పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/442

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

446

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుచ్చరించాలా? వుచ్చరింప నక్కఱేలేదు. “లేఁడిపై దూఁకు సింగమ్ముజాడ అన్న పద్యంకూడా తమరు చదివేవుంటారు. “కొంగల మల్లాయగట్టు” అంటూ నైజాందేశ ప్రయాణంలో తగులుతుందఁట? కొంగల మల్లాయ వృద్దుఁడైన పిమ్మట ఆగట్టుశిఖరం అధిష్ఠించి కూర్చుండి, “లేస్తే మనిషినిగాను” అనేవాఁడఁట! యిప్పుడు నేనున్నూ అట్టిమూడుకాళ్ల ముసలిగానే వున్నాను. కాఁబట్టి, మీరు రప్పించేచోటుకు రాలేక యింతగా ప్రార్ధించడం. యిదేమిన్నీ నాసిద్ధాంతాలని ఆమోదించడం కాదు కనక మీరు నిరాకరిస్తారని అనుకోను. మీపుస్తకం నేను యెవరోవిద్యార్థిదగ్గఱ యేకొంచెమో చూచాను. వెంటనే ఆవిద్యార్థి తత్సమేతంగా వెళ్లిపోయాఁడు, మీక్కోపంవస్తే యేంచేతును? “తప్పులతడక” గానేతోఁచింది. ఆకాస్తసేపట్లో “బొక్క"గా ఛేదించి చూపిన దోషమున్నూ “త్య, క్ష" అనే అక్షరాలకుపడ్డ ప్రాసవిషయమై ఆక్షేపించినదిన్నీ నాకంటఁబడ్డాయి. ఇంకా మీలెక్క ప్రకారమైతే యెనిమిదుండాలి అవి చూచిన జ్ఞాపకం లేదు. తరువాత చాలారోజులు, యీ ప్రసక్తి పెట్టుకోనేలేదు. అంతట్లో యితర శిరోమణులవల్ల ప్రసక్తికల్గింది. పనిలోపనిగదా అని “కారుణ్యం" వుపక్రమించాను. దోషాలతోపాటుగా యేస్వల్పం గానో, గుణాలక్కూడా మీరు మా గ్రంథాల్లోనుంచి వుదాహరించివుంటే మాత్రం మిమ్మునుగూర్చి నేనువాడిన "జ్ఞానలవదుర్విదగ్ధ" పదము వ్యర్థమై నేను తొందర పడ్డట్టు లోకులకు సాక్ష్యమిస్తుంది. లేనిపక్షాన్ని సార్థకమై “దేవుఁడికి సదృశమైన పత్తిరి" అనే లోకోక్తిగా వుండి క్షేమేంద్రాదులు చూపిన ఔచిత్యాన్ననుసరిస్తుందనుకుంటాను. యీమాట బాగుంటేనే స్వీకరించండి. గుణాలకు మీరు మా గ్రంథాన్ని చూడనే లేదన్నందుకు మీ యీ వాక్యం సాక్ష్యమిస్తూవుంది, చిత్తగించండి.

“రంధ్రాన్వేషణపరుఁడ నంటిరి, ... మీ గ్రంథములు మూఁడునాల్గు పరామృష్టము లైనవి, సుమారు పదివఱకు నిందు దోషోదాహరణములుగా మీ పద్యము లుదాహరింపఁ బడినవి.”

చాలును, మీతల్లికడుపుచల్లఁగా నూరేళ్లు వర్ధిల్లాలి. "అభణపు", "ఢిల్లికిఢిల్లే" లోకోక్తీ యెత్తుకొని యెంతవుపకారంచేశారో, యీ వాక్యం వ్రాసికూడా అంతవుపకారం చేశారు మీరు. అందుకోసమే మీకంటె ముందుగానే నేను సభాముఖమందు మీ దర్శనాన్ని కోరాలనుకుంటూ వున్నాను. యింతలో దైవం ఆకాస్తమాటా మీచేతే పలికించాcడు. “నీదయా నీదయా నిద్రయా” అను లోకోక్తి తామెఱుఁగనిది కాదు. “ద్వారాణి భవంతి సర్వత్ర" కదా! మీ వుద్దేశ మెట్టిదో తెలియడమే నాకు కావలసింది. వేలకొలఁది పద్యాలు వ్రాసిన వాళ్లకి యెక్కడో సంధివశాన్ని “బొక్కా" రాక, యతీపోక, ప్రాసా చెడక వుంటుందని