పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/441

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

445బ్రతికించారు ఆచార్యులుగారు

యెందుచేతంటే? సూక్ష్మంలో మోక్లోపాయం చూపించారు వారి పుణ్యమా అని. మొట్టమొదట అనుకున్నానుగదా? అమ్మయ్యో? యేమాత్రమో తక్కువగా పద్ధాలుగుకాలాలు సంపూర్తిచేశారే! యీవార్ధక్యంలో యీ అనారోగ్యంలో "తీరికూర్చున్న మంగలి" లాగు యీ పనికిమాలినపని యెక్కడ పెట్టుకొందునురా అనిభయపడ్డాను. ఉభయ వేదాంత ప్రవర్తకులు యేవో తారతమ్యజ్ఞాన బోధకపు వాక్యాలు వ్రాసివ్రాసి "కసిదీరనమ్మ" అనే సామెతను జ్ఞప్తికిఁ దెస్తూ శాస్త్ర జ్ఞానం అంతా యింతా మాత్రమేకాక సంపూర్ణంగాకల శిరోమణులవడంవల్ల, ఆ తరవాతవచ్చే అతివ్యాప్త్యవ్యాప్తులను సవరించుకోవడానికి వేసికొనే "మాత్ర" పదాన్ని యిప్పుడేలక్షణంలో తగులుకోఁబెట్టి "వయోమాత్రవృద్దులగు మీరు" అంటూ వకఱంకెవేసి, “మావిషయంలో యికముందేనా జాగ్రత్తగా సంచరించండి. లేకపోతే తగినట్లు బుద్ధిచెపుతాం” అనే అర్థమిచ్చే మాటలు కొన్ని వ్రాసి, వ్యాసాన్ని ముగించారు. వయోమాత్ర వృద్ధత్వాన్ని వారు స్వయంగా వప్పుకుంటూ వుండడంచేత వారు “సభకు రావలసిం”దని నన్ను కోరడాన్ని నేను పాటించలేకపోయినా యీమిష నా అసమర్ధత్వాన్ని సమర్ధిస్తుందను కుంటాను. యిప్పటికి వారేదేశంలో, యేజిల్లాలో వుండేవారో నాకు తపిసీలుగా తెలియదు. యేమైనా నేను వెళ్లే వోపికలోవున్నాను గనుకనా “మీవూ రెక్కడ” అని వ్రాసికనుక్కోవడానికి. వకటిమాత్రం యిప్పటి నాస్థితికి తగుతుందనుకుంటాను. వకపర్యాయం తమరే తమకు నచ్చినపండితకవిని (కేవల పండితుణ్ణిగాని, కేవల కవిమాత్రుణ్ణిగాని కాదుసుఁడీ) వెంటఁబెట్టుకొని మాగ్రామం కడియానికే దయచేస్తే మీవాదంలో విశృంఖలంగా నన్ను గూర్చి దూషించిన మాటలకేం గాని సంప్రదాయం తెలియక వొప్పులను తప్పు లనడం యెట్టిదో, తప్పులను వొప్పులనడం యెట్టిదో, యెంతోసేపక్కఱలేదు, కొద్దిసేపట్లోనే తేలుస్తాను. మీరేనా పత్రికలో రాయడం కనక యేదో కొంత పెంచివ్రాయఁగలిగారు గాని, ప్రత్యక్షంలో జరిగే ముఖాముఖీవాదంలో ఆలా పెంచలే రనుకుంటాను. నేను అనారోగ్యంగా వుండి మీ రున్నచోటికి రాలేక, నేనున్నచోటికే రమ్మనడంవల్ల మీకయ్యే రైలు ఖర్చులున్నూ, యిక్కడవున్న కాలంలో 'తళిహ!' ఖర్చు కరామతులున్నూ నేనే భరించుకుంటాను. “అవస్థా పూజ్యతే" అన్న సందర్భం తమ రెఱుంగనిది కాదు కాఁబట్టి యీ నావిజ్ఞప్తిని తోసిపుచ్చరనుకుంటాను. మునుపటిరోజులే అయితే తాము సభ అంటూ