పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/416

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

420

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యున్నాము. అది గోదావరీమండలము. మండపేటకు సంబంధించినది. ఈ భ్రాంతి వడినవారు ఆపాదుకాంతదీక్షాపరులు బ్రII శ్రీ|| ఆదిభట్ల రామమూర్తిశాస్త్రులవారు, “ఆపాదుకాంత" పదమువల్ల జ్ఞప్తికివచ్చినది. నన్నేమో, ఇట్టి మహానుభావులందఱును మంత్రశాస్త్రవేత్తనుగా. - అంతమాత్రమేకాదు, మంత్రసిద్ధిని పొందినవానినిగాc దలఁచుచున్నారు కదా? నా ప్రజ్ఞ యెంతయో? ఈ విషయమున నీక్రిందిసంగతివలన విజ్ఞులరయుదురు గాక! నేను ఇప్పటికి 5, 6 సంవత్సరములకు పూర్వము వఱకును “ఆపాదుకాంతదీక్ష" అనఁగా పావుకోళ్లు తొడిగికొని సర్వదా నడచునంత గొప్పదనముగల మంత్రశాస్త్రజ్ఞులకు సంబంధించినదని యనుకొనుచుండు వాcడను. సంప్రదాయార్థ మెటులున్నను, సామాన్యముగా, ఆపదమునకు తోఁచు నర్ధముకూడ నిదియే. ఇటీవల నా కాపదమునకుఁగల యథార్థ మొక విజ్ఞుఁడు చెప్పఁగాఁ దెలిసినది. ఆ విజ్ఞుని పేరిపుడు జ్ఞాపకము లేదు. ఆయన మా తిరుపతిశాస్త్రి గారికి మంత్రశాస్త్రగురువు. మీరు మంత్రశాస్త్రవాసనయేలేదని చెప్పుచున్నారే? స్వవచో వ్యాఘాతముగా మరల తి. శా. గారికి మంత్రశాస్త్ర గురువున్నట్లు వ్రాయుచుంట కర్థ మేమందురా తి. శా. గారు అవసానకాలమునకు నాలుగేండ్లకు ముందు మంత్రశాస్త్రమున మిక్కిలిగాఁ బరిశ్రమ చేసిరి. అందువలన నతనికి గురువేర్పడియెను. ఆయన అన్నవరములో నొకపరి కన్పట్టి నన్నుఁగూడ నుపదేశము పొందవలసినదని ప్రస్తావించెను. నేను తపశ్శక్తిలోపమువలన నిరాకరించితిని. దీనితత్త్వమిది. ప్రస్తావనలో ఈ తిరుపతిశాస్త్రిగారి గురువువలన— "ఆపాదుకాంతదీక్ష" అనఁగా నేమొ తెలిసికొంటిని. తేలినసారము : మా యిరువురకుఁగూడ గద్వాలాదులు వెళ్లునప్పటికి మంత్రశాస్త్ర ప్రవేశము సుంతయులేదనియు తి|| శాII గారికి మాత్రము అవసానకాలమున కించుకపూర్వము తచ్ఛాస్త్ర ప్రవిష్టతకల్గినది కాని నాకిప్పటికిని లేనేలేదనియు తేలినది. కాళీసహస్రములో “అమంత్రోపాసకౌసంతౌ" అని వ్రాసితిని. ఇట్లు కంరోక్తిగా నచ్చటచ్చట నేను వ్రాసినను లోకము దీనియెడల నిశ్చయము లేకయేయున్నది. ఉపదేశమునకై వచ్చి యాశ్రయించు పలువురతోనే నీవిషయమును చెప్పచునేయున్నాను, వారుమాత్రము విశ్వసించినట్లులేదు. ఇట్లు చెప్పుట మానలేదు. నాకుఁ దెలిసినదెంతో అంతే యొప్పుకొనుట సమ్మతము. కాని చాలమంది తెలియని విషయము తెలిసినట్లితరులకు నెక్కింపవలయునని మిక్కిలిగాఁ బ్రయత్నింతురు. కొందఱు కావ్యసాహిత్యముమాత్రమే సంపాదించుకొని కవిత్వరచన చేయుచుఁ బేరు ప్రతిష్ఠలు సంపాదించికూడ, అన్నా! మనకు శాస్త్రప్రవేశము లేదను నపవాదము తొలఁగు టెట్లని దానికై బ్రహ్మాండమైన ప్రయత్నము చేయుచుందురు. అంత మాత్రమున ప్రాజ్ఞలోకము వారిని శాస్త్రజ్ఞులనుగాఁ గైకొనదు. కైకొనకున్నను వారు ప్రయత్నము మానరు. లేనిప్రజ్ఞను, ఉన్నట్లు మేమును నొప్పికొంటిమే యనుకొందము. పనివడినప్పుడు ఆ ప్రజ్ఞను చూపఁగలమా? లేము. మేము గురుసన్నిధి