పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

29


శ్రీ కం|| వీరేశలింగంపంతులవారు తెలుంగు పండితులుగా వుండే రోజుల్లో వీరు అక్కడ సంస్కృత పండితులు. "హైయస్టు" కన్న అధికంగా వేశారేమని అడిగితే విద్యార్థి అంత అనుకూలంగా వ్రాశాండు కాబట్టి ఆలా వేశాను పొమ్మని “ప్రినిసిపాల్ గారికి జవాబు చెప్పేవారంట. యీ శివశంకరశాస్రుల్లుగా రేమి, బందరులో శ్రీ కోరాడ రామచంద్రశాస్రుల్లు గారేమి, యింకా మణికొందఱు పండితులేమి పై అధికార్లకు జంకుతూ వుపాధ్యాయత్వం చేసినవారు కారని యెడింగినవారు యిప్పటికిన్నీ చాలామంది వున్నారు కాCబట్టి విస్తరించేది ෂීඨ. చెప్పొచ్చే మాటేమిటంటే; నిజమయిన పాండిత్యము నూటికి నూటపదులు మార్కులు తెచ్చుకొన్నదేగాని ముప్బె అయిదూ, నలభయ్యీ తెచ్చుకొన్నది కాదనిన్నీ యిప్పుడు ముచ్చటించుకొనే కథలో పండితులు నూటికి నూటపదిమాత్రమేకాక నూటపదహార్ల తరగతిలో వారనిన్నీ ఆలాటిపండితులు శాస్రార్థం చేస్తూవుంటే విని సంతోషించడానికితగ్గ శ్రుతపాండిత్యం మా పిఠాపురం లేటు రాజావారికి వుండేదనిన్నీ తెల్పడానికే యీ వ్యాసం నేను వ్రాయడానికారణం.

ప్రస్తుతం శ్రీ రాజావారు గోపాలశాస్రుల్లుగారికిన్నీ సుబ్బన్న శాస్రుల్లు గారికిన్నీ ముఖాముఖీని వాదం పెట్టి విని ఆనందించందలంచుకున్నారు. వీరిద్దటి మధ్యనూ జయాపజయాలు నిర్ణయింపదగ్గ పండితులు మూcడోవారు కూడా వుండాలికదా? వారెవరంటె; మండపేట కాపురస్టులు હૈં యొడవల్లి చంద్రశేఖర భట్టాచార్లుగారో, లేక వీరికుమాళ్లు జానకిరామ శాస్తుల్లుగారో అని గురువుగారు చెప్పారు. వీరుకూడా కాశీపండితులే. యిక రేపోయెల్లుండో శాస్తార్థపుసభ జరుగుతుందనంగా సుబ్బన్న శాస్రుల్లుగారు శ్రీ రాజావారితో "మహాప్రభూ? నాతోటి తర్కంలో పూర్వపక్షసిద్ధాంతాలు చేశేవారు యీ దేశంలో మాత్రయంలో తప్ప మటొక్కరులేరు. యిది చెప్పక తప్పనివిధిచే మనవి చేసుకుంటున్నాను. కాCబట్టి ఆత్మస్తవంగా తాము అభిప్రాయపడకూడదు. గోపాల శాస్రుల్లుగారు ఆఱుశాస్రాల్లో పండితులు. నేను ఒక్క తర్కంలో మాత్రమే పండితుణ్ణి. నాకున్నూ ఆయనకిన్నీ ఈ తర్కంలో ఏతం పెట్టుగా వుంటుంది. పోనీ దేవరవారి వినోదానికి అంగీకరించి కూచుందామంటే; గోపాలశాస్రుల్లుగారు ఆఱు శాస్తాలలో పాండిత్యం అలావుండంగా మంత్రశాస్త్రంలో అఖండులు. వోడు వచ్చిందంటే ఆయన వూరుకోరు. కాబట్టి మనవి చేసుకున్నాను" అనేటప్పటికి రాజావారు “అలాటిభయం మీరు లేశమున్నూ పడనక్కఱలేదు. ෆුධි వినోదార్థం జరిగే సభగాని మఱివక మోస్తరుదికాదు. ఈ విషయమై వారితో మేము మాట్లాడుతాము. తాము లేశమున్నూ జంకవలసిందిలే దంటూ ధైర్యం చెప్పారంట. కాని ఎంత ధైర్యం చెప్పినా సదరు గోపాల శాస్తుల్లుగారి మంత్రశాస్త్ర పాండిత్యం సుబ్బన్నశాస్రులుగారికి వినికివల్ల పూర్తిగా తెలిసివుండడంచేత గుండెలు తటతట \