పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శాస్త్రం కూడా యీలాంటి విషయాలలో పనిచేయదు. జంకుతుంది. యిది విషయాంతరం. పూర్వపు జమీందార్ల మర్యాదలూ వేషభాషలూ యిప్పడు మనం కథలలో చెప్పకోవలసిందే గాని అనుభవంలో కనపడవనేది యిప్పటి ముఖ్యాంశం.

మా గంగాధరరామారావుగారు సర్వవిధాల పూర్వపు తరగతిలో వారు. స్నానము, వారి కేర్పడ్డరీతిని సంధ్య, జపము, తపము, యివన్నీ నెఱవేర్చుకొనేవారు. యే వర్ణస్టుల నెట్లు గౌరవించాలో అట్లే గౌరవించేవారు. కులాభిమానం యెంతవుండాలో అంతా పూర్తిగా వున్నవారు. పండితులయం దెంతవఱకు రాజున కభీమానం వుండాలో అంతా సంపూర్తిగా వున్నవారు. వేయేల, యే విషయ మందున్నూ పూర్వులకు తీసిపోకుండా మన మర్యాదలు లవమున్నూ తగ్గకుండా రాజ్యపరిపాలన చేసినవారని అనుభవజ్ఞలు యిప్పటికిన్నీ చెప్పకుంటారు.

శ్రీవారు రాజ్యానికి వచ్చిన స్వల్పకాలంలోనో, లేక అంతకు పూర్వమో, కొవ్వూరు గోపాలశాస్రులుగారనే షడ్డర్శనీ పారంగతులు కాశీ నుండి దేశానికి దయచేసి గోదావరీతీరమనే కారణంచేత తుట్టతుదరోజుల్లో కొవ్వూరులో మకాం చేశారు. యీ శాస్రుల్లుగారికి షడ్డర్శనాలలో సంపూర్ణ పాండిత్యం ఆలా ఉండగా మంత్ర శాస్త్రంలో మిక్కిలీ పాండిత్యం వున్నట్లు అనేకులవల్ల వినడమే కాకుండా శ్రీ మా గురువరేణ్యులు బ్రహ్మయ్య శాస్రులవారివల్ల కూడా యొక్కువగా విని వున్నాను. యీ శాస్రులవారు నేను యెటింగే కాలానికప్పుడే స్వర్ణతులైనారు. కాని వీరిముఖ్యశిష్యులలో వకరైన శ్రీ అద్దేపల్లి కృష్ణశాస్రుల్లగారిని నేను చాలాసార్లు సందర్శించి వున్నాను. వీరికికూడా మంత్రశాస్త్రంలో యొక్కువ ప్రజ్ఞవుందని సర్వులు చెప్పకోవడం కలదు. గురువుగారి ప్రజ్ఞ యేలాటిదో మంత్రశాస్త్రంలో, శిష్యులు కృష్ణశాస్రుల్లుగారి ప్రజ్ఞకూడా అట్టిదే అని వినికి. గురువుగారి ప్రజ్ఞావిషయం యీ దేశంలోనే కాదు - కాశీలోకూడా చాలా గొప్పగా చెప్పకోవడం నేను స్వయంగా కాశీలోనే వినివున్నాను. వీరి ప్రజ్ఞనుబట్టే వీరికి శ్రీ విజయనగరం సంస్థానంవారు దేవిడీమన్నా చేసినట్లు కూడా మా గురువులు చెప్పఁగా వినివున్నాను.

శ్రీ విజయనగరం ప్రభువు శ్రీ విజయరామగజపతిమహారాజులుంగారు విజయనగరాన్ని సర్వవిధాల కాశీగా మార్చవలెననే వుద్దేశం కలవారని వింటూను. ఆ కారణంచేత ఆ కాశీలో ప్రసిద్దులైన పండితులను రప్పించి తమ సంస్థానంలో వారివారికి తగిన సమ్మానాలేర్పఱచి గౌరవిస్తూండేవారనిన్నీ అందులో యీగోపాలశాస్రుల్లుగా రొకరనిన్నీ యీ శాస్రుల్లుగారియందు ప్రభువు చూపించే గౌరవాతిశయం మిక్కిలీ యొక్కువగా వుండడంచేత తక్కిన పండితులు దాన్ని చూచి సహింపలేకపోయారనిన్నీ