Jump to content

పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కొట్టుకోవడం మాత్రం మానలేదు. అయితే వాదం మానుకోరాదా?" అంటే : కారణాంతరం చేత మానుకున్నప్పటికీ అసలు పాండిత్యంలోనే లోటుండి మానుకున్నట్టు లోకం భావిస్తుందికదా? అందుచేత - “యశోవామృత్యుర్వా' అని అంగీకరించక తప్పిందికాదు. పైగా రాజావారు సెలవిచ్చారంట : "ఏదేనా మీకు చిక్కే తటస్థించే యెడల తరతరాల వఱకున్నూ మీకుటుంబాన్ని పోషించేభారం మా మీంద వుందనుకోండి" అన్నారట. అయితే రాజావారికి మంత్రశాస్త్రంలో పూర్తిగా నమ్మకం వున్నప్పటికీ "గోపాలశాస్రుల్లుగారి వల్ల సుబ్బన్న శాస్తుల్లుగారికి అపకారం జరుగుతుందని మాత్రం లేశమున్నూ అనుమానం లేదనుకోవాలి మనం. అనుమానమేవుంటే; వారికీ వీరికీ వాదం పెట్టకుండానే వుండేవారేమో. రాజావారికి మంత్ర శాస్త్రంలో పూర్తిగా నమ్మకం వుందనుకోవడానికి శ్రీయింగు రామస్వామిశాస్రుల్లగారికి మా గ్రామ సమీపంలో జేగురుపాడు గ్రామంలో యిచ్చిన పధ్నాలుగుపుట్ల భూదానమే, అనంగా నూట పండ్రెండు ఎకరాలే సాక్ష్యమిస్తాయి. ઉ9 ટૂંઝ૦30 యిప్పటికిన్నీ వారికి అవ్యాహతంగా జరుగుతూ వుంది. ఆ భూదానం యెందుకు జరిగిందో వ్రాస్తే చాలా పెరుగుతుంది.

ఇంకొకటికూడా సాక్షాతూగాక పరంపరగా సాక్ష్యమిచ్చేది యీలాంటి భూదానమే వుంది. విజయనగరపు సంస్థానంలో అంతఃపురం లోనే అనుకుంటాను. వకగ్రహం కామినీతరగతికి చెందినది పట్టుకొని పీడిస్తూవుందంట. యిక్కడకూడా కొంచెం వ్రాయాలి, మనకు విద్యలో స్కూలుఫైనలు వగయిరా తరగతులలాగే గ్రహాలకికూడా తరగతులున్నాయి. & గ్రహాలలో “కామినీ" తరగతికి చెందినదంటే చాలా గడ్డు. పురుష గ్రహాల్లో “బ్రహ్మరక్షస్సు" గడ్డు. యీ గ్రహాలు యేలాటి మంత్రశాస్త్ర వేత్తలకున్నూ లొంగవు. వాట్లకు యేదో యితరజన్మం రావడానికి తగ్గంత తపస్సు ధారపోస్తే వదిలిపోతాయని వినడం. సామాన్యగ్రహాలు చేసే చేష్టలకన్నయీ కామినీగ్రహాలుచేసే చేష్టలు అద్భుతంగావుంటాయి. యేమనిషిని యీ కామినీ పట్టుకుంటుందో ఆ మనిషిని తీసుకుపోయి అడివిలోవుండే అతి గహనమైన వెదురుడొంకలు వగయిరా గహనప్రదేశాలలో పెట్టడం కూడా తటస్థించడం చెప్పంగా విన్నాను. ఇంతదాంకా కాదుగాని, వక కామినీగ్రహం చేసేచేష్టలు ముప్పదియేండ్లకు పూర్వం నేనున్నూ కళ్లారా చూచివున్నాను. ప్రస్తుతం వినండి. ఆ గ్రహాన్ని వదల్చడానికి కొదవేమిటి? “రాజు తలచుకుంటే యేంలోపం కనక పెద్దపెద్ద మంత్రగాళ్లంతావచ్చారు. కొందఱు గ్రహంచేత చెంపకాయలు తినడం కూడా తటస్థించింది. మహారాజావారికి యేమీ తోcచడంలేదు. అట్టిస్థితిలో ఆగ్రహానికే యెంతోcచిందో?... “రాజా! యీలాచూడు" మని పిల్చి, “యీమంత్రగాళ్లు నన్ను వదిల్పించ లేరు గాని నీకో వుపాయం చెపుతాను. అలా చేయంగలవా?" అందంట. చెప్పవలసిందన్నారంట రాజాగారు, “అయితే విను.