పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

449


వున్నవారి మాటలు వెగటుగా వుంటాయనుకొంటాను. యింతకూ స్వామివారి తాత్పర్యం. అశ్లీలమంటే తి. వెం. కవులకు తెలియదు సరికదాఁ యే యే అక్షరానికీ అక్షరానికీ ప్రాసమైత్రి వున్నదో అదికూడా తెలియదు అని ధ్రువపరచడమే అనుకుంటాను. ఆపద్ధతిని తి. వెం. కవులకు తెలిసిందేమిటో? తెలకపిండి. అందుకే విద్యార్థిని గూర్చి వుపయోగపఱచే మాటలుపయోగపఱచారు స్వామి.

(1) ఇదొక్క విషయమేకాదు మీరు గ్రహింపనిది యింకను చాల విషయము లున్నవి.

(2) పురీషం ... ... ... ఇదియు మీరు గ్రహింపజాలక పోతిరి. (ఇయ్యెడ స్వామివారి హృదయం బొత్తిగా నీచమున కొడిగట్టినట్లు నాకుఁ దోఁచెడిని. నిజం వారే తెలుపవలెను.)

(3) మీకుచ్చ స్ఫురించు నంటిరి (ఇటఁ గూడ స్వామి కేదో హృదయకాలుష్యం ధ్వనితం.)

(4) మీరు సరిగా గ్రహింపcజాలని దింకొకటి.

(5) మఱొక విషయము మీకు తెలియనిది.

(6) అంతులేని తప్పులువచ్చు మీరు!

(7) మీరీవిషయములో నోరెత్తుట కేమాత్రమును అర్హులుకారు. (యీ మాట స్వామివారి గ్రంథం తప్పులతడక యన్నందు కిచ్చేజబాబు.)

(8) కావున మీయోజన పూర్తిగా దుష్టము నాయోచించుట మిక్కిలి యుక్తము.

యింకను యిట్టి ప్రల్లదములు పెక్కులు. ఒరులు దురుసుగా వ్రాసిరని చూపువారు కొంత వెనుకతగ్గి వ్రాయవలసింది. అట్టి తెల్విస్వామికి పెరుమాళ్లనుగ్రహించలేదు. పాపంఁ ఆచార్లవారికి మిక్కిలి కోపం వచ్చింది. కాఁబట్టి విద్యార్థికి బోధించినట్టు శిక్షించి బోధించారు. "పురీష" పదఘటితమైన వాక్యంలో ప్రతివాదికి తత్స్వీకరణాన్ని స్ఫురింపచేశారు. శ్రీమంతులవారితో వాదంపెట్టుకోవడం కంటె శ్రీమంతులవారు చెప్పినట్లే చేయుట యుక్తమేమో? అంటారేమో? చదువరులు. నాఅంతటనేను నాజన్మమధ్యమందు వీరితోనేకాదు, వాదం యెవ్వరితోనూ పెట్టుకోలేదు. పెట్టుకోను. అవతలివాళ్లునన్ను కదిపితే చేతనైనంతలో ఆత్మసంరక్షణార్ధం పెనుగులాడతాను. జయాపజయాలు దైవాధీనాలన్నది నాకోసమే పుట్టలేదు, ఆచార్లుగారు మిమ్మేమేనా ముందు కదిపినారా అంటారా? కదిపినట్టు యిదివఱకే ఋజువు చేశానుగదా! ఆకదిపినదేనా పెద్ద గొప్పతప్పిదంచూపి కాదుసుమండి?