పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

183


ఆయా వృత్తులకోసం మళ్లా పాఁకులాడవలసిన కాలం తారస మవుతూవుందనే అంశం ఆ వ్యామోహం శూన్యం కావడంవల్ల అందఱికీ అనుభవంలోనే వుంది కనక విస్తరించను. నిన్న రాత్రి నేను పిఠాపురంలో వక సంపన్న గృహస్థులయింట విందుకు వెళ్లాను. అక్కడవున్న వంట బ్రాహ్మఁడు మెట్రుక్యులేషను చక్కఁగా అన్ని సబ్జట్లూ ప్యాసుచేసినవాఁడు. పూర్వకాలంలో వంటబ్రాహ్మలు యిట్టివారున్నారా? యీకాస్త ప్యాసుకూ వున్న నాలుగెకరాల భూమీ చెట్టెక్కింది. పనిపాటలు యమ్ యేలకే లేనప్పుడు మెట్రుక్యులేషనుకు దొరకడం యెక్కడ? అందుచేత పాపం! యీవృత్తి చేసుకుంటూ వున్నాఁడు. బ్రాహ్మఁడు కనక పనిపాటులు దొరకలేదనుకుందామా? అక్కఱలేదు. నాన్ బ్రామిన్సు కూడా ఇదే అవస్థ. కాస్త ఆలస్యంగా రాఁదలచి వున్నట్టు సూచనలు కనపడుతూవున్నాయి. "బబ్భావళ్యా మంతక స్సన్నివిష్టః" బ్రాహ్మణులను బ్రాహ్మణేతరులు అణఁగఁదొక్కితే వారిని హరిజనులు అణఁగఁదొక్కుతారని సూచనలు కనపడుతూ వున్నాయి- వక సంపన్న గృహస్టు మా బంధువులలోనే వుండేవాcడు. ఆయన కావడానికి పురోహితుఁడేకాని యెందఱినో పోషించాఁడు. కొడుకు లందఱికీ యింగ్లీషు చెప్పించాఁడు. వాళ్లు పౌరోహిత్యం చేయరుకదా! పనిపాటులో యెక్కడనుంచి వస్తాయి?- “యితో భ్రష్టస్తతో భ్రష్టః" అయింది. తుదకి పౌరోహిత్యం యితరు లాక్రమించుకున్నారు - అయితే వేశ్యాత్వం వకరు ఆక్రమించు కుంటారేమో? అని భయపడి స్వీకరించడంలోదికాదు. వేశ్యలందఱూ సంసారిణులుగా మాఱినా లోకానికి వచ్చేచిక్కున్నూ స్థూలదృష్టిని లేదనుకుందాం. ఆవృత్తిలో వున్న ప్రధానదోషం అందఱూ యేవగించుకోతగ్గది బహుపురుష సాంగత్యం. యే అదృష్టవంతురాలికోతప్ప వక్కడితో జీవితం తెల్లవారనిమాట సత్యం. యిదిపాశ్చాత్యకవులు రసాభాసంగా పరిగణించారో లేదో కాని మన కవులందఱూ రసాభాసమే అన్నారు - యీ దోషం యిప్పటిస్తీలందఱికీ సంక్రమింపచేయడానికి తగ్గబిల్లు విడాకులచట్టం వకటి రాఁబోతూవున్నట్టు అందఱూ యెఱిఁగినదే. అట్టిస్థితిలో ఆదోషాన్ని యేవగించుకోవడం యేమంత ప్రయోజనకారిగా వుంటుంది; కొద్దిభేదంవుంటే వుండనివ్వండి గాని ఆచట్టంవచ్చాక పాతివ్రత్యమనే మహాపదవి వేశ్యలతోపాటు యితరస్త్రీలల్లో కూడా నూటికి తొంభైపాళ్లు పోవలసిందే. యేపురుషుణ్ణి కట్టుకుంటే ఆ పురుషుఁడితోటే వుండడం పాతివ్రత్య మనిపించుకుంటుంది. ఆ పురుషుఁడి జీవిత కాలంలోఁగానీ, అనంతరమందు గానీ దానికి అన్యథాత్వం కలిగితే ఆ వ్రతానికి భంగం కలగక తప్పదు. భారతీయుల శాస్త్రాలన్నీ ఆసూత్రానికి కట్టుపడేవున్నాయి. అయితే యింత అసిధారావ్రతంగా బ్రతకడం దుర్ఘటంకాదా? అంటారేమో? అందుచేతే ఆ బిరుదును యేకొలఁదిమందో తప్ప, అందఱూ పొందలేక పోవడం. పొందలేకపోతే “పొందలేక పోయాంగదా” అని విచారించేవారు