పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిష్టావారి విశిష్టత్వం

271


యెఱుఁగుదును. గద్వాలాదులలో కవికి పూర్ణసమ్మానం రు.12లు వార్షికం. శాస్త్రజ్ఞులకు పూర్ణసమ్మానం రు18లు వార్షికం. కవికి శాస్త్రజ్ఞులతోపాటు సమ్మానంలేదు సరిగదా, గాయకులతో పాటుకూడా సమ్మానంలేదు. యీ దురన్యాయాన్ని సహించలేకే వనపర్తి సంస్థానంలో- -

కıı గానమ్ముకన్న కవన - మ్మేనాఁడేనియును తక్కువే?

అంటూ నేను రాజుగారితో వివదింపవలసివచ్చింది. విషయం విషయాంతరంలోకి పోతూవుంది. ప్రస్తుతం మనకు ముఖ్యంగా కావలసింది, పండితులు కవిత్వాన్ని చెప్పినప్పటికి కవినామధారణకు లజ్జపడతారనే దియ్యేవే. షడ్దర్శనీవేత్తలుగావున్న మన శిష్టాశాస్త్రుల్లుగారు కూడా ఈకారణాన్ని పురస్కరించుకొనియ్యేవే “కలౌషష్టి" అతిక్రమించే వఱకున్నూయేచిల్లర మల్లరలో తప్ప పుస్తకరూపంగా యేవిషయాన్నీ ప్రచురించినట్టు లేదనుకుంటాను. ఆ మధ్య కాళిదాసకృత మేఘసందేశాన్ని ఆంద్రీకరించి నట్లెఱుఁగుదును. దానివల్ల వీరు బాల్యాదారభ్యా అభ్యసించినవిద్య సంస్కృతమైనా, ఆంధ్రంమాతృభాష అనే హేతువుచేతో, కాలేజీలో ఆంధ్రాని క్కూడా వీరు వుపాధ్యాయులుగా వుండవలసి వచ్చో, దానిలో కూడా కృషి చేసినట్లు విస్పష్టమే. వీరి కవితాధార ఆంధ్రంలో కూడా ధారాళంగానే నడుస్తుంది. అయితే వీరి ఆంద్రీకరణానికి లోకంలో తగినంత వ్యాప్తి కలిగిందా అంటే మాత్రం తగిన జవాబు లేదు. శాకుంతలాంద్రీకరణానికి వీరేశలింగం పంతులవారికిన్నీ మేఘసందేశాంద్రీ కరణానికి వ -సు. రాయుఁడు గార్కిన్నీ కొంత పేరు వచ్చినట్లు లోకంవల్ల తెలుస్తుందే కాని తక్కిన వారి కెవరికిన్నీ అంతటి అదృష్టం పట్టినట్లు కనపడదు. అంతమాత్రంచేత వారివారి ఆంద్రీకరణాలు వ్యర్థాలనడానికి వలనుపడదుగదా? ఇంతటి మహాశాస్త్రవేత్త కవి కావడమే దుర్ఘటం, ఆ కావడంలో సంస్కృతంలో అయితే కావచ్చుఁగాక దేశభాషలోకావడం మిక్కిలి అభినందనీయం. యిది హరినాగభూషణంగారి వంటి మహాగాయకుcడు, లేదా శిరోమణి పనిపడితే గజ్జకట్టి నారాయణదాసువలె హరికథాకాలక్షేపం చేయడం వంటిది. వెనక శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారు వేదం వచ్చి, వేదాంగములున్నూ వచ్చి ఉభయ భాషా కవియై కులవిద్యయైన వీణలో అఖండుఁడై, సన్నాయి కూడా వాయించుట డోలు కూడా వాయించుటవంటిదిగా భావించవలెను. వెనుక శ్రీమదహోబల శాస్త్రుల్లుగారు శ్రీ చింతామణి గణపత్యుపాసకులు కాశీలో చెప్పులు కుట్టుటలోకూడా పాండిత్యమును కనపఱచి తజ్జాతీయునిచే సర్టిఫికెట్టు పుచ్చుకొన్నట్లు గురువులవల్ల విన్నాను. యాయన ఆంధ్రుఁడు. కాశీలో నెల్లపండితులను జయించి “కాశ్యా మేకః కాశినాథో౽వశిష్ట" అని విరమించినట్లు వినికి. కాశీలో విద్యార్థులు నేఁటికిన్నీ