పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

25


ఆకారణంచేత యీ మహావిద్వాంసుcడికి ఆ సంస్థానాన్నుంచి “యేలాగరా? వుద్వాసన చెప్పించడం అని ఆలోచించి ఒక కుట్రపన్ని మహా రాజావారితో యీ విధంగా మనవిచేశారనిన్నీ వినడం. యేలాగంటే “మహాప్రభో! మన గోపాలశాస్రుల్లుగారు యితర శాస్తాలలో నిరుపమానమైన పండితులు సరేగదాండి. వీరు మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యక్ష దాఖలా చూపించే పండితులని దేవర విన్నారో లేదో అని మనవిచేసుకుంటూ వున్నాము. యెందుకంటే యీలా మనవిచేసుకోవడం : తమ సెలవైతే ఆలాటి ప్రత్యక్ష దాఖలా వీరు కనుపరుస్తారేమోకాని మాబోంట్లం కోరితే చూపించరు. తమ సన్నిధినివుండి ఆ దాఖల చూద్దామనే కుతూహలంతో యింతగా మనవిచేసుకోవడం" అంటూ శ్రీమహారాజావారితో చాలాసార్లు విజ్ఞాపన చేసుకోంగా చేసుకోంగా, వకరోజున శ్రీవారు శాస్రుల్లు గారిని సగౌరవంగా "శాస్త్రీజీ" అని సంబోధించి "మీమంత్రశాస్త్ర దాఖలా వకపర్యాయం మాకు చూపించాలి" అని కోరేరంట. దానిమీద శాస్రుల్లుగారు “యివి పరీక్షించతగ్గ విషయాలు కావు - నవగోప్యాని కారయేత్ అనే తెగలోవి” అంటూ మనవిచేసుకోవడమైతే జరిగిందిగాని రాజుగారు యేమైనాసరే చూచి తీరాలని పట్టుపట్టినాంరట. “ఆలాగయితే చిత్తం రేపు మా జపం అయేటప్పటికి వక నిమ్మకాయంత బంగారాన్ని నలీ తొలీ లేని ముద్దగా వున్నదాన్ని సిద్ధంచేసి వుంచండి" అని శాస్రుల్లు గారు రాజాగారితో మనవిచేసి ఆజ్ఞ తీసుకుని స్వగృహానికి దయచేశారంట. అయితే శాస్రుల్లుగారు వూరికే ప్రజ్ఞ చూపడమే అనుకున్నారు కాని దీనిలో యేదో పండితులు పన్నిన కుతంత్రం వుందని లేశమున్నూ యెఱగరు. ప్రభువంతకంటే గుర్తించలేదు. ఆ తంత్రం యేమిటో ముందు తేలుతుంది కాబట్టి యిక్కడ విస్తరించేదిలేదు.

అదేరీతిని బంగారం సిద్ధంచేయించారు మహారాజావారు. పండితులందఱితోటి పరివేష్టించంబడి చూస్తూ వున్నారు. ఆ సమయంలో టక్కూ టుక్కూ మంటూ పాంకోళ్ల చప్పడుతో శాస్రుల్లుగారు చిన్న జారీ చెంబు సహితంగా దయచేసి ఆ బంగారు ఘటికమీంద ఆ జారీచెంబులోవున్న వుదకం ప్రోక్షించేటప్పటికి అది రెండుచెక్కలుగా “ఫడేలు" మని శబ్దంయిస్తూ విడిపోయిందంట! దాన్ని చూచేటప్పటికి రాజాగారికి అత్యాశ్చర్యమే కాకుండా మనస్సులో కొంత భయంకూడా కలిగిందంట. పండితులు ఆలోచించిన కుతంత్రము యీలా రాజావారికి భయం కలిగించాలనే. సరే గోపాలశాస్రుల్లుగారు మళ్లా స్వగృహానికి సెలవుపుచ్చుకొని దయచేశారు. పండితులు శాస్రుల్లుగారి ప్రజ్ఞావిశేషాన్ని పొగడుతూ ఉన్నట్లు అభినయిస్తూ రాజావారి మనస్సులోవున్న భయాన్ని మఱింత వృద్ధిచేశారు. మొత్తం రాజావారికి తుట్టతుద కేంతోcచిందంటే: వోహో ఈయన అందఱు పండితుల వంటివారుకారు. యీయన్ని సంస్థానంలో పెట్టుకోవడమంటే పులితో చెలగాటం వంటిది.