పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నీవు తెలుఁగులో మాట్లాడితేతప్ప, నీ రాజ్యమంతా నాకు తలకట్టినా నేనిక్కడ నిమిషమేనా వుండేదిలే దన్నాండcట! దానికి రాజావారు లేశమున్నూ కోపగించుకోక అలాగే అంగీకరించి వారిని సమ్మానించి పంపించారని వినికి. విశ్వనాథశాస్రుల్లుగారి చర్యలు యీ రాజావారి చర్యలవలెనే అత్యద్భుతంగా వుంటాయి.

గీ. రాజులచరిత్రలును కవిరాజచరితములును
గ్రంథమ్మలకు వన్నెగలుగఁజేయు;
నందులో నామనమ్మన కరసిచూడ
కవులకతలకు రాజులకతలు లొచ్చు.

సంస్కృతం మాటలాడడమంటే సామాన్యంగాదు. అబ్బో.! దానిలో యెన్నో చిక్కులున్నాయి. ముఖ్యంగా కారకవిషయం. అంటే ఆయా విభక్తులు వాడడం కొంతకష్టం. సమాసవిషయంకూడా కష్టంలోదే. సమాసాంత ప్రత్యయాలవల్ల కలిగే మార్పులు చాలావుంటాయి. అన్నిటి కన్నా ధాతువులు వాడడంలో చిక్కులు చాలా వున్నాయి. సేట్టులనిన్నీ అనిట్టులనిన్నీ వుంటాయి. ఆ భేదంలో వకప్పడు మహామహా పండితులే తప్పటడుగులు వేస్తారు. ఆత్మనేపదమంటే పరస్మైపదమంటే అలావుండCగా ఉభయ పదులైన ధాతువులుకొన్ని వున్నాయి. వీట్లని వాడడానికి లక్షణప్రవర్తకులు కొన్ని నియమా లేర్పఱచివున్నారు. ఆ నియమాలు కాళిదాసాది మహాకవులే పాటింపలేక పోయారు. ఆయీ విషయమైన రహస్యాలు బాగా తెలియక యిప్పడు కొందఱు వృథాగా కొందరిని ఆక్షేపించడం అలావుండగా అంతో ఇంతో ఈ రహస్యం యెరిగిన వాళ్లు దీని సందర్భం ఇట్టిదని వక్కాణిస్తే దాన్ని విశ్వసించకపోవడం అట్లావుండగా పైంగా వక్కాణించిన వాళ్లకేమీ తెలియనట్లున్నూ, తమకేమో తెలిసినట్లున్నూ అపహాస్యంచేస్తూ వ్రాయడానికారంభిస్తారు. ఆ యీవిషయం “కాలీన శబ్దాన్ని గూర్చి వ్రాసేసందర్భంలో అన్యత్ర వ్రాసివున్నాను. కాCబట్టి యిక్కడ యెత్తేదిలేదు. -

రాజావారు సంస్కృతం మాట్లాడుతూవుంటే యేవో లోపాలున్నాయని కదా విశ్వనాథశాస్రుల్లుగారు వద్దని నిషేధించింది? రాజుగారివలె కాకపోయినా ఇతర పండితులకు కూడా సంస్కృతంలో త్వరగా సంభాషించే సందర్భంలో కొన్ని లోపాలు ఉండి తీరతాయి. యీ సంస్కృతాన్ని మెయిల్టైనులాగ నడిపించిందల్లా యేలేశ్వరపు నరసింహ శాస్రులుగారు మాత్రమే. అయితే వీరి ధోరణిలో దోషాలుండేవికావా అంటారేమో? ఇలాటి శంకకు శ్రీహరిశాస్రుల్లుగారేం ᏋBöᏇᏈᏋᏇᏇ చెప్పేరంటే: ఆ మహా ధోరణిలో యొక్కడో మనం శంకిద్దామని గొంతుక సవరించుకునేటప్పటికి ఆయనకు కొన్ని వందలో