పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మొదటివారు నలుగురు సోదరులున్నూ వ్యాకరణపండితులే అవడంచేత వారి కాపేరు వచ్చింది. రెండో వారు ఆరురున్నూ వకటేశాస్త్రమందు కాకపోయినా మొత్తం భిన్న శాస్త్రాలలోనేనా పండితులే అవడంచేత ఆ సోదరులకు ఆపేరు వచ్చింది. వకరి నివాసం మార్కొండపాడు, రెండోవారి నివాసం ర్యాలి, యిప్పటికిన్నీ యీ కుటుంబ పండితులలో కొందఱు శేషించి ఉన్నారు. వంశంలోకూడా కుటుంబవిద్యను వదలకుండా చదువుకున్నవారేకాక ఉపాధ్యాయత్వాన్నిచేస్తూ పూర్వులపేరు నిలుపుతూవున్న వారున్నూ వున్నారు. యిందులో మార్కొండపాటి చతుషం వార్షికం నిమిత్తం శ్రీరాజావారి దర్శనార్థం వెళ్లారట. మనవిచేయించుకున్న మీందటదర్శనం అయింది. సగౌరవంగా కూర్చోపెట్టడం జరిగినతరువాత రాజావారు నవుకరుతో “వొరే అక్కడ పదునైనచాకువుంది పట్టుకురా. పండితులు వచ్చారు" అన్నారంట. దానితో “మనలో యెవరేమి లోపంచేసినట్లు శ్రీవారి నోటీసులోకి యెవరిద్వారా వెళ్లిందో యీవాళ మనకు యేదో అవమానం జరుగుతుంది కాబోలును" అని మిక్కిలిగా భయపడ్డారంట. అదంతా రాజావారుచూచి కొంతసేపు తూష్ట్రీభావంగా గంభీరంగా వుండి మళ్లా నవకరినిపిల్చి మామిడిపళ్లు తీసుకు రమ్మన్నారంట. ఆ మాట వినడంతోనే పండితుల ప్రాణాలు కుదుటబడ్డాయట. “బ్రతుకుజీవుండా" అనుకుంటూ గుప్పెట్లో పెట్టుకున్నప్రాణాలను గుండెల్లోకి చేర్చుకుంటూ వుండంగా ప్రభువు స్వయంగా ఆ మామిడిపళ్లు కోసి “పుచ్చుకోండి" అని సెలవిచ్చారంట. అప్పటిపండితులు యిప్పటి కొందఱు పండితుల్లాగా కవులలాగా - పండ్లే అనుకోండి (కాఫీ గీఫీ ఉప్మాగిప్మాలు కావే అనుకోండి) - యేబట్టలతోం బడితే ఆ బట్టలతోడి యొక్కడCబడితే అక్కడ పుచ్చుకునే ఆచారంలేదు. యిప్పడో? పెద్ద కర్మనిషులమనిన్నీ వైదిక సంప్రదాయం వారమనిన్నీ పైCగాయితరులు అనాచారంగా వుంటారనిన్నీ చెపుతూ ఆక్షేపిస్తూవుండేవారు సైతం యొక్కడCబడితే అక్కడ కూర్చుని కాఫీ పానంచేయడం నేను స్వయంగా చూచివున్నాను. అప్పటికిన్నీ యిప్పటికిన్నీ చాలా భేదం వుంది. యింతదాంకా యెందుకు? యజ్ఞానికి శ్రాతులంటూ వస్తారు. సోమపానం మాట దేవుండెఱుంగునుగాని ఆ శ్రాతులు వుదయ మయ్యేటప్పటికల్లా కాఫీపానం లేకుంటే బ్రతుకలేనివారే నూటికి తొంభై తొమ్మండుగురు. మా చిన్నతనంనాంటికిన్నీ యిప్పటికిన్నీ మాబోటి అనాచారులమాట అల్లావుండంగా సదాచారులవైఖరి యెంతో మాటింది. కప్పగంతుల రామశాస్రుల్లుగారు తాంబూలం వేసుకోవడంకూడా మడిగట్టుకొనే వేసుకొనేవారు యిది నేను స్వయంగా చూచినదే. మళ్లా ఆయన శుద్ధ చ్ఛాందసులేమో అనుకుంటే - పెద్ద పండితులవడం అట్లా వుండంగా అఖండ లౌకికులు. వీరిప్పడు సజీవులే. యిప్పడుకూడా విత్తనాలు నిల్వచేసినట్లు భగవంతుఁడు అక్కడక్కడ పైమాదిరివారిని దాంచికొనివున్నాడు. పెద్దవిద్వాంసుడు గాని,