పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

37


వేలో మాటలు నడిచిపోతాయి. కాCబట్టి ఆ ధోరణికి అడ్డు తగలడం శుద్ధ తెలివితక్కువ అని జవాబు చెప్పారంట. శ్రీబులుసు పాపయ్యశాస్తులవారి ప్రథమపుత్రులు - "పుత్రాదిచ్ఛేత్పరాజయం" అన్న సూక్తిని తండ్రిగారియందు సమన్వయింపఁజేసిన మహా విద్వాంసులు. ఆ నరసింహశాస్రుల్లుగారిలాగ మాట్లాడడాన్ని కొంతవఱ కభ్యసించినట్లు వింటాను. కాని కృతకృత్యులయినట్లు వినలేదు. దీన్ని యిక్కడికి ఆపుదాం. కథ కాదంబరిలాగున్నూ దశకుమారచరిత్రలాగున్నూ అగమ్యగోచరప్పంథలో పడుతూవుంది. యొక్కడికి తీసుకువెళ్లి అసలు ప్రధానాంశానిక్కలిపితే బాగుంటుందో మళ్లా వెనుకనుంచి చదువుకుంటేనే కాని నాకే అవగత మయ్యేటట్టులేదు. ఇంక యీ పిచ్చి వ్రాంత చదువరుల నేమి రంజింపC జేస్తుందో కదా! కానివ్వండి. రాజావారు మహాదాతలు, పండితులు పండితగోష్ఠి ప్రియులు, అన్నదగ్గరనుంచి మళ్లా మొదలెట్టుకుందాము. అదికాక తొట్టికి "రేవేమిటి?"

తణికెళ్ల సుబ్బన్న శాస్రుల్లగారికిన్నీ కొవ్వూరు గోపాలశాస్రుల్లగారికిన్నీ తర్కశాస్త్రంలో వాదం జరుగవలసి వుంది. సుబ్బన్నశాస్రుల్లుగారు “గోపాలశాస్రుల్లుగారు తనకైతే వాదంలో వోడిపోవడం తప్పదుగాని ప్రయోగంచేసి తన్ను కడతేరుస్తారనే భయంలో వున్నారు. ఉపాసనాశక్తికలవారు యిదివఱలో అక్కడక్కడ వుండేవారు. పుల్లెల దక్షిణామూర్తి శాస్తుల్లుగారికిన్నీ అద్దేపల్లి కృష్ణశాస్రులుగారికిన్నీ యేదోవిషయంలో కొంత చర్చ నడిచిందనిన్నీ కృష్ణశాస్రుల్లుగారి వాదం వెనుక తగ్గిన కారణంచేత ఆయన మీద యీయన మూCడోకన్ను తెరిచారనిన్నీ వక జనశ్రుతి వుంది. దక్షిణామూర్తిశాస్రుల్లుగారు యితర శాస్తాలతోపాటుగా యీ మంత్రశాస్త్రంలో కూడా మహాప్రజ్ఞకలవారు. అట్టివారై వుండీనిన్నీ అద్దేపల్లి కృష్ణశాస్రుల్లుగారి ప్రయోగంవల్ల నెల్లాల్లో రెండునెలలో కట్టువస్త్రంకూడా యెఱంగనిస్థితిలో వుండి చిక్కుపడుతూవుండగా వక గుజరాతీ దేశస్తుడు వచ్చి ఆ ప్రయోగాన్ని మళ్లా మళ్లించినట్లు విన్నాను. యిదంతా మా రోజుల్లో జరిగిందే. అయితే వక శంక : యిద్దఱూ మంత్ర శాస్త్రజ్ఞలేకదా, వీరి దానికి వారెందుకు లొంగిపోవలసి వచ్చింది,-అని. వినండి యీ వుపాసనలలో కొన్ని కేవలం పరానికే వుపయోగిస్తాయంట. కొన్ని యిహానికే. వీట్లనే శాబరాలంటారు. కొన్నో వుభయానికిన్నీ పనికివస్తాయCట. కృష్ణశాస్రుల్లుగారి మంత్రాలు తుట్టతుది తరగతిలోవి. దక్షిణామూర్తి శాస్రుల్లుగారివి మొట్టమొదటి తరగతిలోవి అంటూ చెప్పగా పెద్దలవల్ల విన్నాను. అసలు సందర్భం యీలాటిదే అయినా కొందఱు అసమర్థులైనవైద్యులు రోగాన్ని చక్కగా నిర్ణయించుకోలేక "ప్రయోగ" మనడంకూడా కలదు. కొందటో! పిశాచమని మొదలెడతారు. రెండూ వకటేకాని, పిశాచం దానంతట అది ఆవహించేదిన్నీ రెండవది యెవరో మంత్రశక్తిచే పంపిస్తే వచ్చి ఆవహించేదిన్నీ