అపవాదలు
421
నభ్యసించినది వ్యాకరణము మాత్రమే. లోకులుకొందఱు మమ్మును, తదితరశాస్త్రములను గూడ వచ్చినవారినిగా వ్రాయుచుందురు. ఈ వ్రాఁతకూడ దేవీప్రత్యక్షపు కథవలెనే అపవాదమని లోకు లరయుదురుగాక. మేము మాత్రము “శబ్దశాస్త్రప్రశస్తప్రభావం బాతపత్రమ్ము దివ్యచారిత్ర మాకు” అనియు 'గురుపాదసేవనాదరలబ్ద మగువిద్య నాగరాజ ముఖోదితాగమంబు' అనియు “అ ఇ ఉ ణ్ మొదలుగాఁగ" అనియు, అక్కడక్కడ శబ్దశాస్త్రమును మాత్రమే నేర్చితి మనునంశమునే ప్రకటించుచు వచ్చితిమి. ఇఁక నొకటి. మేము చదివిన దింతమాత్రమే యైనను మా ముఖ్య గురువరులు బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రులవారి పాండిత్యముమాత్రము సర్వతోముఖమైనది. వారు వ్యాకరణపాఠము చెప్పుచున్నప్పుడు పూర్వమీమాంసాది శాస్త్రములయందలి విశేషాంశములు తఱచు దొఱలుచుండెడివి. మాకు గ్రహణధారణములు భగవద్దత్తములయి చిన్నప్పటినుండి యుండుటచే వారు నొడివిన విశేషములన్నియుఁ గాకున్నను గొన్నియేని జ్ఞప్తియందుండెడివి. అందుచేతనేమి, ఇటీవల దేవీభాగవతాంద్రీకరణము వల్లనేమి. యేస్వల్పమో మఱియితరశాస్త్రప్రసక్తి యాత్మకుపకరించునంత కలిగినను అది ఇతరులకు గురుత్వ మొనర్చుపాటిదిగాదు. మా ప్రధానగురువు సర్వశాస్త్రవేత్త, వారివద్ద మే మభ్యసించినది మాత్రము వ్యాకరణ శాస్త్రము. స్వబుద్ధిచే నార్జించుకొన్నవి చాల విషయములు గలవు. అవి సాహిత్యమును బలపఱచునేకాని శాస్త్రమును బలపఱుపనేరవు. పనిచేసినచో నంతో యింతో మాకు, "శబ్ద శాస్త్రమువచ్చునుగాని తక్కు శాస్త్రములురావు" అనుట స్వభావోక్తి పెద్దలెన్నినేర్చినను- “నహి సర్వ స్సర్వం విజానాతి" అని యూరక యనలేదు. సర్వజ్ఞత్వ మనఁగా? సర్వశాస్త్రవేత్తృత్వము సంభవింపదు. కావుననే, “సర్వజ్ఞనామధేయము శర్వునకే". “అనభ్యాసే విషంశాస్త్రమ్” అని పరంపరగావచ్చుచున్నది. శాస్త్రములనఁగా నన్నియు శాస్త్రములుగావు. తర్క వ్యాకరణ, పూర్వోత్తరమీమాంసలే శాస్త్రములు. ఇందు మొదటి రెండును గురుశుశ్రూషచేసి సంపాదించినచోఁదక్కు రెండును గొంత సులభసాధ్యము లనుటకు సందియములేదు. ప్రసక్తాను ప్రసక్తముగా శాస్త్ర ప్రస్తావనలోనికి విషయము కాలిడుచున్నది. మాకు అమ్మవారు తోడఁబల్కుననునది ప్రవాదమాత్రముగాని నిక్కము గాదను నదిప్రధానాంశము. మాకాపెయందు భక్తి మాత్రము విశేషించి కలదు. దైవవశమున మా యిరువుర కుటుంబములును శ్రీకామేశ్వరి యిలువేల్పుగా గలవియేరైనవి, అయినను మా తిరుపతిశాస్త్రిగా రవధానములలోఁ దక్క దేవీవిషయమున నంతగా భక్తిందెలుపు కవనము రచింపలేదు. నాకు అవసరము కలుగుటచే 1. కామేశ్వరీ శతకము. 2. ఆరోగ్యకామేశ్వరి, లోనైనవి వ్రాయవలసి వచ్చినది. అందలి సంగతులన్నియు ఫలించినవనిగూడ వ్రాయుచున్నాను. ఇంతమాత్రమేకాదు. నాకు ఈ 65 వత్సరముల కాలమునందును జాలసార్లు స్వప్నప్రత్యక్షముకూడ జరిగినది. ఈస్వాప్నిక ప్రత్యక్షము