్నూ అక్కడ వక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూవుండగా కాకతాళీయంగా వీరా యజ్ఞసమయానికే అక్కడికి వెళ్లి యజ్ఞశాలలోకి వెళ్లినట్టున్నూ అక్కడ యేదో ప్రాయశ్చిత్తవిషయంలో శ్రాతులలో శ్రాతులకు వివాదవచ్చి వాదించుకుంటూ వుంటే, యీ అచ్చయ్యగారు కలగజేసుకొని “యిదమిత్థం" అని ఖండించి చెప్పినట్లున్నూ దానిమీద వక శ్రాతి “నిన్నెవరడిగారయ్యా నీవు చెప్పడానికి, అబ్బో.! నీవేమో బులుసు అచ్చయ్య వయిపోయినావే" అని సోల్లంఠంగా మాట్లాడేటప్పటికి అచ్చయ్యగారు “అలాగేఅనుకోండి" అని జవాబు చెప్పినట్టున్నూ, తుట్టతుదకు వారిలోవారు ముఖముఖాలు చూచుకొని, అచ్చయ్యగారే అని స్థిరపడేటప్పటికి, అచ్చయ్య గారిని ఆశ్రాతులందఱూ విస్తారంగా గౌరవించి, అప్పడు గోలకొండ నవాబుకు దివాన్జీగారున్నూ దేవబ్రాహ్మణ భక్తుఁడున్నూ, మిక్కిలి ఆస్టికుండున్నూ అయిన చందోలాలాగారికి విన్నవించేటప్పటికి వారుకూడా వీరి పేరు అంతకు పూర్వమే వినివుండడంచేత అచ్చయ్యగారిని విశేషంగా గౌరవించి తాము యేకోరికమీంద యిక్కడికి దయచేశారో సెలవీయవలసిందని ప్రార్థించేటప్పటికి, నాకు యేకోరికా లేదు. “పంచమేలి_ హనిషష్లేవా" అన్నట్లు కాలక్షేపం చేయడమేనాకోరికగాని వేటేకోరిక లేశమున్నూ లేదని చెపుతూ, చేతులోవున్న చెంబును చూపి యింట్లో ఆడవాళ్లకోరిక యిట్టిది అని చెప్పినమీందట దివాన్జీగారు యేదేనా జహగీరు యివ్వడానికి ఉద్యుక్తులుకాంగా, వారు దానిని అంగీకరింపలేనట్టున్నూ, దానిమీంద విధిలేక ఆ చెంబెండు వరహాలు మాత్రమే యిచ్చి పంపినట్లున్నూ, అవి తీసుకువచ్చి భార్యకిచ్చి అది మొదలు నప్రతిగృహీతలుగానే వుండి కాలక్షేపం చేసినట్లున్నూ, అందఱున్నూ యిప్పటికిన్నీ చెప్పకుంటారు. యింకా అచ్చయ్యగారి నప్రతిగ్రహీతృత్వాన్ని గూర్చిన యితిహాసాలు చాలా వున్నాయి మచ్చుకు వకటిమాత్రం వుటంకించాను.

ఇCక పాండిత్యం యేలాంటిదంటారా? “విస్సన్న చెప్పింది వేదం" అన్న సామెతకి కారణభూతులైన యింద్రగంటి విశ్వపతిశాస్రుల్లు గారు అచ్చయ్యగారి శిష్యులే అన్నచో వారి పాండిత్యం యెట్టిదో చెప్పనక్కరలేదు; అయితే అంతగొప్పపండితులుగదా శాస్త్రి, అవధాని, సోమయాజి, లోనైన బిరుదు లేమీలేకుండా వట్టి అచ్చయ్యగారే అనిపించుకున్నా రేమని వకశంకరావచ్చును. సోమయాజులు అనిపించుకోవడానికి అచ్చయ్యగారు యజ్ఞం చేయలేదంట. వేదశాస్త్ర శ్రాతాలు వచ్చిన మహాపండితుండుగదా? ఆయన యజ్ఞం యెందుకు చేశారుకారు? అని మళ్లా శంక రావచ్చును. యెందుకు యజ్ఞంచేయలేదో మనకేం