424
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
విష్ణుభక్తులలో విశేషించి యైశ్వర్యవంతులు లేకపోలేదుగాని శివభక్తులలో మిక్కిలి మనకుఁ గన్పట్టుదురు. ఇందుల కుదాహరణము నైజాములోని పలువురు శైవులగు కోమట్లు. దక్షిణదేశమునందలి నాఁటకోట్లను అని యెఱుఁగఁదగును. దీనిమీఁదఁ బూర్వపక్షము లేకపోలేదు. కాని మన శాస్త్రములను నమ్మువారినిగూర్చియే యీ నాలిఖించుట. తక్కినవారు నాకు దేవీప్రత్యక్షవిషయమయి యడుగువారిలోఁ జేరరుగదా? మనవారు యజ్ఞములవలన వర్షములు గుఱియునని వేదమున నుండుటను విశ్వసింతురు. అగుచో యూరపుఖండమున, అమంత్రగోమేధములు తప్ప సమంత్రకములు లేశమును. లేవుగదా, అచ్చట వర్షము లేల గుఱియుచున్నవి యనుటకు సమాధానము దుర్లభము. ఇతరులు విశ్వసింపకున్నను, పైశంకకుఁగూడ మనవారు మనకు సమాధానము చెప్పఁగలరు. మే మొకఖండము నుద్దేశించి యజ్ఞము చేయలేదు. కనుక మాయజ్ఞములే ఆయాఖండములకుఁ గూడ వర్షమును కల్గించుచున్నవని రహస్యములో సంతసించుచుందురు. ఏకదేశమాత్రమున నెగ్గఁదగు జవాబుగల విషయములందుఁ జిన్ననాఁట నుండి నాకు విశ్వాసము ඒක. ఏ విషయము మనకుఁ దెలియునని యొప్పుకొందుమో, అందొకనికి జంకనియంత శక్తియేని యుండవలెను, ఏమిడిమిడి జ్ఞానమో పనికిరాదుఅని నేను దలఁతును. ఈయంశముకూడ నేనిప్పటికి నలువది యేండ్లనాఁడు వ్రాసిన కామేశ్వరీశతకములో వాక్రుచ్చియున్నాఁడను.
మ. పరగేహమ్మున భుక్తి యన్యసతితో భాషించు బల్‌రక్తి య
క్కఱకున్ గానిప్రసక్తి, వేఱొకనికిన్ గంపించుధీశక్తి, నీ
చరణమ్ముల్ గనలేనిభక్తియును నిస్సారమ్ము లీయైదిటిన్
మఱుఁగన్నీకుము మన్మనం బిదియె నిన్ బ్రార్థింతుఁ గామేశ్వరీ.
ఈ పద్యరచనకు ముఖ్యకారణము మొదటియంశమే కాని తక్కినవి కావు. తక్కినవి ప్రసక్తానుప్రసక్తములు. అంత్యప్రాసమును బురస్కరించుకొని చేరినవి. అయినను - "ప్రాసకోసమన్నానే కూసుముండా" వంటివి మాత్రముకావు. సార్థకమైనవియే మొదటిదానికిఁగల ప్రసక్తియెట్టిదో తెల్పుట అంతయప్రస్తుతము కాదనుకొందును. నేను మందసా సంస్థానమునకు వెళ్లినప్పుడు వెళ్లిననాఁడు మొదలుకొనియే నాకు గ్రహణీరోగ మారంభమై మిగులబాధించినది. సంస్థానపు దివాన్‌గారు నన్ను మిక్కిలిగా నాదరించి భోజనాది సదుపాయములు వారియింటనే జరిగించినారు. ఆయన శ్రీవిజయనగర సంస్థానమునుండి అయ్యెడ కుద్యోగమునకు వెళ్లినవారు. శ్రీమదానందగజపతి మహారాజులుంగారి తండ్రిగారిరోజులలో శ్రీవారి ప్రయత్నము మీఁద విజయనగరము కేవలము ననేకసందర్భములలోఁ గాశీక్షేత్రముగా మార్చఁబడినది. ఆమార్పువలనఁ