పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

33


నిరతాన్నదాతలు, నప్రతిగ్రహీతలు వకరు వుండేవారు. వారు చాలావృద్దులైవున్నప్పుడు మా గురువుగారితో వెళ్లేరోజులలో వారి దర్శనం నేనుకూడా చేసివున్నాను. సదరు దీక్షితులవారి యోగ్యతను శ్రీరాజావారు కూడా విని వారిని ఆహ్వానించి సమ్మానించాలని అనుకోవడం శ్రీ రాజావారి ఆంతరంగిక స్నేహితులని యిదివఱలో మొదటి వ్యాసంలో వ్రాసిన శ్రీపొక్కునూరి వేంకటశాస్రుల్లుగారు విని వుండడం చేత దీక్షితులవా రేదో పనిమీద పిఠాపురం వచ్చినప్పుడు రాజావారి దర్శనానికి వెంటఁబెట్టుకొని వెళ్లారట. అప్పుడు శ్రీవారు స్నానగృహంలో వున్నారట. యీ వ్రాయంబోయే సంగతులలో నిజమెంతో, లోకులకల్పితమెంతో - బాల్యంలో నేను యేలావిన్నానో ఆలాగే వ్రాస్తాను. మధ్య సంగతి సందర్భాలమాట యేలావున్నప్పటికీ ప్రధానాంశంమాత్రం నిజం. దీక్షితులవారు రాజావారి సన్నిధికి వెళ్లేటప్పటికి, రాజావారేమో స్నానానికి ప్రారంభించారనిన్నీ వేంకట శాస్రుల్లుగారికి వుండే చనువు సర్వసామాన్యమయింది కాకపోవడాన్నిబట్టి 《원9 స్నానగృహం ੱਤੰ వెళ్లి ప్రభువుతో సంస్కృత భాషతో - “దీక్షితాస్తావత్ ఆగతా వర్తంతే, తేషాందర్శన మవశ్యం దాతవ్యమ్" అని పొక్కునూరి శాస్రుల్లుగారు మనవి చేశారనిన్నీ దానిమీంద “ఇదానీమేవవా?" అని రాజావారు చిఱునవ్వుతో సెలవిచ్చారనిన్నీ వేంకట శాస్రుల్లుగారు "ఇదా నీమేవ దాతవ్యం, నచేత్కాలాంతరేతే సమాగచ్ఛంతివా నవేతిసందేహః" అన్నారనిన్నీ వినడం. పిమ్మట శ్రీవారు కొంత తడిసి తడియని కట్టుబట్టతోనే సదరు దీక్షితులవారికి దర్శనమిచ్చి యేవో రెండు మూడు మాటలు మాటలాడి ఆదరించి అప్పుడే వాచాయిచ్చినభూమి యిప్పడేమి వసూలౌతుందో తెలియదుగాని అప్పడు మాత్రం సాలువకంటికి ఆఱువందల రూపాయలు వచ్చేదిగా వుండేదని చెప్పడం నేను యెఱిఁగిందే. ఆ యీ సందర్భంవల్ల ఆ రాజావారి కృతయుగ దాతృత్వం వెల్లడికావడమే కాకుండా ఆ ప్రభువు దాతృత్వానికి సమయాసమయా లక్కఱలేదనీ కూడా తెలిపినట్లవుతుంది. మటిన్నీ శ్రీ రాజావారంటే యితరులకే కాని పండితులకు భయపడవలసి వుండేది కాదేమోనని పై గాథలవల్ల చదువరు లభిప్రాయపడతారేమో. వక్కపొక్కునూరి వేంకటశాస్రులుగారికి తప్ప ఇతర పండితుల కెవరికిన్నీ ఇట్టిచనువు లేదు. యీయన శ్రీ రాజావారికి సతీర్డులో సహాధ్యాయులో అయియుండడంచేత ఇంతచనువు కలిగివున్నట్లు వెనుకటివ్యాసంలో వ్రాసేవున్నాను. శ్రీ పిఠాపురపు పూర్వ ప్రభువంటే - “తస్మాద్రాజముఖం భీష్మం భావుకమ్” అనే శ్రుతికి ప్రథమోదాహరణమని పలువురు పండితులు చెప్పగా వినివున్నాను. యిందుకు చిన్న యితిహాసం వుదాహరిస్తాను.

మాజిల్లాలో మా గురువుగారి కారులో వుండే పండితులలో, మార్కొండపాడు చతుష్టయం, ర్యాలిషట్కం, లేక బొమ్మగంటిషట్కం, అంటూ కుటుంబపండితులు వుండేవారు.