పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

360

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సోదరులకు నాయందు అంతరంగప్రేమ పోలేదు. వారిని నేను యెంతో ప్రేమతో ఆహ్వానించినవాణ్నని వారు గుర్తించకుండా వుంటారా? దానికి తార్కాణంగా యిటీవల కొన్నాళ్లకు శ్రీ రాజా మంత్రిప్రగడ భుజంగరావుగారి కుమార్తె వివాహంలో తారసించాము. అన్నదమ్ములందఱూ అప్పటికి బాగానే వున్నారు. భోజనాలవేళ కలుసుకున్నాం. క్షేమసమాచారం అడిగారు. ప్రీతిగా మాట్లాడారు. నాకూ యెంతో సంతోషమయింది. ఆ కాస్తసేపూ చక్కగా ఒక్క కడుపునఁ బుట్టినవాళ్లలాగ మాట్లాడుకున్నాం. తిరుపతిశాస్త్రి ఆ పెళ్లికి అసలే రాలేదో, అక్కడికింకా రాలేదో బాగా జ్ఞాపకంలేదుగాని, పెళ్లిలోకాక మళ్లా జరిగిన యింకోకొత్త పెండ్లిసభలో శ్రీ జమీందారుగారు కవిత్వ సభా యాజమాన్యాన్ని నామీఁదే వుంచారు. వారిని, మమ్మల్నీ అందఱినీ సమానంగా గౌరవించారు. మావాఁడి వుద్దేశం వారికీ మనకీ గౌరవంలో యేదో కొంచెమేనా తేడా వుండాలని. నాకున్నూ యీ చేదస్తం లేకపోలేదుగాని, యిదేమేనా పరీక్షార్థం యేర్పడ్డసభ కనకనా ఆలాటి తేడాపాడాలకు? భోజనంలో అందఱికి అన్ని పిండివంటలూ సమంగా వడ్డించడం యేలాటిదో, యిదీ ఆలాటిదే అని సరిపెట్టుకోవడం నా తాత్పర్యం. అందుచేత నాకేమీ లోటుగా కన్పించలేదు. యితఁడేనా యేమీ అంటాఁడనుకోలేదు నేను. అంతట్లో జమీందారుగారిని అభినందించడానికే అనుకున్నాను వకపద్యం ప్రారంభించాఁడు. దాని చివరచరణాలలో వివాదాంకురబీజాల్ని నాటుతూ “పులులన్ మేఁకల నొక్క చెర్వున జలమ్ముంద్రావంగాఁ జేయు చర్యలు చూపించితివయ్య!" అన్నాడు. ఆపట్లాన్ని కొప్పరపుసోదరులలో పెద్దాయన అనుకుంటాను, అందులోవున్న "మేఁకలు” అనేది తమ కన్వయించుకోవలసినదిగా అనుమానపడి యేదో పద్యం మళ్లా ప్రారంభించి "గజంబుల సింగంబుల నొక్క చెర్వున జలంబున్ ద్రాగఁగా” అని చదివి తమయందు సింహత్వం సంపాదించుకొని సంతుష్టిపడవలసివచ్చింది. అంతట్లో ఆవిషయం అప్పటికయితే ముగిసింది. కాని, లోపాయికారీని యింకా వీరికి లోలోపల రగులుతూనేవుంది. నేనైతే “అనవసరం, గతించిందేమో గతించింది. మళ్లా యెందుకురా" అని దిగపీఁకుతూనే వున్నాను కాని, బసలో నామీఁదికి యెదురుకొని గర్జిస్తూ "గోరీ కట్టింపనె? కాకవిప్రతతి కర్థిన్నేఁడు హేలాపురిన్" అని దూఁకుతూవున్నాఁడు. ఆ సందర్భంలో కర్మం చాలక నే నన్నానుగదా "దీనిపేరే వెఱ్ఱివెల్నాటీయం" అనిపించుకొంటుందన్నాను. దానితో తోఁకతొక్కిన తాచులాగ నామీఁదకి లేచి “క. వెలనాటివాఁడఁ గవితకు, వెలనాఁటినవాఁడ" అని హుంకరించాఁడు, కొడతాఁడేమో అనికూడ భయపడ్డాను. ఆయీపద్యాలన్నీ “సందర్శనం"లో వుంటాయి చూచుకోండి. మా శివరామశాస్త్రి బావమఱది మైలవరపు కృష్ణమూర్తిగారి గృహంలోనే యీ కోలాహలమంతా జరిగింది. తుట్టతుదకు జమీందారుగారి దాఁకా వెళ్లి యీ