పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/480

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

484

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సమాధానమిచ్చి యందుఁ బ్రకటించిన విషయములం గూర్చి కూడ వీరు వ్రాయవలసి యుండదు. వీరు ప్రథమ ముద్రణపుఁ బ్రతినిజూచి యుందురు. అందట్టి యాధారమున్నదో లేదో, అది యిప్పుడు చెప్పఁజాలము. లేదే అనుకొందము, అట్టి యూధారము లెవరికి? “అబ్రవీ త్పురాణ పండితులకుఁ” గదా? వీరు విజ్ఞులు, వీరి కట్టి వెందులకు? బ్రాంతి పురుషధర్మముగాన వీరన్యధాగాఁ బదచ్ఛేదము చేసికొనిరని యూహింపవలసియున్నది. మఱియు, “తోడనేనా? ఇది యెట్లు సిద్ధము? అవి యడిగిరి. ఇట్లు సిద్ధమని నొడువుదునా? "పదునాల్గు కోటులే నా? మఱియున్ ఘనంబుగ ధనంబు" (కుమార ధూర్జటి)

ఈ యిందుమతీ పరిణయ ప్రయోగమునకేమి గతియనియు, మధ్యద్రుత మెట్లు చేరినదనియు మరల నడుగుదురేమో? అడుగరు, శాస్త్రులవారు మాత్రము, “తెలుఁగునకున్న వ్యాకరణదీపము చిన్నది” “విలువగల కవుల లక్ష్యమ్ములె తామీ భారమెల్ల మోయఁగవలయున్" అను నంశము నెఱుఁగనివారా? కాదు. మాకుఁ బ్రయోగములతో నవసరమే లేదని వ్రాయ మొదలిడుదురందురా? మొదలిడనిండు, అంతభాగ్యము పట్టునప్పడాలోచింతముగాక. మఱియు, “నుగ్గు-పిండి, అనియర్థము. మదమని యర్థములేదు" అని యాక్షేపించిరి. ఇది యేమికర్మము, మేమును మదమని యర్థము చెప్పమే, పిండియనియే చెప్పుదుమే. అగుచో సమన్వయమెట్లని శంకింతురోటు? ఇట్లు, కన్, అనుదానికి లోపము, నుగ్గుగన్, అని తేలినది - పిండియగునట్లుగా, అణంచి, అని సమన్వయము లోపమునకు వ్యాకరణ మడుగుదురా? సపాశుపతాశ్వమేధమున దీనింజూపియే యున్నారము. త్రిలింగ లక్షణ శేషము తిలకింపవలెను. మఱియు, “పిండంబులపై ధారకునుండున్" ఇయ్యెడ నళ్లీలమఁట! చచ్చుచున్న దుర్యోధనునకు వీరు పిండంబులు పెట్టించుచోటఁగూడ యాజ్ఞికుని నోటఁ గూడ నీమాట ప్రస్తావన మేభాగమునందును లవమునునుండరాదని విమర్శకుల యాశయమనుకొందమా? అట్టి యభిప్రాయమును విమర్శకులు ప్రకటింపవలెనుగాని ప్రకటించుచో నుదాహరణములకే కఱవా? ఈవిషయమున వీరు, “యాభవతః" అని యుదాహరించిరి. అటcదగులు దోసమునకును నిట వీరనుకొన్న దోసమునకును జాల వ్యత్యాసముకలదు. అది కవి వేఱొక తాత్పర్యముతోఁ బ్రయోగించిన వేఱొకటిగాఁ బరిణమించుటచే, “అయ్యవారిని జేయఁగోతియైన" వడువునఁ దటస్థించిన దోషము. ఇదియోకవి మఱియొక యుద్దేశముతోఁ బ్రయోగింపలేదు. కోతింజేయుటకే సమకట్టినాఁడు. అదియేయైనది. తప్పేమి, యథార్థకథన తాత్పర్యముతోఁ బ్రయుక్తములైన శబ్దములయెడ నట్టిదోషముండదు కావుననే, "శిశ్నోదర పరాయణాః" "శిశ్నోదర పరాయణత్వమునకుఁ బారమెఱుఁగక తిరుగు" (పాండురంగ) ఇత్యాదులు సమాహితములని యెఱుఁగఁదగు - మఱియు నిందుంగూర్చి మా శృంఖలా