పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయి బోల్తాపడుట

441


“ఈమూఁగురు జామాతల
 కామూఁగురు నొకరు పుత్రు లాహవ ధీరుల్."

ఈ విరోధమును మాత్రము నేను దెల్పితినే కాని దిద్దుబాటు తెలుపనే లేదు. దానిపై ప్రచురణకార్యకర్త యగు కాటూరి వేంకటేశ్వరరావట్లు సవరించెను. నే నాసవరణ నిందనుక చూడనేలేదు. సుబ్బరాయ శాస్త్రులవారు దయచేసి నిన్నమొన్న విమర్శించి వెక్కిరించునప్పటి కిది వెలువడి వత్సరముకావచ్చినను వారిది చూడకుండుట మా దురదృష్టమనుకొనుటకన్న నన్యమేమున్నది? ఈయన పాండిత్యములలోఁ జేరినది కాదు. ఇప్పుడు క్రొత్తగా బయలు దేరిన ఫక్కిని నూటికి ముప్పదియైదు మార్కులు సంపాదించి డిగ్రీని పొందినది. అందుచే విమర్శనజ్ఞానము కడుంగడుమెండు. అందుచేతనే తామేపొత్తమును విమర్శింపఁబూనినారో, ఆ పొత్తమెన్ని ముద్రణములైనదోకూడ పరిశీలింపకుండుట యని చదువరు లరయుదురుగాక. ఇంత సుళువుగా సవరింపఁదగిన విషయమును దమబుద్ధికి సవరణ కాని యంతమాత్రమున- “తనకల్మి యింద్రభోగము"నుగా నిశ్చయించుకొని శ్రీ శాస్త్రులవారు- “అనుపద్యమును దిద్దు టెట్లు? శాస్త్రులుగారే దానిని సవరింప వలయును." అని వ్రాయసాహసించినారు. ఈవ్రాఁత కర్థమేమో చదువరు లెఱుఁగకుందురా? గ్రంథకర్త శుద్ధ పత్రికలో సవరించుకొమ్మని సూచించెను. నిశ్చయమే. ఆ సూచన ప్రకారము సవరణచేయుట కిది చదువరులకే కాదు. గ్రంథకర్తకుఁగూడ వీలగునది కాదనియే కదా! కవిత యన నెట్టిదో యెఱిఁగిన వేంకటేశ్వరరావున కెట్లు సవరణయయ్యెనో! విమర్శకునకట్లే కాలే దనుకోవలయును కాఁబోలును. ఈ పొత్తము నేను పరేచ్ఛా ప్రారబ్దవశమున వ్రాయ మొదలిడితినేకాని స్వేచ్ఛచేఁ గాదని గ్రంథకర్త తెల్పినట్లును, శుద్ధపత్రికలో సవరణను సూచించినట్లును విమర్శకుఁ డంగీకరించికూడా దీని కింత గ్రంథము పెంచుట కర్థమేలేదు. పైఁగా ఈయన లోకముతోపాటు గ్రంథమును విమర్శింపక వ్యక్తిపరముగా వాడినసామెత యెంత - “కుర్వీత బుధ సోమయోః" అన్నట్లున్నదో చదువరులు తిలకింపుcడు.

“అని చెప్పుటచే నీ పాత్రలో వేంకటశాస్త్రిగారు ప్రతిఫలింపc జూచినారని చెప్పవలయును. కాcబట్టి శుచిముఖిపాత్ర అసందర్భస్థితిలో నున్నదని చెప్పవలసి వచ్చినది. వెక్కిరింపఁబోయి బోల్తాపడినట్లు, ప్రతిఫలింపఁబోయి బ్రత్యక్షవిరోధమును పరిశీలింపలేదు."

ప్రతిఫలింపఁబోయిన దెవరు? వేంకటశాస్త్రిగారు, ప్రత్యక్షవిరోధమును పరిశీలింపని దెవరు? ఆయనయేకదా! వేంకటశాస్త్రిగారు చేసిన యపరాధము శుచిముఖిపాత్రలో ప్రతిఫలింపఁబోవుటయేకదా? అగుచోనది వెక్కిరింపఁబోవుటవంటిదేయగునా? కానిచో