పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అపవాదలు

419

ఇట్లు శ్రీరాజావారు మందలించినమీఁద వారాయుద్యమమునుండి విరమించిరి, కాని మాకు మాత్రము కలిగిన అపవాదను రాజుగారుకూడ విశ్వసించినట్లేకదా, ఒకపరి గద్వాలలోఁగూడ నిట్టిదే జరిగినది. దానిఁగూడ నుదాహరించుట అప్రస్తుతము కాదు. మా శతావధానము జరిగిన మఱుచటి వత్సర మొకకవివర్యుఁడవధానమునకుఁ బూనుకొనెను. ఈయన శాస్త్రవేత్త, కవి. అవధానమెన్నఁడును జేసినవాఁడుగాఁడు సరికదా చూచిన వాఁడుగూడఁగాఁడని నేను అప్పటికి గతమైన వత్సరమే గ్రహించితిని. ఎట్లనగా ఈయన శతావధానము, గంటలేక రెండుగంటల కాలములోc జేయవచ్చునని నాతో నిష్కర్షగా నుడివెను. ఈమాట విన్నది మొదలు ఈయన వట్టి యమాయకుఁ డనియు, కవిత్వముచెప్పిన జెప్పవచ్చునేమో కాని అవధానము మాత్రము చేయనేరఁడనియు గ్రహించితిని. తుదకట్లే జరిగినది. ఎంతో మందికిఁగాదు. 25గురు మాత్రమే పృచ్ఛకులు. శ్రీ గద్వాలరాజావారికి మా అవధానము చూడని పూర్వము అవధానమనినచో నిష్టమేలేదు. చూచినపిమ్మట వేఱొకరిది చేయఁగలరని నమ్మకము లేదు. అందుచేత 25 గురినిమాత్రమే యేర్పఱచినారు. శ్రీ రాజావారి హృదయమునఁగూడ మాకు దేవి ప్రత్యక్షమనియే దృఢనిశ్చయము, ఈకవి 25 గురకే పూర్తిచేయలేక తప్పినతోడనే మేము ప్రస్తావవశమున

“శతావధానకవితా సామ్రాజ్యపట్టాభిషేకముఁ బొందంగను మాకు, దక్కఁగలదే గద్వాలభూపాలకా!"

(నానారాజసందర్శనము చూ.)

అను పద్యమును జదివితిమి. ఈ మాట శ్రీ రాజావారి వుద్దేశమును మఱింత బలపఱచి యుండనోపు. అది యటులుండె, గంటకో లేక రెండు గంటలకో, శతావధానము చేయఁగలమన్న వారింగూర్చి వ్రాసినమాలిక

“బళి బళి యెంత వింతయో"

అన్నది నానారాజసందర్శనములో నచ్చయి యున్నది. అది యీ కవిని గూర్చినదియే, సందర్శనములోని పద్యములలో ననేకముల కిట్టి యుపోద్ఘాతము వ్రాయవలసినది కలదు. అది తద్‌జ్ఞులవలన నెఱుఁగుదురని యందందుదాహరింప మైతిమి. ఉదాహరించినచో నెంత పెరుఁగునో చెప్పఁజాలము. ఇది యిటులుండె, మఱి యెనిమిదేండ్లకు కర్నూలు ప్రాంతమున నుండి యేలూరికి నేత్రావధానమున కనివచ్చిన వేదవేత్తలవలన, ఆగద్వాలలో నాఁటియవధానమున, ఆకవి తప్పినది మాప్రయోగతంత్రమువలననే, అని తేలినది. ఆయేలూరిలో వారి నేత్రావధానముకూడ నట్లగునేమోయని వారు నాబసకు వచ్చి నన్ను మిక్కిలిగాం బ్రార్ధింపఁదొడఁగిరి. నాకు మిక్కిలి సిగ్గైనది. ఏమైన నేమి, యథార్ధముచెప్పిన వారువిందురా? వినరు, ఇట్టివనేకములు. ఒకటి శతావధానసార పీఠికలో నుదాహరించియే