పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

మా కడియంలోవుండే గ్రామదేవతకు రంగువేయించవలసిందని రాజావారు ఠాణాదారు తాండ్ర కొండయ్యగారికి ఆజ్ఞాపించారట. కొన్ని మాసాలు జరిగాక రంగుప్రసక్తివచ్చింది. యేకారణంచేతనో రంగువేయించడము జరిగిందికాదు. దానిమీంద రాజావారు ఠాణాదారుగారిమీఁద కారాలూ మిర్యాలూ నూఱుతూ వున్నారంట. ఆకోపం చూచితీరవలసిందే కాని విని వ్రాసే వ్రాతలవల్ల అవగతం కాదని చదువర్లు తెలుసుకోవాలి. అట్టి సమయంలో యెవళ్లు గాని కిక్కురుమనకుండా వుంటే కొంతసేపటికి శ్రీ నృసింహమూర్తి కోపంలాగున దానంతట అదే చల్లారుతుంది. మళ్లా యెప్పుడైనా దగ్గరవుండే విదూషకులద్వారా తమ కోపాన్ని అభినయింపజేసి వారిని విశేషించి సత్కరించడం కూడా వుందని విన్నాను. ఆ కోపాన్ని నిర్భయంగా రాజావారియెదుట అభినయించి బహుమానాన్ని గ్రహించిన రామభౌట్లుగారి పేరిప్పటికిన్నీ ప్రసిద్ధిగా చెపుతారు. చెప్పేదేమంటే : అలా మీర్యాలూ నూరుతో వుండంగా వక నియోగిగృహస్టు ఉద్యోగాది సంబంధ כגeסססs లేశమున్నూలేని కడియం కాపురస్టుడు యేదో ఠాణాదారుగారి తరపున కొంచెం సవరణ మాటలు మాట్లాడడానికి వుపక్రమించేటప్పటికి ఆ ఠాణాదారుగారిమీంద వుండే దూCకుడు యీ సంపన్న గృహస్టుమీదికి వచ్చి వూరిపిడుగు సామెతను జ్ఞప్తికితెచ్చినట్లు చెప్పకుంటారు. ఆయీ కథలలోవుండే కోపపుసంగతులు వగయిరా మన మిప్పటి నాగరికతని మనస్సులో పెట్టుకొని చదువుకుంటే హృదయంగమంగా వుండవు. అధమం వక అర్ధశతాబ్దమైనా వెనక్కి వెళ్లాలి. అంటే యీ సంగతులన్నీ ఆనకట్టకు పూర్వపుగాథలు. ఆనకట్టకట్టబడి రమారమీ నూరేండ్లు కావచ్చింది. అప్పటికింకా "నావిష్ణుః పృథివీపతిః" అనే సూక్తి అమల్లోనేవుంది. అప్పడు రాజాగారు వచ్చేరంటే విష్ణుమూర్తి వచ్చినట్లే గ్రామం యావత్తు తలంచేవారు. రాజుగారివల్ల సమ్మానింపఁబడనే అక్కఱలేదు. అవమానింపఁబడితేకూడా కొంత గౌరవంగానే లోకులు భావించేవారు. యిందులో అతిశయోక్తి లవమున్నూలేదు. రాజుగారితో యేమాత్రం మాటలాడటం తటస్థించినా అదే మహమ్మేరువుగా భావించేవారు. ఆ కారణంచేత ఆ గృహస్టు ప్రసక్తిగాని ప్రసక్తిలో దిగి కొంత అవమానంపొందడం తటస్థించింది. కాని, విశేషమైన అవమానం వరకూ రాలేదు. సామాన్యంతో తేలిందని చెప్పకుంటారు. యింకా, లకుందాసు వేంకటాచలం అనే నాన్బ్రామిను సంస్థానపండితునికి సంబంధించినవిన్నీ, దివాన్ వాద్రేవు చెలమయ్యగారికి సంబంధించినవిన్నీ దిగవల్లి శివరావు దివాన్ గారికి సంబంధించినవిన్నీ మామగారు శ్రీ యినుగంటి ప్రకాశరాయణిం గారికి సంబంధించినవిన్నీ గాథలుచాలావున్నాయి. అవకాశాన్ని పట్టి అప్పడు వ్రాస్తాననిమనవి చేసుకుంటూ ఇప్పటికి దీన్ని ముగిస్తాను.

★ ★ ★