పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

51వెంకప్ప సోమయాజులు

వీరు కోనసీమలో అయినపల్లి అనే గ్రామకాపురస్టులు. బులుసు అచ్చయ్యగారనే జగత్ర్పసిద్ధవిద్వాంసుల ప్రథమపుత్రులు. తండ్రిగారి వలెనే వేదశాస్త్ర శ్రాతములలో నఖండప్రజ్ఞకలిగి &S సేతుహిమాచలమున్నూ ప్రసిద్ధిచెందిన పుణ్యపురుషులు. అసలు బులుసువారి వంశము “బలుసులేని తద్దినమున్నూ బులుసులేని యజ్ఞమున్నూలేదు" అనే సామెతకు స్థానమైనది. అందులో నీ సోమయాజులుగారు అగ్రగణ్యులు. వీరి నగ్రగణ్యులందామంటే, తండ్రి అచ్చయ్యగారి నేమనవలెనో, తాత జగన్నాథశాస్రులవారి నేమనవలెనో, కుమాళ్లు పూర్ణయ్య సోమయాజులు గారి నేమనవలెనో తెలియదు. కాcబట్టి మొత్తం ఆ నాలుగుతరాలున్నూ వరుసగా వేద శాస్త్ర పుంజాలుగా ప్రకాశించాయనుకొందాం. ഋeാ అయినప్పటికీ ప్రస్తుతం మనం వ్రాస్తూవున్నది వేంకప్ప సోమయాజులు గారిని గూర్చి కాcబట్టి వీరిని అగ్రగణ్యపదంతో వాడడం అంత తప్ప గాదనుకుందాం. "వ్రతానా ముత్తమవ్రతమ్.” యీ సోమయాజులుగారు ఆపౌండరీకాంత శ్రాతియై అనేకులచే యజ్ఞాలెన్నో చేయించడమే కాకుండా స్వయంగాకూడా చేసి చిరకాలం జీవించిన పుణ్యమూర్తులై వున్నారు. ఆయీదేశంలో వుండే పెద్దపెద్ద శౌతులందఱున్నూ వీరివద్ద దివిటీకింద దీపాలే అని చెప్పకోవడం నేనెఱుగుదును. వీరిచేత చివాట్లు తినని శ్రాతియేలేడని చెప్పకోవడం నేను స్వయంగా విన్నదే. నా బాల్యంలో వీరు సజీవులే కాని వీరి దర్శనభాగ్యం నాకు లభించలేదు. చరిత్రమాత్రం పలువురువల్ల విని ఆనందించడం తటస్థించింది. వీరు తండ్రిగారివలె నప్రతిగ్రహీతలు కారుగాని సుప్రతి గ్రహీతలు. అట్లయ్యను తృణీకృత బ్రహ్మపురందరులు.

తండ్రిగారి నప్రతిగ్రహీతృత్వాన్ని గుణించినగాథలు కొన్నివున్నాయి. అందులో వకటి వుదాహరిస్తాను. వకరోజున వుదయం గుమ్మం అలుకుతూవున్న సమయంలో వీరి తల్లిగారిని తండ్రి అచ్చయ్యగారు “ఈవేళ శాకపాకా లేమిటి” అని ప్రశ్నించేటప్పటికి ఆమె, యేముంది, ఇత్యర్థలు పులుసూ ఇతిభావలు కూరానున్నూ, అని జవాబు చెప్పినట్టున్నూ, దాని మీంద అచ్చయ్యగారు ఆవిడ భావాన్ని గ్రహించి నీకేమాత్రమో ధనాపేక్ష వున్నట్టుగా తోస్తూవుంది అది యెంతవఱకో వకమాటుబయటపెడితే తెచ్చి యీయడానికి ప్రయత్నిస్తా నన్నట్టున్నూ,