పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

31


శ్రీ అజ్ఞాడ అన్నంభౌట్లుగారు వకరోజరాత్రి రెండు జాములవేళ వక మాలవాడికిచేసిన అన్నదానఫలితాన్ని నీవు ధారపోయిస్తే నాకు దానివల్ల మంచిజన్మ వస్తుంది. తద్వారాగా నాబాధ మీకు తప్పతుంది. అని చెప్పిందంట. అప్పుడు ఆ ప్రభువు అజ్జాడ అగ్రహారం తమ సంస్థానంలోదే కనక, ఆ అన్నంభోట్లుగారిని సగౌరవంగా ఆహ్వానించి “అయ్యా తమవల్ల మాకీవుపకారం కావా" లంటూ ప్రార్ధించారంట. దానిమీంద "అయ్యా నేను నా కర్తవ్యాన్ని నెఱవేర్చుకున్నానేకాని దాన్ని మళ్లా వకరికివిక్రయించే తలంపుతో గాని దానంచేసే తలంపుతోంగాని చేయలేదన్నారట. రాజావారు మిక్కిలిదీనంగా ప్రార్థించారంట. దానిమీంద యేమీ ప్రతి చెప్పలేక ఆ పుణ్యాన్ని ధారపోశారంట. అంతతో ఆ బాధ నివర్తించిందట.

అయితే రాత్రి రెండుజాములవేళ వక మాలవాడికి పెట్టిన పుణ్యానికి అంతవిలువ యెందువల్ల కలిగిందో కొంత వ్యాఖ్యానం చేయాలి. తూర్పున కొండయేళ్లు చాలావుంటాయి. అవి వర్షాకాలంలో అంతల్లో ప్రపంచమంతా ముంచేటట్టు పొంగడమున్నూ మళ్లా వెంటనే కుంగడమున్నూ అందఱూ యెఱిఁగిందే. ఆలా పొంగే సమయంలో యేదో వూరినుంచి ఒక మాలవాండు అజ్ఞాడమార్గంగా వస్తూ వక తిప్పలో చిక్కుకున్నాండు. క్రమంగా తిప్ప మునిగింది. వీడుకూడా మునిఁగిపోయే అవస్థ వచ్చింది. రెండుజాములరాత్రి అయింది. అంతా పరుండి నిద్రపోయేవేళ కనక “మొట్టోచస్తున్నాను. ఆకలికూడా బాధిస్తూవుంది బాబో" అంటూ గట్టిగా ఆ తిప్పలోనుంచి అఱచాండు. మేడమీద పరున్న నిరతాన్న ప్రదాత అన్నంభోట్లుగారు విన్నారు. ఆపట్టాన్ని లేచి సుమారు శేరుంబావు బియ్యం అన్నమున్ను ఆవకాయముక్క వగైరా రసవర్గాలున్నూ మునకాల కఱ్ఱ లావు.వి రెండు పొగచుట్టలున్నూ అవి కాల్చుకోవడానికి వక యెండుగడ్డితో చుట్టి నిప్పంటించిన లావాటి తూట కట్టానున్నూ పట్టుకొని, ప్రామ్లమీస్తాన్ని తైగ్రేస్తూవున్న ఆ కొండకాలువను తెప్పమీంద అడిచినుక్తూప్రొడ్రిచిస్తుకుగా వున్న వానలో యీCదుకొని మళ్లా మాలాడిని ముట్టుకోకుండానే యీవలివొడ్డు చేర్చడానికి తోవాసం యింకో తెప్పకూడా తెప్పకి తగుల్చుకొని తిప్పమీదకి వెళ్లి, సుష్టకృత్తుగా అంటే తృప్తాస్థగా వాడికి భోజనంపెట్టి, చుట్టకాల్చుకున్నాక వాడిసహితంగా యీవలివడ్డుకు వచ్చి చేరారంట. ఆ మహానుభావుండు యెన్ని వేలమందికో అన్నదానం చేసినప్పటికీ ఆనాటికి హరిజనుండికి చేసిన అన్నదానం ఆ కామినీగ్రహానికి గణనీయం అయింది. ఆలోచిస్తే బ్రాహ్మణులు కులాచారాలు చెడకుండానే మాలమాదిగల యెడలకూడా యేలాటి దయాదాక్షిణ్యాలు చూపించేవారో యీ మహాపురుషుని చరిత్ర వేనోళ్ల సాక్ష్యమిస్తుంది. అంతేకాని యెవరో తండ్రి ఆబ్లీకంనాండు ఇద్దఱు హరిజనులను భోక్తలుగాపెట్టి లేవనెత్తారనిన్నీ యేమో చేశారనిన్నీ చెప్పేమాటలు బొత్తిగా విరుద్ధాలవడంచేత దయాదాక్షిణ్యాలలోకి చేరవు సరిగదా అవ్యక్తపుపనులలో చేరతాయి కూడాను. యివి