పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

49


అది తగినంత యుక్తియుక్తంగా కనుపడడంలేదు. ఆయన్ని శ్రీరాజావారు అవమానించ కనేపోతే ఆయనమేనల్లుళ్లు శ్రీ రాజావారి విషయంలో కొందఱు రౌడీలతో దౌర్జన్యాన్ని చూపడం యేలావస్తుంది? దాన్ని వస్తాదు వారించడం యేలావస్తుంది? యీవిషయాన్ని పురస్కరించుకొని కమ్మగృహస్టును రాజావారు ఖైదుచేయించడం యేలావస్తుంది? ఆయన ఖైదులో మృతిచెందలేదన్నంతవఱకు సత్యమైతేకావచ్చునుగాని, తక్కినయావత్తున్నూ అసత్యమని నాకు విశ్వాసం లేదు. శాస్రుల్లుగారేనా నాయిడువారేకాని యొక్కువ పెద్ద కారు. వారున్నూ ఆయిరాసంగతులు వినేవుంటారుకాని చూచి వుండరు. వారివినికినిబట్టి వారు సవరణను వుపపాదించివున్నారు. మునిగిపోయిందేముందని నేను నమస్కృతులతో స్వీకరించివున్నాను. శాస్తుల్లుగారి తాతగారిని గూర్చిన సహాధ్యాయిత్వం మొదలైన విషయాలమాటెట్టావున్నా అసలువిషయం అసత్యమని వ్రాయడానికి కారణాంతర మేమేనావుండి వుండునా అని నా కిప్పటికిన్నీ అనుమానమే. ఆ విషయం నేను శతధా సహస్రధా విని వ్రాసిందికాని మటొకమాదిరికాదు. సహాధ్యాయులో మట్టొకరో అన్న విషయం నేనే సంశయిస్తూ వ్రాసివున్నానుకదా? వారి యెడల నాకు ద్వేషభావం వుండి వ్రాసినట్లు శాస్రుల్లుగారున్నూ వ్రాయలేదు. మొత్తం మన మేలా అనుకోవాలంటే : ఆయాచరిత్రలు పలువురనోళ్లలోC బడి పలువిధాలుగా మారిపోతూవుంటా యనుకోక తప్పదు. వాల్మీకి సీతాదేవి లంకలో నిరాహారిణిగా వుందని వ్రాశాడు. దేవీభాగవతంలో ఇంద్రుండు పంపిస్తూవున్న కామధేనువుపాలు ప్రాణధారణానికి తగ్గన్ని పుచ్చుకుంటూ వుండేదని వ్రాసివుంది. రామదాసు బొందితో వైకుంఠానికి వెళ్లేండనిన్నీ వెళ్లేటప్పుడు - "తరలిపోతాము చాలదయలుంచండీ –యింక- మరలీజన్మాలకురామూ మదిలో నుంచండీ" అని గానంచేస్తూ మఱిన్నీ విమానాన్ని అధిష్టించాcడని భక్తులు గానం చేస్తూవున్నారు. చరిత్రకారులో? రామదాసుగారిని వురి కాంబోలును తీసినట్లు చెపుతారు. కాcబట్టి వీట్ల సత్యాసత్య నిర్ణయం చాలాకష్టం. శాస్రుల్లువారేనా బాగా కనుక్కొని సవరణను వుపపాదిస్తే అది యొక్కువ వుపకారం అవుతుందని మటీమణీ మనవిచేస్తున్నాను. శిఖావిషయాలు అసలే “సున్నకిసున్నా హళ్లకి హళ్లీ అంటే లోకం బొత్తిగా విశ్వసించటం లేదు కనక యింతగా మనవిచేసుకోవడం. యిటీవల యీ సంగతిని కొందటితో సంప్రతించి నేనింతగా మనవిచేసుకుంటూ వున్నానుగాని వాద తాత్పర్యంతో కాదు. యిప్పటి నా వోపికనుబట్టి, వొప్పలైన ప్రయోగాలను యెవరేనా తప్పలంటే నే ఔదాసీన్యం వహించే స్థితిలో వున్నాను. అట్టి సందర్భంలో యెవరివల్లనో విని వ్రాసే వ్రాంతల్లో యెవరో కాదంటే వాదం పెట్టుకుంటానా? పెట్టుకొనేది లేదు. మావూల్లోనే జరిగిన యింకొక శ్రీవారి చర్యను కొంచెం వుటంకించి యీ వ్యాసాన్ని ముగిస్తాను.