పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/444

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

448

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చేసియుండరు యేం కర్మం కాలింది. చక్కఁగా గురుముఖతః చదువుకొని ప్యాసై, యేదో పదవి సంపాదించుకొని సుఖ జీవనం చేస్తూవున్న మీకు యెప్పుడో “మిడిసి రాలి పడ్డప్పటికీ" 'వృద్ధనారి' అన్నట్లు వకరికంట మేము పడేదిలేదు! మాకంట వకరున్నూ పడవద్దన్నట్టు కాలక్షేపం చేస్తూవున్న తిరుపతి వేంకటేశ్వర కవులను వెక్కిరించడానికి యేదో ప్రబలకారణం వుండితీరాలి! అది మీ ముఖతహ నేవినాలి. దయచేసి తెల్పుదురుగాక. ఆత్మవంచన లేకుండా మాత్రం ప్రవర్తించండి యిఁకనేనా! “యోజించి తప్పు” “యోచించి వొప్పు" అన్న మీ వ్రాఁత అబ్బో.! చాలా ఉత్పథంగా నడిచేటట్టువుంది. నడిపిస్తురుగాని, వంట్లో బలం తగ్గింది గాని యింకా కొంచెం బుద్ధిబలం భగవంతుఁడు నిల్పేవున్నాఁడు. మీవాదాన్ని తట్టుకోవటానికి యీకాస్తా చాలకపోదు. అది లోక వ్యవహారసిద్ధమే మండీ? అట్లాగే వాదిస్తురుగాని సభలో "జ్ఞానలవదుర్విదగ్ధేత్యాదులు" పెద్దతిట్లుగా మీకుతోcచాయేమండి స్వామీ? అస్మదాదుల మందఱమూ దానిలోనే చేరతాముగదా? మీరింకా వయస్సులో మాకన్న చిన్నలవడంచేత అస్మదాద్యపేక్షయా అనుభవము తక్కువగా వుండడాని కంగీకరింపనివా రుంటారా? ఆ పక్షాన్ని ఆమాట వాడగూడదా? తి. వెం. కవులు

“చీమలో, దోమలో నాఁగఁ తోఁచిరి. ” కదా మీ బుద్ధికి, యెవరో కొందఱచే గౌరవింపఁబడిన వాళ్లు మీకట్లు తోఁచినప్పడు “కారుణ్యా"ది ప్రసంగం మీ విషయమున తగనిదెట్లగును? గుణమేమిన్నీ లేనేలేదండి మా కవిత్వంలోను? యీమాట మీరే విద్యార్థులకు గురుత్వం చేస్తూవున్నారో, జిజ్ఞాసాతాత్పర్యంతో వారే అడిగితే గతేమి? మీ రేకాలేజీలో వున్నారో? తపిసీలుగా తెలియక సందిగ్ధంగా వుండి "ఫలానా" అని స్థిరపరచి వ్రాయలేదు, క్షమించండి. నేను మీ గ్రంథమంతా తపిసీలుగా చూడలేదు. యీ “బొక్క" ఘట్టమున్నూ “త్య, క్ష" వర్ణాలకు ప్రాసాన్ని గూర్చిన ఘట్టమున్నూ మాత్రమే చూచి మీరు అమాయకులని మాత్రం అనుకున్నాను. యెందుచేత? మొదటిదానికి భారతాదులలో సంధివశాన్ని వచ్చిన యీలాటివి లెక్కకుమించి వుండడం చేతనున్ను రెండవ దానికి యిదికూడాతప్పే అనుకోవడంగాని, లేక యింతమాత్రం ప్రమాదంకూడా లేకుండా కవిత్వం చెప్పేవాళ్లంటూ వుంటారను కోవడంగాని సహృదయు లనిపించుకొనేవారి విషయం కాదుకనుకనున్నూ యీయనెవరో గ్రంథాలు చదివి ప్యాసైతే అయివుండునుగాని, హృదయ నైర్మల్యం లేశమున్నూ లేనివారై వుండడం తప్పదనుకొన్నాను. అందుచేతనే సహృదయుల మందలింపున కాశపడింది నేను. ఆమందలింపును గూడా మీ హృదయం సమ్మతించింది కాదు. ఓహో! మీతాత్పర్యం నాకంటె ప్రపంచములో సహృదయుఁడంటూ వుంటాఁడా అని కాంబోలునుం అవును “అహమేవ పండితః, అహంచ పండితః, అహం న పండితః" అనే అవస్థాత్రయంలో మొదటి అవస్థలో వున్నారుగదా స్వామివారు. మూఁడో అవస్థలో