అపవాదలు
423
ఇంతవఱకు నేమాత్రమును లాభము కలుగలేదనియు ఈమధ్యమాత్రము స్వప్నములో దర్శనమిచ్చి మీవిగ్రహమును జూపి: “నీకు వీరివలనఁ గృతార్థత కల్గును" అని చెప్పినదనియుఁ జెప్పి నన్నుఁబీడింపఁ జొచ్చెను. నాకేమియుc దెలియదని యాయనకెంత చెప్పినను నామాటలు చెవికెక్కలేదు. తుదకాయనకు దేవీభాగవతములోని కుమార్యర్చనా విధానమునుజెప్పి దీనివలన నీవు కృతార్థుఁడవగుదువని గంభీరముగ దీవించి పంపితిని. పిదప నేమిజరిగినదో కాని ఆయన మరల నాయొద్దకింతవఱకు రాలేదు. ఆయన గ్రామము మా గ్రామమునకు నాతి దూరమున నున్న రామచంద్రపురమునకు సమీపము నందలిదని జ్ఞాపకము. నా జీవితములో నన్నిట్లు పీడించి మోమోటపెట్టిన వారు పలువురుగలరు. వారిలో నేను పలువుర పేళ్లుగూడ నెఱుఁగుదును. వారిప్పుడు కవులై అక్కడక్కడ నెట్టెట్లో అవధానములుకూడఁ జేసి కొంత గౌరవమును సంపాదించుకొని యున్నవారగుటచే వారిపేళ్లిందుదాహరించుట యుక్తముకాదని మిన్నకుంటిని. ఏదోపూర్వజన్మమున నంతో యింతో దేవీపూజ చేసితిమేమో? లేనిచో ఈ నాలుగక్షరములును చిన్నమాట నప్రయత్నముగ రావేమో? మీవంటి వారిలోఁ బలువురాదరింపరేమో? అని మేమును అప్పుడప్పుడు మాలో ననుకొనుచుండువారము. ఇట్లనుమాన ప్రమాణము తప్పమాకుఁ బ్రత్యక్షప్రమాణము లేశమునులేదని లోకులకు మనవిచేయుచున్నాను. ఈయంశము మాపొత్తములలోc జాలచోట్ల నుపలబ్ధమగును. అయినను దిజ్మాత్ర మదాహరింతును
శా. ఈజన్మమ్మునఁ గొంచెమేయనుము మున్నేజన్మమందేని నీ
పూజన్ బూర్తిగఁజేసె వీcడదికతమ్ముంజేసియే లోకముల్ పూజించెన్!
(ఆరోగ్యకామేశ్వరి)
ఇంతయెందులకు - మన పెద్దలిట్లువ్రాసిరి.
శ్లో. యద్ద్వారేమత్త మాతంగా 1 వాయువేగాస్తురంగమాః
పూర్ణేందువదనా నార్య | శివపూజావిధేఃఫలమ్”
దీని ననుసరించియే యీమధ్య మొన్న మొన్న వ్రాసినమృత్యుంజయస్తవములో నేనీపద్యమును వ్రాసితిని... -
శా. ద్వారంబేరిది మత్తదంతి తురగస్థానంబో? యెవ్వారి సం
సారం బాత్మజ సత్కళత్ర సకలైశ్వర్యాన్వితంబో? భవ
చ్ఛ్రీరమ్యాంఫ్రిుసరోజ భక్తులని వారిన్నిర్ణయింపంజనున్
వేఱెచ్చో ఘటియించు నిట్టి మహిమల్ విశ్వేశ! మృత్యుంజయా!