పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

353


అంటూ ప్రస్తావించాడు. అప్పుడు నేను “మాలో కుడియెడమభేదం లేదుగాని మా ఇద్దఱిసభలకూ యేర్పరచిన టయిములో పూర్తిగా కుడియెడమ భేదం వుందని జవాబు చెప్పాను. (అవధానవిషయంలో కాదుగాని రసాంతరవిషయంలో కిర్లంపూఁడి సంస్థానోద్యోగి యీలాటి ప్రశ్ననే నన్ను అడిగి తగిన జవాబు పొందడం జరిగింది. విస్తరభీతిచే వుటంకించలేదు.) ఆప్రశ్న రాజుగారిమీఁదపెట్టి అతఁడు స్వయంగా అడిగిందేగాని, మఱోటి కాదని తరువాత రాజావారి అభినందన వాక్యాలవల్ల విస్పష్టపడింది.

సమయాసమయాలు ప్రతి మంచి కార్యానికిన్నీ ప్రతి చెడ్డకార్యానికిన్నీ అవసరమే కాని, అందులో కవిత్వానికి - అందులోకూడా అవధానానికి మఱీ అవసరమని చెప్పనక్కఱలేదు. “ఊహగలయంగల లేఖక పాఠకోత్తముల్, దొరికినఁగాక యూరక కృతుల్ రచియింపుమటన్నశక్యమే?” అనే పెద్దన్నగారి పద్యంలో వున్న సదుపాయంలో "వుయ్యాలా" వగయిరాలు కొన్ని అవధానులకు అవసరం లేదుగాని, వేళకు భోజనం వగయిరాలు అవసరం. అవధానిమనస్సే వకవుయ్యాలలాగా వుంటుంది; కనక వేఱే వుయ్యాలా అక్కఱలేదు. యీ ప్రసంగం జరిగిన కొంత సేపటికి అవధానం ముగిసింది. యేకొంచెమో పుష్పగణన వగయిరాలలో తబ్బిబ్బు కలిగింది. అప్పడు వక దివాణంనవుకరు - మంచి ప్రాజ్ఞుఁడు - వృదు లేచి రాజావారితో అన్నాఁడు కదా: “బాబూ! శ్రీమాడభూషి వెంకటాచార్యులవారు శ్రీ పిఠాపురపు సంస్థానంలో చేసిన అష్టావధానాన్ని నేను ప్రత్యక్షంగా చూచివున్నాను. ఆ అవధానానికీ, దీనికీ చాలా తేడావుంది. దానిలో పద్యాలు యెన్మిదిమాత్రమే. దీనిలో పద్యాలు యేభైకంటే కూడా యొక్కువ. ఇదే మాదిరిగా వ్యస్తాక్షరి వగైరాలు త్రిగుణంగానూ, చతుర్గుణంగానూ దీనిలో వున్నాయి. సుమారు నెలరోజులనాఁడు శ్రీ బావగారి (శ్రీ చెలికాని గోపాలరాయణింగారి) సభలో వెంకట శాస్త్రుల్లుగారు చేసిన అవధానంలో ప్రతీవిషయమూ త్రిగుణితమయిందిగాని యిందులో అంతకంటేకూడా అతిక్రమించింది. కాఁబట్టి అష్టావధానం యీలా పెంచడం న్యాయం కాదని ధైర్యంగా మనవిచేశాఁడు. దానితో రాజావారు “వారిశక్తి తెలుసుకోవడానికి యీలా పెంపుచేసి పెట్టవలసివచ్చింది కాని మఱోటికాదని పరిహారోక్తిగా సెలవిచ్చారు. ఆసభ నేనే చేసేదైతే మొట్టమొదటనే యిది వీలుకాదని చెప్పి నిషేధించేవాణ్ణి.

యెంత బరువేసినా పరిశీలించకుండా లొట్టిపిట్టలాగ భరించడమే కాని అతని ప్రకృతిలో దాన్ని తప్పుకుందామనే కోరిక వుండేదేకాదు. పయిగా దాన్ని నిషేధించే లౌకికోక్తి నైపుణ్యమున్నూ తక్కువే. లొట్టె మీఁద బరువు వేసేటప్పుడు కాళ్లకింద యిటుకలు పెట్టి ఆ యిటికలు చితికేదాఁకా వేస్తారనిన్నీ చితకడంతోటట్టే వేయడం చాలించి అది